ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం,
కళాధరావతంసకం విలాసిలోక రక్షకం
అనాయకైక నాయకం వినాశితెభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్.. [1]
తాత్పర్యము: సంతోషము తో ఉండ్రాళ్ళు పట్టుకొనువాడు, ఎల్లప్పుడూ మోక్షమిచ్చువాడు, అనాధులకు దిక్కుయినవాడు చంద్రుని తలపై అలంకరింకున్నవాడు, విల్లసిల్లులోకములను రక్షించువాడు, గజాసురుడును రక్షించినవాడు, భక్తుల పాపములను వెంటనే పోగొట్టువాడగు వినాయకుని నమస్కరించుచున్నాను.
నతేతరాతి భీకరమ్ నవోదితార్క భాస్వరమ్
నమత్ సురారి నిర్జరం నతాదికాప దుద్దరమ్
సురేశ్వరం నిధీశ్వరమ్ గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం.. [2]
సమస్త లోక శంకరం నిరస్తదైత్య కుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం.. [3]
తాత్పర్యము: సమస్తలోకాలకు మేలు చేయువాడు, మదించిన ఏనుగులవంటి రాక్షసులను సంహరించినవాడు, పెద్దబోజ్జ కలవాడు, శ్రేష్టుడు, గజముఖుడు, నాశములేనివాడు, దయతలచువాడు, సహనవంతుడు, సంతోషమునకు స్థానము అయినవాడు, కీర్తిని కలిగించువాడు, నమస్కరించువారికి మంచిమనస్సును ఇచ్చువాడు, ప్రకాశించువాడు అగు వినాయకుని నమస్కరించుచున్నాను.
అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం
ప్రపంచనాష భీషనమ్ ధనంజయాది భూషనమ్
కపోలదానవారణం భజే పురనవారణం.. [4]
తాత్పర్యము: దరిద్రులభాధాలను తొలగించువాడు వేదవాక్కులకు నిలయముయినవాడు, శివుని పెద్దకుమారుడు, రాక్షసుల గర్వమును అణగద్రోక్కువాడు, ప్రళయకాల భయంకరుడు, అగ్ని మొదలగు దేవతలకు అలంకారమైనవాడు, చెంపలపై మదజలము కారుచున్నవాడగు గజానుని సేవించుచున్నాను.
నితాంత కాంత దంతకాంతి మంతకాంత కాత్మజం
ఆచిన్త్యరూప మన్తహీన మంతరాయ కృంతనం
హ్రిదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంత మేవతం విచింతయామి సంతతం.. [5]
తాత్పర్యము: తలతలలాడు దంతము కలవాడు, యమునుని కూడా అంతమొందించు శివునికి పుత్రుడు, ఉహకందని రూపము కలవాడు, అంతము లేనివాడు, విఘ్నాలను భేదించువాడు అగు ఏకదంతుని ఎల్లప్పుడూ ద్యానించుచున్నాను.
ఫల స్తుతి
మహా గణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం
అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతి మభ్యుపైతి సోచిరాత్
తాత్పర్యము: ప్రతీదినము ప్రతకాలమున గణేశ్వరుని హృదయములో స్మరించుచు ఎవరు భక్తితో ఈ గణేశ పంచరత్న స్తోత్రమును పాటించునో అతను ఆరోగ్యమును, నిర్దోషిత్వమును, మంచి విద్యను, చక్కని సంతానమును పొంది చిరాయువై శీఘ్రముగా ఐశ్వర్యములును పొందును.