శుక్రవారం, నవంబర్ 09, 2012
జాణతనాలాడేవేలే జంపు గొల్లెతా, వోరి
ఆణిముత్యముల చల్ల లవి నీకు కొల్లలా
పోయవే కొసరుచల్ల బొంకుగొల్లెతా , వోరి
మాయింటి చల్లేల నీకు మనసయ్యీరా
మూయకువే చల్ల చాడిముచ్చు గొల్లెతా, వోరి
పోయవో పోవొ మాచల్ల పులు సేల నీకును
చిలుకవే గోరంజల్ల జిడ్డు గొల్లెతా , వోరి
పలచిని చల్ల నీకు బాతి గాదురా
కలచవే లోనిచల్ల గబ్బి గొల్లెతా , వోరి
తొలరా మా చల్లేల దొరవైతి నీకు
అమ్మకువే చల్లలు వయ్యారి గొల్లెత, వోరి
క్రమ్మర మాతోడనిట్టె గయ్యాళించేవు
సొమ్మెలం బోయేవేలె సొంపు గొల్లెతా, వోరి
దిమ్మరి కోనేటిరాయ తిరమైతి నీకును
గురువారం, నవంబర్ 08, 2012
|
మంచి - చెడు , సత్యం - అసత్యం , భయం -అభయం , సంతృప్తి - అసంతృప్తి |
మంచి - చెడు , సత్యం - అసత్యం , భయం -అభయం , సంతృప్తి - అసంతృప్తి ఇలాంటివి అన్ని మనకు ప్రేరణ కలిగించేవే . ఐతే భయాన్ని అదుపులో వుంచితే జాగ్రత్తగా పవర్తిస్తే అదే ప్రేరణగా వుపయోగపడుతుంది.
అలాగే మనచుట్టూవున్నా వాతావరణం నుండే ప్రేరణ పుడుతుంది. అది పాజిటివ్ ప్రేరణ కావచ్చు, లేదా నేగేటివ్ ప్రేరణ కావచ్చు. దీనికి సంభందించిన ఒక కదా వుంది. అది ఏమిటంటే
ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు వున్నారు . వారిలో ఒకడు పచ్చి తాగుబోతుగా వుండి చెడు ,అసత్యం ,భయం , అసంతృప్తి కలిగి జీవితం లో అన్ని కోల్పోయి నట్టువుంటాడు. రెండవ వాడు మంచిగా అబివృద్ధి చెంది , పెద్ద పారిశ్రామికవేత్తగా మంచి, సత్యవ్రతునిగా భయం లేని వానిగా సంతృప్తి కలిగి జీవితం లో వున్నత స్థానం లో వున్నాడు. ఇది గమనించిన ఒకతను ఆ అన్నాదమ్ముల దగ్గారుకు విడి విడిగా వెళ్లి " మీరు ఇద్దరూ ఒక ఇంటిలో వారే కదా మరి ఒకరు మంచి గా మరొకరు చెడుగా ఎలా వున్నారు"? అని అడిగాడు. ముందుగా తాగు భోతు ని అడగగా" మానాన్నాతాగుతాడు . మా నాన్న దగ్గరనుండి ఈ లక్షణాలు నాకు అబ్బాయి" . అందుకే ఇలా తయారయ్యాను అన్నాడు .
రెండవ వాడిని అడుగగా" మానాన్న కష్టపడి పని చేసేవాడు .ఈనాడు నేను ఈ స్థాయి లో వుండటానికి మా నాన్నగారే ప్రేరణ" అని సమాధానం ఇచ్చాడు.
ఇందులో మనం అర్ధం చేసుకోవలసింది వారి తండ్రికి రెండు లక్షణాలు వున్నాయి . మంచి - చెడు వున్నాయి . వాటిలో చెడ్డ లక్షణాలను ఆదర్శం గా ఒకడు తీసుకొని నెగెటివ్ ప్రేరణకు గురి అయ్యాడు. వాటిలో మంచి లక్షణాలను మరొకడు ఆదర్శం గా తీసుకొని పాజిటివ్ ప్రేరణకు గురి అయ్యి మంచి స్థాయిని చేరాడు .
ప్రతీ మనిషి లో పోజిటివ్ నెగెటివ్ లక్షణాలు వుంటాయి. మనం వాటి లో పాజిటివ్ ప్రేరణ మాత్రమె తీసుకోవాలి . అలా అయితేనే గోప్పవారిమి అవ్వగాలము.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ