Blogger Widgets

శుక్రవారం, డిసెంబర్ 14, 2012

ధనుర్మాసం అనగా

శుక్రవారం, డిసెంబర్ 14, 2012

ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాసం వచ్చింది దనుర్మాసం కూడా మొదలు కాబోతుంది. ఎంతో విశేషమైన రోజులు.  ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి పాడిన ౩౦ పాశురాలును పాడతారు  ఇది చాలా విశేషమైననెల. 
అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజులు రోజుకు ఒక పాశురమ్  చదువుతారు . ఇలా 30 రోజులు పాశురములు నివేదిస్తారు.
శ్రీశైలేశ దయాపాత్రం  ప్రవచనం 

శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్ |
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్ ||
లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం ||


యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ

వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే |
అస్మద్గురోర్ భగవతోస్య దయైకసిన్ధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||


మాతా పితా యువతయ స్తనయా విభూతిః 

సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ |
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా ||


భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ

శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ |
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్
శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్ ||


కల్పాదౌ హరిణాస్వయంజనహితం దృష్ట్వైవ సర్వాత్మ్నాం

ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం  |
సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యేపురే
జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాంస్తుమ: ||

ఈ పాశురాలన్ని ఆండాలమ్మ తల్లి ధనుర్మాస వ్రతము చేసి రోజుకో పాశురం ఆశువుగా పాడి ౩౦ రోజులు నియమనిష్టలతో వ్రతము చేసి . ఆ పాండురంగనుని వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైనది.  అలాంటి గోదాదేవి చేసిన వ్రతము మనమూ చేద్దాం . అయితే ఆ అమ్మకు భక్తితో నమస్కార రూపమున శ్రి శ్రీ శ్రీ పరాసుర భట్తరువారు ఈ శ్లోకం తో విన్నవించారు.  ప్రవచనం 

నీలా తుంగస్తన గిరితటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్ధ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ధ మధ్యాపయంతి
స్వోచ్చిస్టాయాం స్రజి నిగళితం యా బలాత్క్రుత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః       


అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగఱ్ఱ్కు
ప్పన్ను తిరుప్పావై ప్పల్పదియం ఇన్నిశైయాల్
పాడి కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై
శూడి కొడుత్తాళై చ్చోల్లు

శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్పావై
పాడియరుళవల్ల పల్-వళై యాయ్ నాడినీ
వేంగడవఱ్ఱ్కెన్నె  విది ఎన్ఱ ఇమ్మాఱ్ఱం
నాంగడవా వణ్ణమే నల్గు

శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .

మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే  ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి.  తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి  కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది.  మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం.  ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను.
.
గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.  నేను రేపు వ్రతం ఎలా చేయాలి దాని విశేషమ్ వివరిస్తాను.
అలానే మనం కూడా ఈధనుర్మాశమ్ వ్రతం చేద్దామ్.

గురువారం, డిసెంబర్ 13, 2012

కార్తీక పురాణం 30వ రోజు

గురువారం, డిసెంబర్ 13, 2012

కార్తికవ్రత మహిమ ఫలశ్రుతి నైమిశారణ్య ఆశ్రమములో శౌనికాది మహామునులకందరకు సుతమహాముని తెలియజేసిన విష్ణు మహిమలను , విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయి నోళ్ళకొనియాడిరి. శౌనికాది మునులకు ఇంకను సంశయములు తిరనందున, సుతునిగాంచి "ఓముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గ ములకు దాసులై, అత్యాచారపరులై జీవి౦చుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైన కలదా?ధర్మములన్నిటిలో మోక్షసాధన కుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొంసంగు వుత్తమ దైవమెవరు?మానవుని అవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగలవుపాయమేమి? హరి నమస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈసంశాయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియజేయు" మని కోరిరి. అంత సుతుడా ప్రశ్న నాలకించి" ఓమునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకోనవలసినవి. కలియుగమందలి మానవులు మంద బుద్దులు క్షణికసుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము వలన యాగాదిక్రతువు లోనర్చిన పుణ్యము, దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీ మన్నారాణునకు ప్రీతీకరమైన వ్రతము ఇది అన్నివ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు. ఆవ్రత మహిమ వర్ణించుట నాకు శక్తిచాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆబ్రహ్మదేవునికి కూడా శత్యముగాదు. అయినను సుక్ష్మముగా వివరించెదను. కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్దతులనుజెప్పు చున్నాను. శ్రద్దగా అలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పని సరిగ నది స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరి హరదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చెయవలయును . ఈనెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని, శివాలయమున గాని ఆవునేతిలో దీపారాధన చెయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపటణము చెయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులరాశి యందున్న నెలరోజులు యీవిధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి వుండి కూడా ఆచరించక గాని, లేక, ఆచరించువారలను జూచియెగతాళి చేసిన గాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడినవారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతరమందు నరకములోపడి యమకింకరులచేత నానా హింసలపాలుకాగలరు. అంతియే గాక అట్టివారు నూరుజన్మల వరకు ఛ౦డాలాది హీనజన్మలెత్తుదురు.
కార్తీకమాసములో కావేరి, నదిలోగాని, గంగానదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందుచెప్పిన విధముగా నిష్టతో ఆచరించినవారు యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది. అధికఫలదాయకయైనది. హరిహరాదులకు ప్రితికరమైనది. కనుక కార్తీకమాసవ్రతము వలన జన్మజన్మలను౦డి వారలకున్న సకలపాపములుహరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీవ్రత మాచరించవలెననెది కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యేవగింపు అసహ్యము కలుగును. కాన, ప్రతిమానవుడు ఈపరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యకాలమును చెతులారావిడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారలు కార్తీక శుద్దపౌర్ణమినాడు అయినను తమ శక్తీకొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజన మిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు, చేసినచొ యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెలరోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరి నామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్ధములను సేవిస్తూ, దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈకథను చదివినవారికిని శ్రీ మన్నారాయుణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠప్రాప్తి కలుగచేయును.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణ౦భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||

బుధవారం, డిసెంబర్ 12, 2012

రేడియో సంకేతాల ప్రసారం 12/12

బుధవారం, డిసెంబర్ 12, 2012

wireless receiver
12 /12 / 1901 లో అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటి మొట్టమొదట రేడియో సంకేతాలను ప్రసారం చేశారు. ఆ ప్రయోగము విజయవంతముగా పనిచేసింది.  దీంతో వైర్లెస్ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత వైర్‌లెస్ వ్యవస్థ వలన ఎన్నో ఉపయోగాలు కలిగాయి. నేడు తీగ లేకుండా సంకేతాలు పంపుతున్న, అందుకుంటున్న టెక్నాలజీకి ఆద్యుడు మార్కొని.  ఆ రేడియోని మార్కొని కనుకున్నారు దీని వలన అప్పట్లో ఒకరినుండి ఒకరికి కమ్యునికేషనికి బాగాఉపయోగించారు. అప్పడు తయారు చేసిన రేడియో చాలాచాలా  మార్పులు చెంది నేటి FM  వరకు రూపు దిద్దుకుంది.  ఈరోజుల్లో టీవీలు వున్నా  రేడియో  అంటే ప్రజలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు.  మనకు ఎక్కడ బడితే అక్కడ  రేడియో వినటానికి వీలుగా వుంది.  మనకు Online Radio లు కూడా ప్రజలుకు అందుబాటులోకి వచ్చాయి. Hats off to  మార్కొని.

Marconi Wireless Radio Wave meter

కార్తీక పురాణం 29వ రోజు

అంబరీషుడు దుర్వాసుని పూజించుట 
ద్వాదశి పారాయణము అత్రిమహాముని అగస్త్యు వారితో యీ విషముగా- సుదర్శన చక్రము అంబరీషునకభయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైనవైనము చెప్పి తిరిగి ఇట్లు నడువనారంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సు పైజల్లుకొని, " ఓమునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను నాశక్తికొలది నేను శ్రీ మన్నారయణుని సేవింతును, ద్వాదశివ్రతము జేసుకోనుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నావలన మీకు సంభవించిన కష్టమునకు నన్నుమన్ని౦పుడు. మీయెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్య మివ్వవలయునని ఆహ్వానిన్చితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించినన్నును, నావంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్రహృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించనను మరల నాగృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుధర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీవుపకరమును మరువలేకున్నాను. మహానుభావా! నా మనస్సంతోషమచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నానోట పలుకులురాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనందబాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుండును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నరజన్మ రాకుండా వుండేట్లును, సదా, మీ బోటి ముని శ్రేష్ఠులయందును- ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గల వాడనై యుండునట్లును నన్నశిర్విదించుడని ప్రార్ధించి, సహా ప౦క్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి " రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువుల కైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమాన మని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు తండ్రితో సమానుడవైనావు. నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు ఆయుక్షీణం కలుగును.

అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీకోరిక యీస్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్రయేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభావిన్చితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివేదిక్కయితివి. నీతో భోజనము చేయుట నాభాగ్యముగాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగంచి, అతని భక్తి ని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవుపొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఈ వ్రుతాంత్త మంతయు కార్తిక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది.
 ఓ అగస్త్యమహాముని! ద్వాదశివ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణు మూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్నమనస్కుడై చేసిన పుణ్యము యితర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తిక శుద్ధయేకదశి రోజున శుష్కోపవసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తన చే గడిపి ఆరాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూజాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీ మన్నారయణుని ప్రీతీ కొరకు దానము లిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీవ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీ మన్నానారయుణుకు ప్రీతీకరమైన దినము కనుక ఆనాడు ద్వాదశిఘడియలు తక్కువగా యున్నాను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంటములో స్థిర నివాస మేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టివారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతీకరమగు కార్తికశుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కర మైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్ష మైన విధముగా కార్తీక మాసములో నియమాను సారముగ జేసినాయేకొంచము పుణ్య మైనను, అది అవసానకాలమున యమదూతల పలుక నీయకకాపాడును. అందులకే యీ కార్తిక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును- అని అత్రి మహాముని అగస్త్యనకు బోధించిరి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)