గోదాదేవి గోపిక ఆ నాడు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రతఫలమును తానుకూడా పొందినది. శ్రీ కృష్ణసమాగామంమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీ రంగానాధుని భర్తగా పొందినది . శ్రీరంగమునుండి రంగనాధుడు వ్రత సమాప్తి సమయమునకు తమ అంతరంగా భక్తులను ఆండాలమ్మ యుండిన శ్రీ విల్లిపుత్తురునకుపంపి ఆమెను శ్రీ రంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను .అంత భట్తనాదులు వారి శి ష్యులు వల్లభారాయులుతో సహా శ్రీరంగమునకు ఆండాల్లమ్మను తోట్కుని వెళ్ళెను .అచట శ్రీ రంగనాధ స్వామీ అందరి సమక్షములో శ్రీ గోదాదేవినితనలోచేర్చుకున్నారు. అందుచే గోదారంగానాయకుల కళ్యాణ దినమునకు భోగి ఆని పేరు .
భోగము = పరమాత్మ అను భావము
అది పోందినరోజును భోగి పండుగగా సార్ధకమైనది .
ఈ మూడురోజులు పండుగ చాలా బాగాజరుపుకుంటారు. అసలైతే ఈ నెలరోజులు పండుగ వాతావరణమే వుంటుంది . చలి ఎక్కువుగాఉంటుంది. ఈ నెలరోజులు తెలుగువారి లోగిలి చాలా అందముగా ముస్తాబవుతుంది . ప్రతీ ఇంట రంగురంగుల ముగ్గులతో చక్కనివాతావరనముతో ముచ్చట గొల్పుతూ వుంటాయి. ఆ రంగుల ముగ్గు మద్యలో గొబ్బెమ్మలు ను అలంకరించుతారు. సాయంత్రముసమయాలలో పోలాల్లోనుమ్డి బళ్ళు ధాన్యపు బస్తాలతో నిండి వస్తాయి. చాలా ఆనందముగా సందడిగా ఉంటుంది . ఈ నెల రోజులు.ఆనెల రోజులు, పగటి వేషగాళ్ళు, హరిదాసులు ,గంగిరేద్దులువాళ్ళు వస్తూవుంటారు .
భోగి రోజు తెల్లవారుజాముననే లేచి నలుగు పెట్టుకొని స్నానాలుచేసి భోగి మంటను వెలిగిస్తారు . ఈ భోగి మంట లో పాత కర్రసమానులు వంటివి పనికిరాని వన్ని వేసి చలిని పారగోలుపుతారు. ఈ పెద్ద పండగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి తప్పకుండా వస్తారు.బావా మరదళ్ల ఆటలు అల్లర్లుతో పండుగ చాలా సంతోషకరమైన శోభ తో ఉంటుంది. ఈ పండుగని రైతుల పండుగ అని కుడా అంటారు.
ఈ పండుగకి ముగ్గులులో గొబ్బెమ్మలు పెడతారు వాటి చుట్టూ పిల్లలు అన్నమాచార్య రచించిన గొబ్బెమ్మల పాటలు పాడతారు.
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో
దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో
దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో
అనే పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతారు. సాయంత్రము సమయములో చిన్నపిల్లలకు బోగిపల్లును దిస్తితీసి వారి తలమీదపోస్తారు. దీనికి పెరంటాల్లను పిలిచి బోగిపళ్ళు పోస్తారు. ఈ బోగిపల్లలోకి శనగలు , పువ్వులు , అక్షింతలు, డబ్బులు, చెరుకుగడలు,రేగుపళ్ళు వేసి పిల్లలకు దిష్టితీసి తలమీదవేసి ఆసిర్వాదిస్తారు. బొమ్మల కొలువు పెట్టి పేరంటాలకి పసుపుకుంకుమలు ఇచ్చి దీవెనలుతీసుకుంటారు.
ఈ బోగి రోజు నెలరోజులు ధనుర్మాసము వ్రతము చేసిన గోదాదేవి రంగానాధునిని వివాహము చేసుకొని స్వామీ వారిలో ఐక్యముఅయిపోతుంది. అందువలన అప్పటినుండి భోగి రోజు గోదా రంగానాయకులవివాహాలు ఆలయాలలోజరుపుతారు. ఈ వివాహముచూడటానికి రెండుకళ్ళు చాలని విధముగా చేస్తారు. ఇలా భోగి పండుగ ముగుస్తుంది.
|
శనివారం, జనవరి 12, 2013
వివేకానందులవారి 150 వ జయంతి.
ఈరోజు వివేకానందులవారి 150 వ జయంతి. ఈరోజును మనందంరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈసందర్బములో వివేకానందులవారి జీవితంలో జరిగిన ఒక మంచి సరదా అయిన సన్నివేసాన్ని గుర్తుచేసుకుందాము. ఒకరోజు వివేకానందులు ఏ విధమైన సమాచారం లేకుండా అమెరికా నుండి ఈజిప్ట్ ద్వారా బొంబాయికి ఓడలో వచ్చాడు.అక్కడి నుండి కలకత్తాకు రైలులో వచ్చాడు.స్వామీ వివేకానందులు అప్పుడు బ్రిటిష్ దుస్తులు ధరించి ఉన్నాడు.కలకత్తాలోని మఠం దగ్గరికి వెళ్ళి గోడ దూకి లోనికి వెళ్ళాడు.అప్పుడు మఠం లోని స్వాములు భోజనం చేయు సమయం.దూరం నుండి బ్రిటిష్ దుస్తులలో ఉన్న వివేకానందులను వారు గుర్తించలేక భయపడి స్వామి వివేకానందుల వద్దకు కర్రలతో పరుగెత్తుకొచ్చారు.దగ్గరికి వచ్చిన తర్వాత గుర్తించి సంతోషం పట్టలేకపోయి మఠం అంతా చాటింపు వేశారు.తోటి స్వాములతో వివేకానందులు ” మళ్ళీ ఆలస్యం ఐతే భోజనపదార్థాలు అయిపోతాయని గోడ దూకి వచ్చాను”అని అన్నాడు.అంత ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం అలసట లేక హాస్యాన్ని పండించడం చూసి ఆ స్వాములు ఆనందించారు.
శుక్రవారం, జనవరి 11, 2013
తిరుప్పావై (కఱవైగళ్ పిన్ శెన్ఱు)28వ పాశురము
శుక్రవారం, జనవరి 11, 2013
గోపికలు శ్రీ కృష్ణునితో అన్నారు మేము మార్గ శీర్ష స్నానము చేయవలెనని వచ్చాము . మాకు మా వ్రతమునకు కావలసిన పరికరములు అడిగారు. ఆ వ్రతము చేసిన తర్వాత తామూ పొందవలసిన ఆభరణములను, వస్త్రములను, భోగములను ప్రార్దిమ్చినారు .
శ్రీ కృష్ణునకు వారు హృదయము తెలియును. ఇదంతయు లుకిక వ్రత గాధ కాదు. వీరు కోరునవి లుకిక వ్రతోపకరనములు కావు. ఆముష్మిక ఫలమునండుతకే వీరు కోరుచున్నారు. కాని వీరి నోటివేమ్తనే దానిని చెప్పిమ్చవలెను అని తలంచి ఇట్లు అడిగినారు.
ఓ గోపికలారా ! మీరు కోరినవన్నియు చాలా చక్కగా వున్నాయి. మీరు " పరిశీలించి కృపచేయమని" అనిఅన్నారు.
కదా పరిశీలించినా మీ అభిప్రాయమేమో నాకు తోచటంలేదు. వ్రతము చేసి మహత్తరమైన అలంకరనములను భోగములను అందవలెనన్నా దానికొక అదికారము ఉండాలి కదా? ఫలమునాశించిన మీరు ఆ ఫలాప్రాప్తికి ఏదోఒక యత్నము కుడా చేసి యుండాలి కదా? మా కది కావాలని అన్నంత మాత్రమున నేను ఇచ్చుటకు వీలుకాదు. దానికి తగిన యోగ్యతా మీకున్న ఇవ్వగలను. కావున మీకున్న అధికారము అనగా మీ యోగ్యతా ఎట్టిదో వివరించుము. ఫలమును అందగోరు వారు దానికి సాధనమునుగూడ సంపాదిమ్పవలేనుగాడా? మీరు అట్టి సాధనమును దేనినైనా ఆర్జించినారా ?
ఇట్లు అడుగగానే గోపికలు తమ హృదయము విప్పి చెప్పుచున్నారు .
గోపికలు కామ్క్షిమ్చునది పరమ పుశార్ధముఅగు నారంట భగవత్ పురక భవత్కైమ్కర్యము. దానికి వరేమియు యోగ్య తను సంపాదించుకొని రాలేదు . పరమాత్మే ఉపాయముగా నమ్మిన వారు, వాటి కంటే వేరే ఉపాయము తాము పొందుటకు ప్రతిభందకములని తెలుసుకున్నవారు. కర్మలు చేసి, జ్ఞానము సంపాదించి, భక్తి తో ఉపాసించి పరమాత్మను పొందాలని తలంపు వీరికి లేదు. వాడె వానిని పొందించ వలెనని నమ్మినవారు. అందుచే ఇట్లు భగవానుడే యుపాయమని నమ్మకము కలవారు. భగవానుని ముందు ఏమి విజ్ఞాపనము చేయవలెనో ఆమాటలను గోపికలు ఈ పాసురమున వివరిచుచున్నారు .

కఱవైగళ్ పిన్ శెన్ఱు పాశురము :
కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్
తాత్పర్యము:
పశువుల వెంట వానిని మేపుటకై అడవికిపోయి. అచటనే శుచినియమములు లేక తిని, జీవిమ్చియుమ్డుతయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియు జ్ఞానములేని మాగోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మిచిన పుణ్యమే మాకున్న పుణ్యము . మాకెన్ని లోపాలున్నా తీర్చగాల్గినట్లు ఏ లోపము లేని వాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ ! నీతో మాకుగల సంబంధము పోగొట్టుకోన వీలుకాదు . లోక మర్యాదనేరుగని పిల్లలము. అందుచే ప్రేమవలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక ఉండకుము. మాకు ఆపేక్షితమగు పరను పరను ఇవ్వుము.
లేబుళ్లు:
తిరుప్పావై,
దేవదేవం భజె,
పండగలు,
పద్యాలు,
పాటలు,
Events,
photos,
puja
గురువారం, జనవరి 10, 2013
తిరుప్పావై (కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై ) 27వ పాశురము
గురువారం, జనవరి 10, 2013
గోపికలు తామూ ఆచరించబోవు మార్గ శీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవిమ్చినారు. అందు వారడిగిన ద్రవ్యములు సులభాములేయైననాను వారు కోరిన వారు కోరిన గునముఅలు గల ద్రవ్యము దుర్లభాములు. అందుచే శ్రీ కృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను గోరుట కాదు , నన్నే కోరి వీరీ వస్తువులను కోరినారు. అనుకొనెను.పాచజన్యమును పోలిన శంఖములను కోరారు. మరి అల్లాంటి శంఖము దొరకదు. ఆ శంఖము శ్రీ కృష్ణుని వీడదు. అందుచే శ్రీ కృష్ణుడే శంఖధరుడై తమతో నుండవలెనని వారు కోరారు.
చల్లా పెద్ద పర కావలెనని గోపికలు కోరారు . శ్రీ కృష్ణుడు త్రివిక్రమావతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పరయోకటి కలదు. శ్రీ కృష్ణ రుపముననున్న నేను కుంభ నృత్యము చేయునప్పుడు కట్టుకొని వాయించిన పర చాల పెద్ద పర. ఈ మూడింటిని ఇచ్చెదనని శ్రీ కృష్ణుడు గోపికలకు చెప్పెను. మంగళా శాసనము చేయువారు కావలెనని కోరిరి. మంగళా శాసనము చేయువారెచట నున్న పరమాత్మయే వారి వెంట నుండునని వీరీ అభిప్రాయము.
తమ దేవేరియగు శ్రీ మహాలక్ష్మి నే మంగళ దీపముగా వారితో ఉండునట్లు అంగీకరించెను . జెండా గరుత్మంతుడు . వారికి గరుడునికుడా ఒసగుటకు శ్రీ కృష్ణుడు సమ్మతించెను.
తరువాత చాందినీగా అనంతునే పంపనంగీకరించెను. మధురా నగరమున జన్మించి వ్రేపల్లెకు వచ్చిన ఆ రాత్రి వర్షమున శ్రీ కృష్ణునకు మేలు కట్టుగా తన పడగలనుపయోగించిన మహానీయుడు కదా! అనంతుడు, పడగ, ఆసనము, వస్త్రము, పాదుకలు, తలగడ, చత్రము, చాందిని మొదలగున్నవి విధముల సర్వేస్వరునకు తన శరీరమును భిన్న భిన్న రుపములుగాకుర్చి యుపయోగపడి తనచేతలచే శేషుడు అను పేరు పొందిన మహనీయుడు. వీరు కూడా శేషత్వమునే కోరుతున్నవారగుటచే , శేషునే వారికి చాందినిగా ఇచ్చెను .
ఇలా పరికరములన్నీ సమకూరినవి కదా ! ఇక మీ వ్రతమునకు ఫలమేమో వివరించమని స్వామీ కోరగా . గోపికలు ఈ పాసురమున ఈ వ్రతాచరణముచే తామూ పోందకోరిన ఫలమును వివరించుచున్నారు. ఈ పాసురము విశేషమైనది నేటి నివేదన చక్కెరపోంగళి ఆరగింపుగాఇస్తారు. గోపికలు ఈ పాసురము రోజు 108 గిన్నెలు చెక్కరపొంగలి నెయ్యి ఎక్కువ వేసి మోచేతి నుండి కారునట్లు వేసిచేస్తారు. ఎందుకుఅంటే 26 రోజులు వీరు నెయ్యి వాడలేదు కదా. అందువల్ల ఈ పాసురము రోజు మంచిగా చెక్కెర పొంగలి నివేదిస్తారు.
చల్లా పెద్ద పర కావలెనని గోపికలు కోరారు . శ్రీ కృష్ణుడు త్రివిక్రమావతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పరయోకటి కలదు. శ్రీ కృష్ణ రుపముననున్న నేను కుంభ నృత్యము చేయునప్పుడు కట్టుకొని వాయించిన పర చాల పెద్ద పర. ఈ మూడింటిని ఇచ్చెదనని శ్రీ కృష్ణుడు గోపికలకు చెప్పెను. మంగళా శాసనము చేయువారు కావలెనని కోరిరి. మంగళా శాసనము చేయువారెచట నున్న పరమాత్మయే వారి వెంట నుండునని వీరీ అభిప్రాయము.
తమ దేవేరియగు శ్రీ మహాలక్ష్మి నే మంగళ దీపముగా వారితో ఉండునట్లు అంగీకరించెను . జెండా గరుత్మంతుడు . వారికి గరుడునికుడా ఒసగుటకు శ్రీ కృష్ణుడు సమ్మతించెను.
తరువాత చాందినీగా అనంతునే పంపనంగీకరించెను. మధురా నగరమున జన్మించి వ్రేపల్లెకు వచ్చిన ఆ రాత్రి వర్షమున శ్రీ కృష్ణునకు మేలు కట్టుగా తన పడగలనుపయోగించిన మహానీయుడు కదా! అనంతుడు, పడగ, ఆసనము, వస్త్రము, పాదుకలు, తలగడ, చత్రము, చాందిని మొదలగున్నవి విధముల సర్వేస్వరునకు తన శరీరమును భిన్న భిన్న రుపములుగాకుర్చి యుపయోగపడి తనచేతలచే శేషుడు అను పేరు పొందిన మహనీయుడు. వీరు కూడా శేషత్వమునే కోరుతున్నవారగుటచే , శేషునే వారికి చాందినిగా ఇచ్చెను .
ఇలా పరికరములన్నీ సమకూరినవి కదా ! ఇక మీ వ్రతమునకు ఫలమేమో వివరించమని స్వామీ కోరగా . గోపికలు ఈ పాసురమున ఈ వ్రతాచరణముచే తామూ పోందకోరిన ఫలమును వివరించుచున్నారు. ఈ పాసురము విశేషమైనది నేటి నివేదన చక్కెరపోంగళి ఆరగింపుగాఇస్తారు. గోపికలు ఈ పాసురము రోజు 108 గిన్నెలు చెక్కరపొంగలి నెయ్యి ఎక్కువ వేసి మోచేతి నుండి కారునట్లు వేసిచేస్తారు. ఎందుకుఅంటే 26 రోజులు వీరు నెయ్యి వాడలేదు కదా. అందువల్ల ఈ పాసురము రోజు మంచిగా చెక్కెర పొంగలి నివేదిస్తారు.

కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై పాశురము:
కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
తనతో కూడని శత్రువులను జయిమ్చేది కళ్యాణ గుణ సంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును. చేతులుకు గాజులు మొదలుగు ఆభరణములు , బాహువులకు డందకదియములు , చెవి క్రిందు భాగమున దాలెచేది దుద్దు, పై భాగమున పెట్టుకొనే కర్ణపువ్వులు, కాలి అందెలు మొదలుగు అనేక ఆభరణాలు మేము ధరించాలి. తరువాత మంచి చీరలను దాల్చి వుండాలి. దాని తరువాత పాలు అన్నము మున్నగున్నవి నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజిమ్చవలెను. గోపికలు తమ వ్రత ఫలమును ఇందులో వివరించారు.
లేబుళ్లు:
తిరుప్పావై,
దేవదేవం భజె,
పండగలు,
పద్యాలు,
పాటలు,
Events,
photos,
puja
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)



