ఆదివారం, మార్చి 03, 2013
Hey friends catch me live today (Sunday) show
with your little RJ Sree Vaishnavi
from 10:00 am to 12:00 pm
only on( http://www.radiojosh.com/ )
RadioJoshLive
Masth Maza Masth Music :)
Fun with me
If you want to talk with me plz call these numbers
INDIA= +91 04042410008
USA = +19142147475
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
Thank You Very Much.
శనివారం, మార్చి 02, 2013
అమ్మమ్మ తాతయ్యల పెళ్ళిరోజు శుభాకాంక్షలు
మా అమ్మమ్మ తాతయ్యల పెళ్ళిరోజు మార్చి 3 వ తేదిన 38 వ పెళ్ళిరోజు జరుపుకుంటున్నారు. మా బ్లాగు ద్వారా మా అమ్మమ్మ శ్రీమతి చింతా.విజయలక్ష్మి, మా తాత శ్రీ చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేనేకాకుండా నాతోపాటు మీరందరూ కూడావారికీ 38వ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపండి మరి . అమ్మమ్మా, తాత మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.
గురువారం, ఫిబ్రవరి 28, 2013
మనదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 28 వ తారీఖున జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా జరుపుకుంటారు. ఆ రోజున అన్ని ప్రభుత్వ జాతీయ సంస్థలలోకి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు. ఉదాహరణకు ISRO వంటి సంస్థల్లోకి ముందస్తు అనుమతిలేకుండా ఆ రోజు ఎవరైనా వెళ్ళవచ్చును
ఫిబ్రవరి 28, 1928న సర్ సి.వి.రామన్, తన ‘రామన్ ఎఫెక్ట్’ను కనుగొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ రోజును భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కా రంలోను, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో సహకరించాడు. ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, ఇలా ఇంకా ఎన్నో సాధించాలనకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్తజ్ఞ్రుల పాత్ర విలువకట్టలేనిది అని అందరికి తెలిసినవిషయమే .రామన్ వర్ణపటములో ప్రధాన రేఖకు ఒకవైపు స్టోక్ రేఖలు క్రాంతి వంతమైన మరోవైపు ప్రతి స్టోక్ రేఖలు (కాంతిహీన రేఖలు) ఏర్పడటాన్ని పరిశీలించవచ్చు. ఈ దృగ్విషయాన్ని సర్.సి.వి. రామన్ ఫిబ్రవరి 28వ తేదీన వెలుగులోకి తేవడం చేత ఫిబ్రవరి 28వ తేదీని "జాతీయ విజ్ఞాన శాస్త్రదినము"గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజును "రామన్స్ డే" అని కూడ అంటారు. ప్రపంచం నలుదిశల రామన్ పేరు మారుమోగిపోయింది.
భారతఖండం ఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందింది 1930వ సంవత్సరం ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రామన్ కు లభించింది. ఫిబ్రవరి 28వ తేదీన దేశం నలుమూలల వైజ్ఞానిక సదస్సులు, చర్చాగోస్టులు, జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహా సమావేశాలు, విజ్ఞానశాస్త్ర ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసే సంబరాలు అంబరాన్ని అంటడం ప్రతి యేడాది ఆనవాయితీ. జాతీయ స్థాయిలో సైన్స్ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం ఈ నేషనల్ సైన్స్ డే లక్ష్యాలు.ఆధునిక విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం. అంతర్జాతీయ వైజ్ఞానిక - సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం భారతీయుడు కనుక్కోవడం భరతజాతికి గర్వకారణం.
1929 వ సంవత్సరము ఫిబ్రవరి 28 వ తేదిన నోబెల్ బహుమతి గ్రహీత అయిన తొలి బారతీయ భౌతిక శాస్త్రవేత్త
సర్ C .V . రామన్ తన రామన్ ఎఫ్ఫెక్ట్ ను కనుక్కున్న రోజు. ఈరోజును నేషనల్ సైన్సు డే గా జరుపుకుంటున్నారు. 1986 నుండి జరుపుకొంటున్నాం. సమాజం లో శాస్త్రీయ దృక్పదాన్ని, విజ్ఞనాన్ని పెపొందించ టానికి ఇది దోహదపడుతుందన్న ఉద్దేశం తో ఈ జాతీయ విజ్ఞాన దినోత్సవం ను జరుపుకుతున్నాం. నేషనల్ సైన్సు డే సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.
శనివారం, ఫిబ్రవరి 16, 2013
నమస్కారిస్తే ఆయురారోగ్యాలు, అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యడు.
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కర
దివార నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ll
ఓ ఆది దేవా ! నీకు నమస్కారము. భాస్కరా! నన్ను కరిణిమ్చు. ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.
మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు. ఇది సూర్యునికి సంబందించిన రోజు . ఇది ముఖ్యముగా సూర్యభగవానుని ఆరాధించు పండుగ. ఈ రోజు సూర్యడు తన రధమును ఉత్తరం దిక్కునకు మళ్ళించే రోజు.
ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని
"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి అర్గ్యమిస్తే అస్తిస్వర్యములిస్తాడు.
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రముతో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏ డురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు,శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
బ్లాగ్ మిత్రులందరికి రధసప్తమి శుభాకాంక్షలు
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ