Blogger Widgets

శనివారం, ఏప్రిల్ 13, 2013

కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడేయండి

శనివారం, ఏప్రిల్ 13, 2013

హాయ్! 

ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో  , సరదా సరదా మాటలతో ,  కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో ,  మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా,  రోజు అంతా సంతోషంగా వుంచటానికి  మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ చిన్ని  RJ Sree Vaishnavi ని .  ఎలా అంటే ప్రతీ ఆదివారము    10:00 am to 12:00 pm వరకు  మీ అభిమాన online RadioJoshLive Masth Maza Masth Music :)  లో  నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా! 
మరి నాతో మాట్లాడాలి అంటే   ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి .  
INDIA= +91 04042410008
USA = +19142147475
Skype Me™!
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com

గురువారం, ఏప్రిల్ 11, 2013

కొత్త రోజుకి కొత్తరోజు

గురువారం, ఏప్రిల్ 11, 2013

ఉగాది తెలుగు వారి పండుగ ఈ పండుగ తో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగనే సంవత్సరాధి అని కూడా అంటారు. ఈ సంవత్సరం పేరు   విజయ .  దీనిని  విజయ నామసంవత్సరం అంటారు. 
ఉగాది పండుగరోజు ఉదయమునే లేచి, తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.  ఇంటిని మామిడితోరణాలతో పూలదండలతో అలంకరిస్తారు.  పరగడుపున ఉగాది పచ్చడి తినటం ఈ పండుగ ప్రత్యేకత. ఈ పచ్చడిలో చేదు, పులుపు, ఉప్పు, తీపి , వగరు, కారం అనే ఆరు రుచులు వుంటాయి. 
మరి పచ్చడి చెయడానికి  వేప పూత, మామిడి, ఉప్పు, బెల్లం, కారం, చింతపండు వేసి పచ్చడి తయారుచేస్తారు.
ఈ పచ్చడి జీవితంలో మనకు కలిగే తీపి లాంటి సుఖాలను, చేదులాంటి కష్టాలను,సమానంగా అనుభవించాలని తెలుపుతుంది.  ఈ పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.
ఈపచ్చడి  వసంతలక్ష్మి కి నైవేద్యంపెట్టి అందరు స్వీకరించి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానిస్తారు.
ఉగాది రోజు సాయంత్రం గుడి ఆవరణలో పురోహితుడు పంచాంగం వినిపిస్తారు.  రాబోయే సంవత్సర్ ఫలితాలు , పాడి ఫంటలు ఎలా వుంటాయో చెబుతారు. మనకు జరగబోయే మంచి చెడులు చెపుతారు.  దీన్నే పంచాగశ్రవణం అని అంటారు.  ఇది చాలా ఆసక్తికరంగావుంటుంది. ఈ పండుగ ను అందరు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అని  నాకు మా స్కూల్లో చెప్పారు.


యుగయుగాలు గడుపుతూ  యుగాది మళ్ళీ వచ్చింది
కొత్త రోజుకి కొత్తరోజు  కొత్త కొత్తది తెచ్చింది. .
చేయీ చేయీ కలపండి స్నేహ హస్తమీయండి
మనసు లోన ఉన్న చెడునంతా   మట్టి లోన కలపండి
మనసున  భేదభావమును  మానండి
బ్లాగుద్వారా తెలుగున వున్న అంద చందాలను లోకానికి చాటండి. 
దేశ భాషలందు తెలుగు లెస్స అన్న   
శ్రీ కృష్ణదేవరాయలు మాటలను రుజువు  చేద్దాం 
ఈ విధంగా నందన సంవత్సరానికి వీడ్కోలు తెలిపి   
విజయ నామ  సంవత్సరానికి స్వాగతమిద్దాం !
నవ యుగాదికి నవ్వుతు స్వాగతించుదాం .
అందరికి ఈ  విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు .
ఉగాది పండుగను  సంతోషంగా జరుపుకుందాం.

ఈ సంధర్భంగా నా బ్లాగు మిత్రులు అందరుకు విజయ  నామ సంవత్సర శుభాకాంక్షలు.

నా జన్మదినము

నేడు నా జన్మదినము కావునా మీరందరూ నన్ను ఆశిర్వదించండి.  అలాగే ఈరోజు ఉగాది కదా! అందరికి విజయనామ సంవత్సర శుభాకాంక్షలు. 

బుధవారం, ఏప్రిల్ 10, 2013

హోమియోపతీ

బుధవారం, ఏప్రిల్ 10, 2013

హోమియోపతీ మందులు అనగానే మాలాంటి పిల్లలకి చాలా ఇష్టం కదా!  హోమియోపతి  మెడిసిన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి.  అతిముఖ్యంగా భారత దేశంలో అత్యంత ఎక్కువగా  ప్రజలు వాడుతున్నట్టు ప్రపంచంలో ఇంకెక్కడా వాడటంలేదు.  ఈ హోమియోపతి మందును దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ దీనికి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయమైన ఆదారం  లేదట .  హోమియోపతీ అనగా  హోమోయిస్ ఒకే రకమైన బాధ, మరియు ఒక  రోగ లక్షణం.  ఇది  రెండు గ్రీకు మాటలని కలపగా వచ్చిన పదము. దీనిని పుట్టుకగురింఛిన విషయాలు తెలుసుకుందాం.  మనకు అతి సుపరిచితమైన సామెతలు వున్నాయి  ముల్లును ముల్లుతోనే తీయాలి మరియు  ఉష్ణం ఉష్ణేత శీతలే అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్ధం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ యొక్క  మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్.  ఈరోజు  సేమ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు అందుకే ఈ హోమియోపతి మందు గురించి  చెప్తున్నాను.  సేమ్యూల్ హానిమాన్  1755-1843 అనే జెర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి  వైద్యశాస్త్రం అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం తెసేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి అంతగా తెలియదనే చెప్పుకోవచ్చు . కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి తప్పులుగా అనిపించింది . ఈ తప్పులను మార్చటానికి ఈయన  కొత్త  పద్దతిని కనిపెట్టాడు. ఆ కొత్త పద్దతే హోమియోపతీ.  హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ మందులు నమ్మకము వున్నవారు  "ఇంగ్లీషు వైద్యాన్ని" ఎల్లోపతీ (allopathy) అనటం మొదలు పెట్టేరు.   పూర్వం నుండి హోమియోపతి మందులు వాడినంత కాలం ఆహారనియమాలు పాటించాలి అని చెప్పేవారు.  ex : onion వాడకూడదు అని ఇంకా అలాంటివి వుండేవి.  మారుతున్న కాలానికి అనుగుణంగా మందులు కూడా చాలా అభివృద్ధి చెందింది.  ఇప్పుడుఇప్పుడు ఆహారనియమాలు లేకుండా వాడుకునే విదంగా తయారు చేస్తున్నారు.  హోమియోపతి మందులు వాడితే ఎటువంటి అనారోగ్యమైనా శాశ్వితముగా తగ్గుతుంది అంటారు.  సేమ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు సందర్భముగా హోమియోపతి గురించి కొంచెం తెలుసుకున్నాం.  ఇంకో సందర్భములో మిగిలిన విషయాలు తెలుసుకుందాం.  హోమియోపతి వాడకమువల్ల  ప్రతికూల లేదా దుష్ప్రభావాలు లేకుండా నిశ్చయముగా నయంఅవ్వటం అనది విశేషముగా వుంది.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)