మంగళవారం, ఏప్రిల్ 16, 2013
మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులుగారి జన్మదినం నేడే.
గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.
వీరేశలింగం పంతులు 1848
ఏప్రిల్ 16న
రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని
కందుకూరు
గ్రామం నుండి రాజమండ్రికి
వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. వీరేశలింగంకు నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయారు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగారు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం
, అమరం
, రుక్మిణీ కళ్యాణం
, సుమతీ శతకం
, కృష్ణ శతకం
మొదలైనవి నేర్చుకున్నారు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరారు. చిన్నప్పటినుండీ, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవారు. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసారు.
ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు:
మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించారు
తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
తెలుగులో తొలి నవల రాసింది ఆయనే
తెలుగులో తొలి ప్రహసనం రాసింది కందుకూరి
పద్య కావ్యాలు, నాటకాలు, నవలలు, ప్రహసనాలు, కధలు, వ్యాసాలు,చరిత్రలు ఇంకా ఎన్నో రచనలు రాసారు . చాలా పత్రికలు కూడా నడిపారు. కందుకూరివారు ఎంతోమందికి ఆదర్సవంతముగా నిలిచారు అనటంలో సందేహం లేదంటే నమ్మండి .
ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసారు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన.యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణాల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27న మరణించారు.
సోమవారం, ఏప్రిల్ 15, 2013
గురునానక్ దేవ్ 1469 ఏప్రిల్ 15 న పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ మరియు ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును
స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్(ఏకైక దేవుడు)ని నమ్మతారు. సిక్కు మతము గురునానక్
ప్రభోధనల ఆధారంగా యేర్పడిన మతము. ఏకేశ్వరోపాసన వీరి అభిమతము. సిక్కు మతములో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంధము గురుగ్రంధ సాహిబ్
లేదా ఆది గ్రంధము లేదా ఆది గ్రంధ్
. వీరి పవిత్ర క్షేత్రము అమృత్ సర్
లోని స్వర్ణ మందిరము
. ఈ మతాన్ని అవలంబించేవారిని సిక్కులు అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా పంజాబు
(భారతదేశం మరియు పాకిస్తాన్) లలో నివసిస్తుంటారు. మరియు ప్రపంచమంతటా వ్యాపించియున్న సమూహం.
శిక్కు మతం, కాలంలో చూస్తే చాలా చిన్నది. దీని వయస్సు లూధర్ మతానికున్న వయస్సు ఎంతో అంత. దీనిని పదిహేనవ శతాబ్దంలో గురునానక్ స్థాపించాడు. గురునానక్ తల్వాండి (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నది) లో 1469 లో జన్మించాడు. గురునానక్ చిన్నప్పుడు నుండి ఎక్కడో చూస్తుండేవాడు. దేనిని గురించో దీర్ఘంగా ఆలోచిస్తుండేవాడు. అందువల్ల పెరిగి పెద్దవాడయ్యాక గూడా అతడికి ఈ ప్రాపంచిన విషయాలు రుచింవ లేదు. అతడు 1539 లో పరమపదించారు.
శిక్కులకు దేవుడు అమూర్తి సత్యసూత్రం. దీనినే వారు విశ్వసిస్తారు. " ఇది అనేకం కాదు ఒక్కటే" విశ్వాంతర్యామి. పుట్టదు. గిట్టదు. తిరిగి పుట్టడానికి ఇదే వారి ప్రార్థన. మూడవ గురువు ఇలా అన్నాడు
| అపూర్వ దేవతలను పూజించావారి జీవితాలు, నివాసాలు అభిశప్తాలవుతాయి వారి అన్నం - ప్రతిముద్ద - విషపూరితమవుతుంది వారి దుస్తులు విషమయాలవుతాయి వారిజీవితాలు కడగండ్ల పాలవుతాయి తదనంతర జీవితం నరకం |
|
ఇస్లాం లోని దైవాధీనతా వాదాన్ని బహిరంగంగానె వీరు నిరసించారు. "మీ జాతకాలను నిర్దేసించేది దేవుడు కాదు. మీ భవిష్యత్తును మీరే మలచుకోండి" అన్నాడు గురునానక్. శిక్కు మతం పునర్జన్మలను, కర్మవాదాన్ని అంగీకరిస్తుంది. కాని ఒకడు పునర్జన్మ శృంఖలాలనుంచి బయటపడాలంటే, ముక్తి పొందాలంటె, అతడు మానవుడు కావాలి. మనిషి అయితే (మానవత్వం ఉన్న) మోక్షం లభిస్తుంది. ఒకరు 8,400,000 జీవరూపాలను ఎత్తిన (జైన మతం ప్రకారం) తరువాత మోక్షం లభిస్తుందా. లెక తన వెలుగు దేవుని వెలుగులో మిళితం చేయడంతో ముక్తి లభిస్తుందా అనే విషయం అతడి జీవితం (మానవ జీవితం) నిర్ణయిస్తుంది.
మంత్ర పఠనం చేస్తూ "సత్ నాం, వహ్ గురు" (నిజమైన నామం అద్భుత గురువు) ను జపించడానికి శిక్కుమాంలో మంచి ప్రాముఖ్యం ఉంది. కాని గురువులు కేవలం మానవులు పదవ గురువు ఇలా అన్నాడు.
| నేనొక మతాన్ని స్థాపించి, దాని నియమాల నేర్పరుప నియుక్తుడయ్యాను నన్నెవడైనా దేవునిగా భావిస్తే అతడు అశక్తుడవుతాడు, వినాశమవుతాడు |
|
వారి మతంలో మానవ పూజ లేదు., ఏదైనా పూజింపబడితే అది ఒక పుస్తకం. "గ్రంథ సాహిబ్". ప్రత్యేక సమయాలలో దీనిని అట్ట నుంచి అట్ట వరకు చదువుతారు. కొన్ని గృహాలలో నిత్యం ఈ గ్రంథ భాగాలు పారాయణం చేయబడతాయి.
శనివారం, ఏప్రిల్ 13, 2013
హాయ్!
ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో , సరదా సరదా మాటలతో , కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో , మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా, రోజు అంతా సంతోషంగా వుంచటానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ చిన్ని RJ Sree Vaishnavi ని . ఎలా అంటే ప్రతీ ఆదివారము 10:00 am to 12:00 pm వరకు మీ అభిమాన online RadioJoshLive Masth Maza Masth Music :) లో నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా!
మరి నాతో మాట్లాడాలి అంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి .
INDIA= +91 04042410008
USA = +19142147475
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
గురువారం, ఏప్రిల్ 11, 2013
ఉగాది తెలుగు వారి పండుగ ఈ పండుగ తో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగనే సంవత్సరాధి అని కూడా అంటారు. ఈ సంవత్సరం పేరు విజయ . దీనిని విజయ నామసంవత్సరం అంటారు. ఉగాది పండుగరోజు ఉదయమునే లేచి, తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు. ఇంటిని మామిడితోరణాలతో పూలదండలతో అలంకరిస్తారు. పరగడుపున ఉగాది పచ్చడి తినటం ఈ పండుగ ప్రత్యేకత. ఈ పచ్చడిలో చేదు, పులుపు, ఉప్పు, తీపి , వగరు, కారం అనే ఆరు రుచులు వుంటాయి. మరి పచ్చడి చెయడానికి వేప పూత, మామిడి, ఉప్పు, బెల్లం, కారం, చింతపండు వేసి పచ్చడి తయారుచేస్తారు.ఈ పచ్చడి జీవితంలో మనకు కలిగే తీపి లాంటి సుఖాలను, చేదులాంటి కష్టాలను,సమానంగా అనుభవించాలని తెలుపుతుంది. ఈ పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.ఈపచ్చడి వసంతలక్ష్మి కి నైవేద్యంపెట్టి అందరు స్వీకరించి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానిస్తారు.ఉగాది రోజు సాయంత్రం గుడి ఆవరణలో పురోహితుడు పంచాంగం వినిపిస్తారు. రాబోయే సంవత్సర్ ఫలితాలు , పాడి ఫంటలు ఎలా వుంటాయో చెబుతారు. మనకు జరగబోయే మంచి చెడులు చెపుతారు. దీన్నే పంచాగశ్రవణం అని అంటారు. ఇది చాలా ఆసక్తికరంగావుంటుంది. ఈ పండుగ ను అందరు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అని నాకు మా స్కూల్లో చెప్పారు.
యుగయుగాలు గడుపుతూ యుగాది మళ్ళీ వచ్చింది
కొత్త రోజుకి కొత్తరోజు కొత్త కొత్తది తెచ్చింది. .
చేయీ చేయీ కలపండి స్నేహ హస్తమీయండి
మనసు లోన ఉన్న చెడునంతా మట్టి లోన కలపండి
మనసున భేదభావమును మానండి
బ్లాగుద్వారా తెలుగున వున్న అంద చందాలను లోకానికి చాటండి.
దేశ భాషలందు తెలుగు లెస్స అన్న
శ్రీ కృష్ణదేవరాయలు మాటలను రుజువు చేద్దాం
ఈ విధంగా నందన సంవత్సరానికి వీడ్కోలు తెలిపి
విజయ నామ సంవత్సరానికి స్వాగతమిద్దాం !
నవ యుగాదికి నవ్వుతు స్వాగతించుదాం .
అందరికి ఈ విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు .
ఉగాది పండుగను సంతోషంగా జరుపుకుందాం.
ఈ సంధర్భంగా నా బ్లాగు మిత్రులు అందరుకు విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ