రూథర్ ఫర్డ్ విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరు గలిగినవాడు. రాజుమంపగ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవి పేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవి పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు. తరువాత, 1923మే 7నకొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట.
ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేశి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.
రాజు మరణించాక పత్రికలు ఆయనను జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్‌గా, లెనిన్‌గా కీర్తించాయి. రాజు వీర స్వర్గమలంకరించాడని రాసాయి. సత్యాగ్రహి అనే పత్రిక రాజును జార్జి వాషింగ్టన్ తో పోల్చింది.
1929లో మహాత్మా గాంధీ ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. తరువాతి కాలంలో రాజు గురించి ఆయన ఇలా రాసాడు. శ్రీరామరాజువంటి అకుంఠిత సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము నేర్చుకొనదగినది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, సింపుల్ వ్యక్తి, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయనో హీరో.
సుభాష్ చంద్ర బోస్ ఇలా అన్నారు సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. .... భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరువకుందురు గాక.
"సీతారామరాజు" మీద పిల్లలతో ఎకపాత్రాభినయము చేయించేవారు. అప్పట్లో "సీతారామరాజు" బుర్రకధ ముగింపులో ఇలా చెప్పేవారు శ్రీ సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ! వీరుడు మరణింపడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది. అని పాడేవారు.
అల్లురివారు ఎంత గొప్ప విప్లవ వీరుడొ కదా!
శ్రీ సీతారామరాజుగారికి మనబ్లాగ్ ద్వారా నివాలితో నీరాజనాలు అర్పిస్తున్నాను.
పురాణాలలో శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ధరించాడు అని వుంది. విష్ణువు అవతారాలలో మొట్టమొదటి అవతారమే ఈ మత్స్యావతారం. ఈ అవతారములో రెండు ముఖ్యమైన పనులు చేసారు. అవి 1 ) ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. (2) వేదాలను కాపాడడం.
పూర్వం వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. సత్యవ్రతుడనే రాజర్షి మాలానదిలో తర్పణ మర్పిస్తూండగా . అప్పుడు అతని చేతిలోనికి ఒక చేపపిల్ల వచ్చింది. దానిని తిరిగి వదలి పెట్టబోగా అది తనను కాపాడమని కోరింది. సరే అని ఇంటికి తీసికొని వెళ్ళగా అది ఒక్క ఘడియలో చెంబుకంటె పెద్దదయ్యింది. ఇంకా పెద్ద పాత్రలో వేస్తే ఆ పాత్ర కూడా పట్టకుండా పెరిగింది. చెరువులో వేస్తే చెరువు చాలనంత పెరిగింది. నదిలో వేస్తె ఇంకా పెద్దయ్యింది. అప్పుడు రాజు "నీవెవరవు?" అని ఆ చేపను ప్రార్ధించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది.
"శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించు శ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి?" అని రాజు ప్రశ్నించాడు.
అప్పుడు చేపగా వచ్చిన పరమాత్ముడు అతనితో, " ఇంకొక వారంలో ప్రళయం రానున్నది. నా ఆజ్ఞ ప్రకారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. దానిలో అన్నిరకాల విత్తనాలు, ఔషదులూ, ఉంచు. సప్తర్షులు సకల జంతువులతో సహా వచ్చి నీ నావ ఎక్కుతారు. ప్రళయంలో ముల్లోకాలూ సముద్రంలో మునిగిపోయి , భయంకరమైన తుపాను వీస్తూ ఉంటుంది. భయపడకు. నా రక్ష వలన మీరు ఆ నావలో తిరుగగలుగుతారు. అంతా చీకటే అయినా సప్తర్షుల తేజస్సు మీకు వెలుగునిచ్చి కాపాడుతుంది. మీ దగ్గరకు ఒక పెద్ద చేప వస్తుంది. దానికి పెద్ద కొమ్ము ఉంటుంది. ఒక పెద్ద పాముతో మీ నావను దాని కొమ్ముకి కట్టు. ఆ చేప , బ్రహ్మ నిద్ర నుంచి లేచి కల్పం ఆరంభం అయ్యే వరకూ మిమ్ములని క్షేమంగా చూసుకుంటుంది" అని చెప్పి అంతర్థానమయ్యాడు. భగవంతుడు చెప్పినట్లుగానే తుపాను వచ్చింది. నావలో రాజర్షి సప్తర్షులతో, సమస్త బీజాలు , ఔషధాలు, జంతుజాలంతోనూ ఉంటుండగా , లక్ష యోజనాల పొడవు గల బంగారు చేప పెద్ద కొమ్ముతో వచ్చింది. దానికి రాజర్షి నమస్కరించి స్తోత్రం చేస్తూ , నావను దాని కొమ్ముకి పద్ద పాముతో కట్టాడు.
బ్రహ్మ మేలుకొన్నాకా ప్రళయం అంతమయింది. అప్పుడు నావలో ఋషులు స్తోత్రం చేస్తుండగా , మత్స్యావతారంలో ఉన్న పరమాత్ముడు వారికి మత్స్యపురాణ సంహితను చెప్పి , " బ్రహ్మ నిద్రలో ఉండగా వేదాలు అతని ముఖం నుండి బయటకు వచ్చాయి. దగ్గరలో ఉన్న హయగ్రీవుడనే రాక్షసుడు వాటిని యెత్తుకుపోతున్నది చూసి నేనీ అవతారంలో వాడిని సంహరించి , వేదాలను బ్రహ్మకు తిరిగి యెచ్చాను" అని వివరించాక , పరమాత్ముడు అంతర్థానమయ్యాడు. సత్య వ్రతుని కీర్తనలకు సంతోషించి శ్రీమత్స్యావతారమూర్తి అతనికి సాంఖ్యయోగ క్రియను, పురాణ సంహితను ఉపదేశించెను. అందరితోను, మూలబీజములతోను ఉన్న ఆ నావను ప్రళయాంభోనిధిని దాటించెను.
సత్యవ్రతుడు ప్రస్తుతం నడుస్తున్న "వైవస్వత మన్వంతరానికి" అధిపతి అయ్యాడు.
మత్స్యవతారాన్ని గురించి దాశరధి శతకము లోని కంచర్ల గోపన్న రాసిన మంచి పద్యం ఒకటి .