"Nightingale" of Carnatic music
ఆమె పాట పాడకపోతే దేవుళ్ళ క్కూడా తెల్లవారనే తెల్లవారదు!? తెరతీయగ రాదా అంటూ పాట పాడుతూ వుంటే ఆ దేవదేవుడు మేలుకోకుండా వుండగలడా. తన సుప్రభాత గీతంతో భగవంతుణ్ణి నిదురలేపే ఆ సంగీత ఆధ్యాత్మిక స్వరం ఆమె పొందిన గొప్పవరం. ఆమె కారణ జన్మురాలు అనటంలో ఎటువంటి సందేహము లేదు కదా!
" కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్ .....
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్ .....
అంటూ సాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రతీ తెలుగువాడి గుండెల్లోను భక్తి భావం కలుగుతుంది. ఆమె పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా, హాయిగా, ఆహ్లాదకరంగా వుంటుంది.
ఆమె ఎవరో కాదు మనం అందరికి M . S గా బాగా తెలిసిన మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి సంగీత సరస్వతి. మనదేశములో మొట్ట మొదటి సారిగా భారతరత్న పురస్కారం అందుకున్న గొప్ప గాయకురాలుగా చరిత్ర సృష్టించి ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రలో తన గానంతో అజరామరురాలు అయ్యారు. ప్రపంచంలో ఎవరైనా ఒకవేళ భారతీయుల సాంప్రదాయ వస్త్రధారణ ఎలా వుంటుందని అడిగితే ఒక్క మాటలో చెప్పగలిగే సమాధానమే ఎమ్మెస్. ఆమెను చూడగానే ఒక దేవతను చూసినట్టు వుంటుంది.
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ MS గురించి ఇలా అన్నారు "సుబ్బులక్ష్మి గారు సంగీతం రాణి నేను కేవలం ప్రధాన మంత్రిని". ఆమె ఎవరో కాదు మనం అందరికి M . S గా బాగా తెలిసిన మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి సంగీత సరస్వతి. మనదేశములో మొట్ట మొదటి సారిగా భారతరత్న పురస్కారం అందుకున్న గొప్ప గాయకురాలుగా చరిత్ర సృష్టించి ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రలో తన గానంతో అజరామరురాలు అయ్యారు. ప్రపంచంలో ఎవరైనా ఒకవేళ భారతీయుల సాంప్రదాయ వస్త్రధారణ ఎలా వుంటుందని అడిగితే ఒక్క మాటలో చెప్పగలిగే సమాధానమే ఎమ్మెస్. ఆమెను చూడగానే ఒక దేవతను చూసినట్టు వుంటుంది.
సుబ్బలక్ష్మి గారి జయంతి నేడు ఆమె జయంతి సందర్భముగా ఇక్కడ కొన్ని మంచి పాటల లింక్స్. వినండి.
- అఖిలాండేశ్వరి
- అన్నపూర్ణేశ్వరి
- బంటురీతి
- భావములోన
- భాగ్యద లక్ష్మి బారమ్మా
- భజ గోవిందం
- భావయామి గోపాల బాలం
- భావయామి రఘురామమం
- బ్రహ్మ కడిగిన పాదం
- బ్రోచేవారెవరురా
- దసన మదికో ఎన్నా
- దేవాది దేవ
- ఎందరోమహానుభావులు
- ఎవరిమాత
- గణేష పంచరత్నం (ముదాకరాత్త మోదకం)
- హనుమాన్ చాలీస
- జగదోద్దారన
- జో అచ్చుతానంద
- కాలై నిరాయ్ గణపతే
- కాన్చదలయదక్షి
- లక్ష్మి అష్టోత్తరం
- మరుగేలర
- మీరా భజన
- నారాయణ నిన్నే నమ్మేద
- నామ రామాయణం
- ఒకపరి ఒకపరి
- పాలించు కామాక్షి
- రామ రామ గుణసీమ
- సరగుణ పాలింప
- సీతమ్మ మాయమ్మ
- శివ శివ శివ భు
- శ్రీమన్నారాయణ
- శ్రీనివాస తిరువేంకట
- శ్రీ రంగ పుర విహార
- వనజాక్షి
- వేంకటేశ్వర సుప్రభాతం
- విష్ణు సహస్రం
సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భముగా ఆమె అభిమానులందరికి సుబ్బలక్ష్మి గారి జయంతి శుభాకాంక్షలు.