శుక్రవారం, అక్టోబర్ 25, 2013
పాబ్లో పికాసో స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం (cubism)ను ప్రోత్సహించిన కళాకారుడు. ఇతడు1881లో జన్మించాడు. 20వ శతాబ్ధంలో వచ్చిన చిత్రకారులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు . అతని పరిశోధక మేధస్సు చిత్రకళలో అనేక శైలులను, మాధ్యమాలను అనుసరించినది. పికాసో చిత్రించిన చిత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినవి. 1973లో మరణించాడు.
1901 లో చిత్రించిన "తల్లిప్రేమ'. 1937 ఏప్రియల్లో ప్రాంకో, జర్మన్ మిత్రపక్షాల పురాతన గుయోర్నికో రాజధాని బాస్క్ ను బాంబులతో నేలమట్టం చేసిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ పికాసో వేసిన చిత్రం- గుయెర్నికా(Guernica) ఓ గొప్పకళాఖండం. దీనిలో ఎద్దులను కిరాతక సైనికులకు, దౌర్జన్యానికి చిహ్నంగా, గుర్రాలను ఎదురు తిరిగిన ప్రజానీకానికి, సాత్వికత్వానికి చిహ్నంగా పికాసో చిత్రించాడు. ఈ చిత్ర ఇతివృత్తం ఎద్దుల కుమ్ములాట, అమాయకుల ఊచకోతగా అభివర్ణించి, ఈ చిత్రాన్ని చిత్రించి ప్రపంచానికి అందించాడు పికాసో.లే డెమొసెల్లిస్ డి అవినాన్(Les Demoiselles d" Avignon) కూడా గొప్ప కళాఖండమే. 1962 లో అతడు ఇంటర్నేషనల్ లెనిన్ పీస్ ప్రైజ్(International Lenin Peace Prize)ను అందుకొన్నాడు.
గురువారం, అక్టోబర్ 24, 2013
ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ.మొదటి ప్రపంచ యుద్ధం
తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి
(లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని
నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో
ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము193
దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా
, రష్యా
, బ్రిటన్
, చైనా
మరియు ఫ్రాన్స్
. ప్రధాన కార్యాలయం న్యూయార్క్
నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ
తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.
ఐక్యరాజ్య సమితి ఆశయాలు:
- యుద్ధాలు జరగకుండా చూడటం,
- అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం,
- దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడం,
- అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం,
- సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం.
ఐక్యరాజ్య సమితికి 6 ప్రధానాంగాలు కలవు.
- సర్వ ప్రతినిధి సభ
- భద్రతా మండలి
- సచివాలయం
- ధర్మ కర్తృత్వ మండలి
- ఆర్థిక, సాంఘిక మండలి
- అంతర్జాతీయ న్యాయస్థానం
సోమవారం, అక్టోబర్ 21, 2013
ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ (21 అక్టోబర్ 1833, స్టాక్‌హోం, స్వీడన్ – 10 డిసెంబర్ 1896, సన్రీమో, ఇటలీ)
ఆల్ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872)మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. ఈయన స్వీడన్
దేశంలోని స్టాక్‌హోంలో
అక్టోబర్ 21
1833
లో జన్మించాడు.ఆల్ఫ్రెడ్ తండ్రి ఇమాన్యుయెల్ ప్రముఖ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.ప్రముఖ స్వీడిష్
రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు డైనమైట్
ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్
అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ప్రతి సంవత్సరం జాతి మత ప్రాంత వివక్ష లేకుండా ‘మానవజాతి మేలుకోసం’ మహత్తరమైన కృషి చేసిన వారికి ఇవ్వబడతాయి. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో తనకు గల యావదాస్తి 90 లక్షల డాలర్ల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం అయిదు రంగాలలో బహుమతులను ఏర్పాటు చేయాలని నిర్దేశించాడు. భౌతిక, రసాయానిక, శరీర నిర్మాణ లేక వైద్య శాస్త్రాలలోను ఆదర్శవంతమైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన గ్రంధానికిగాను సాహిత్యంలోనూ, అంతర్జాతీయ రంగంలో శాంతికిగాను విశిష్ట సేవ చేసినందుకు ఈ బహుమతులు ఇవ్వాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ తన విల్లులో ప్రతిపాదన చేసాడు.కృత్రిమ మూలకము నోబెలియం
ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.
నేడు భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలలోనే కాకుండా... సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఈయన పేరుమీదన స్థాపించబడింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901 లో ఈ పురస్కారం ప్రారంభించబడింది (నోబెల్ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్ధం శాంతి బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్‌హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగాలలో విశేషమైన కృషి / పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు / పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.
అట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు
అయ్యో మీకు చెప్పడం మరచిపోయా ఈ పాట ఏమిటను కుంటున్నారా ? ఏమి లేదండి నేను చెప్తున్నది అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలు అడతారు. అన్నట్టు ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తదియ రోజు చాలా సంతోషం గా ఆడుకుంటారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. పొద్దు ఎక్కాగా తల స్నానం చేసి దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు .
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
ఒక వూర్లో రాజుగారమ్మాయి, వెలమవారి పిల్ల, బ్రాహ్మ్నవారి పిల్లా, కోమటిపిల్ల,నలుగురు వివాహం కాకముందు చిన్నతనంలో నే అట్లాతదియనోము చీద్దమనుకున్నారు తదియనాడు వుపవాసం వున్నారు.రాజుగారంమయి అతిసుకుమారి కనుక సాయింత్రం కాగానే ముఖము వాడి ముఉర్చపోయినది. వీదిలూనుంది అన్నగారు వచ్చి అమ్మా చెల్లెమ్మ ఏది అని అడుగుగా నాయనా అట్లతదియ నోము చేద్దమనుకుని వుపవాసముంది . చంద్రోదయం వరకు వుండలేక మూర్చపొయినధి అని చెప్పింది. అప్పుడు అన్నయ్య ఏమి దారని అలోచించి వెంటనే దురంగావున్న చింత చెట్టుకు అద్దం పెట్టి దానికి ఎదురుగా అగ్గిపెట్టి చెల్లిలిని లేపి అదిగో చంద్రుడు ఉదయించాడు అనిచెప్పగా నిద్రకలనవున్న నిజంగా చెంద్రుదని బావించి ,రాకుమారి ఫలహారంలు చేసెను. కొన్నాళ్ళకు వివాహం చేయగా వయసు మీద పడిన వాడు భర్తగా సంప్రప్తంయ్యేను. నీను అట్లతదియ నోము నోచినా నాకు ఇదేమీ ప్రారబ్దం అని భాద పడుతూ ఒకనాడు రాత్రి అడవికి వెళ్ళిపొయినది.
ఓ అమ్మాయి ఒంటరిగా ఈ అడవిలో ఎక్కడికి పూతున్నావని పార్వతి పరమేస్వరులు మారు వేషములో వచ్చీ అడుగగా నాయనా మీరేమైనా అర్చేవార తీర్చేవారా మీకెందుకు అని చెప్పి నడుస్తోంది. మీము ఆర్చేదము తీర్చేదము నీ సంగతి చెప్పు అని అడిగిరి . ఆచిన్నది వారికి నమస్కరించి వారి స్నేహితులుతో చేసిన నోము గురించి తనకు మాత్రమె ముసలి భర్త లబించాడని నాకు మాత్రమె ముసలి భర్త సంభవించటం నాకు కారణం ఏమి , నా పాపమా? అని తన భాదను వివరించింది.
వారు దానికి చిన్నదానా నీవ్రతం భంగమైనది నీ అన్నగారి వలన జరిగిన చర్య సవివరంగా చెప్పారు. జరిగినదాని నేను ఇప్పుడు ఏమి చేయ్యన్లని వారి అడుగగా మరలా ఆ వ్రతం నిస్తగా చేయ్య్మన్న్నారు. ఆమె తిరిగి రాజ్యాని కి చేరి తదియరోజు ఆ వ్రతం చేసినది. ముసలి భర్త మంచి అందమైన యువకుని గా మారెను. అది చుసి అన్ధరూ కారణమడుగగా జరిగిన వృతాంతం చెప్పెను . ఇది అట్ల తదియ నోము కదా…
ఈ కధ విని అక్షిమ్థలు తలమీద వేసుకొని చంద్రుని చూసి పదకొండు అట్లు వీసి ఒక ముత్తయ్దువకు ఇచ్చి తను నేయివధ్యం పెట్టుకున్న పదకొండు అట్లు తిన్నాలి .
ఇదండి అట్ల తద్ది నోము గురించి.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ