గురువారం, జనవరి 02, 2014
జీవరసాయన శాస్త్ర పరిశోధనలకు మొదటగా బంగారు బాట వేసినది డా.హరగోవింద ఖురానా . ఈయన పంజాబ్ లోని కుగ్రామం రాయ్‌పూర్‌లో 1922 జనవరి 2 న లో జన్మించారు. ఈ గ్రామము ప్రస్తుత పాకిస్థాన్‌లో ఉన్నది. ఆ గ్రామంలో పేదరికంలో పుట్టి పెరిగిన ఆయనకు 1968లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. Massachusetts Institute of Technology (MIT) జీవ, రసాయనిక శాస్త్ర విభాగాల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రొటీన్ల సంశ్లేషణలో ఆర్‌ఎన్‌ఏ సంకేతాల తీరుపై చేసిన పరిశోధనలు ఆయనకు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి.
మరో ఇద్దరితో కలసి ఆయన ఈ బహుమతిని పంచుకున్నారు. డీఎన్‌ఏ రసాయనిక ధర్మాలపై జరిపిన పరిశోధనలు ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. విస్కాన్సిన్ వర్సిటీలో 1960-70ల కాలంలో ఆయన సాగించిన పరిశోధనలు పలు భావి ఆవిష్కరణలకు దోహదపడ్డాయి. విస్కాన్సిన్‌లో దాదాపు దశాబ్దకాలం బోధన, పరిశోధనలు కొనసాగించిన తర్వాత ఆయన MITలో చేరారు. యువ శాస్త్రవేత్తలకు తర్ఫీదు ఇచ్చేందుకు తన ఎక్కువగా ఇష్టపడేవారు. రిటైరైన తర్వాత కూడా పలువురు యువ శాస్త్రవేత్తలు ఆయన వద్దకు వచ్చేవారని అన్నారు. పేదరికంలోనూ తమను చదివించేందుకు తన తండ్రి తన జీవితాన్నే అంకితం చేశారని ఖురానా తన ఆత్మకథలో రాసుకున్నారు. అతని విజయంలో ఒక సోదరి మరియు ముగ్గురు సోదరులు బాగా support గా నిలిచారని. తన తండ్రి బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వ నకు ఒక పట్వారి (ఒక వ్యవసాయ పన్నుclerk) గా పనిచేసేవారనీ .దాదాపు వంద కుటుంబాలు గల తమ స్వగ్రామంలో అక్షరాస్యత సాధించిన తొలి కుటుంబం తమదేనని ఆయన చెప్పుకున్నారు. ముల్తాన్ వద్ద హైస్కూలు విద్య పూర్తి చేసుకున్న ఖురానా, పంజాబ్ వర్సిటీ నుంచి 1943లో కెమిస్ట్రీలో డిగ్రీ, 1945లో బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్‌లో ఉండగానే, బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో చదువుకునేందుకు ఆయనకు స్కాలర్‌షిప్ లభించింది. అక్కడే ఆయన 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. స్విట్జర్లాండ్‌లోని ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్‌డాక్టరల్ పరిశోధనలు సాగించారు. తను ఈ స్తాయికి చేరటానికి జీవితంలో చాలా కష్టపడ్డారని తన biography లో రాసుకున్నారు.కేంబ్రిడ్జిలో మరో పోస్ట్‌డాక్టరల్ పరిశోధన చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీలో ఉద్యోగం లభించడంతో 1952లో వాంకోవర్ నగరానికి చేరుకున్నారు. అక్కడ ఎనిమిదేళ్లు ఉద్యోగం చేశాక, 1960లో అమెరికాలోని విస్కాన్సిన్ వర్సిటీలో చేరారు. అక్కడే ఆయన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంజైమ్ రీసెర్చ్ కోడెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, కీలకమైన పరిశోధనలు సాగించారు. ఈయన నవంబర్ 9 , 2011 న పరమపదించినారు.
మంగళవారం, డిసెంబర్ 31, 2013
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 2014
సోమవారం, డిసెంబర్ 23, 2013
ఇంతవరకు ముగ్గురు గోపికలను లేపినారు . ముదడవ గోపికను లేపుచున్నప్పుడు గేదెలు మొదలగున్నవి ఆహారము సంపాదించుటకు వెళ్తున్నాయని .అంటే తెల్లవారుటకు గుర్తుగా వారు గేదేలగురుంచి చెప్పారు. మిగిలిన పిల్లలు కుడా
అదేపోవటం అయితే వారి ని ఆపి నిన్ను పిలుచుటకు వచ్చాము.గుర్రపు నోటిని చీల్చిన వాడు ,మల్లురను చంపినవాడు అయిన పరమాత్మ మనలను చేరి మనము సేవించినచో అయ్యో, అయ్యో,అని భాదపడి మనలను పరామర్శించి కృపచేయును.
అటువంటి ప్రేమ మనకు కావాలికదా, అవి పరతంత్రాలు కదా. మనకి ప్రియమైన వానికి సేవలు చేయటమే కదా మన స్వరుఉపము. లెమ్ము ముందుగా లెమ్ము అని మూడవ గోపికను మేల్కొల్పినారు.
ఇంతవరకు ముగ్గురును లేపారు ఇప్పుడు నాల్గో గోపికను లేపుచున్నారు .ఈమె పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగావంతునికంటే వేరేఉపాయము లేదని . నమ్మినది . అలాంటి ఆమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. వీటిగురించి గీతలొ బాగా వివరించారు.
మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబదింధి. తరువాత పాశురములో మననము నిరూపించబదినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాస్టనందియున్న గోపిక ఈనాడు మేల్కొల్పబదుచున్నధి.
పాశురము :
తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మించబదిన మేడలో సుఖ శయ్యపై చుట్టును దీపములు వెల్గుచుండగా అగరు ధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా ! మణికవాటపుగడియ తీయుము. ఓయత్తా! నీవైనను ఆమెను లేపుము- నీకుమార్తెమూగదా? లేక చెవిటిదా ? లేక జాడ్యముకలదా? లేక ఎవరైన కదలిన ఒప్పమని కావలియున్నారా? లేక గాఢ నిద్రపట్టునట్లు మంత్రించినారా?
"మహామాయావీ ! మాధవా! వైకుంఠవాసా!" అని అనేక నామము లను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము.
ఈ సందర్బములో గోదాదేవి భగవంతునికీ భక్తునికి మధ్యా సంబంధమును వివరించినారు.
1. మనందరిని తండ్రి ఆయనే 2. మనందరిని రక్షించేవాడు ఆయనే 3. మనందరిని నావాల్లు అని కల్గిన వాడు ఆయనే- శేశి అంటార 4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు 5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే-జ్ఞేయము అంటారు 6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే 7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు 8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు 9. భోక్తా ఆయనే.
లోకంలో మనం ఎదో ఒక సంభందం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంభందం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంభందాలు కల్గి, శాశ్వతంగా వీడని సంభందం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! కుడా అదే ప్రేమ కల్గి వుంటుంది. ఈ విదముగా భగవద్ సంబందమును వివరించారు మన గోదామాత.
ఆదివారం, డిసెంబర్ 22, 2013
ఈ ధనుర్మాస వ్రతము చాలా విలక్షణమైన వ్రతము . ఈ వ్రతము వల్ల మన శరీరము మంచి అలవాట్లు నేర్చుకొనుటకు బాగా దోహదపడుతుందని అర్దమవుతుంది.
గోపికను లేపుటకు కీచు కీచు మని పక్షుల అరుపులు వినలేదా ? రేపల్లె గోపికలు తరచూ పెరుగు తరచుట నిత్యకృత్యములు . వారు పున్యస్త్రీలే . వారు తెల్లవారుజామున లేచి తలడువ్వుకొని పూలు ముడుచు కొని శ్రీ కృష్ణుని పాటలు పాడుతూ పెరుగు చిలుకుతారు. అప్పుడు పెరుగు చిలుకుతున్నప్పుడు వచ్చే శబ్దము ఆకాశానికి వ్యాపించే టంత ఎక్కువ వస్తుంది. అయితే వారు చిలుకుతున్నప్పుడు వారి మెడలో వున్న నగలు శబ్దములు కూడా వస్తున్నాయి కదా అవి నీకు వినబదటం లేదా ఓనాయకురాలా నీవు మిక్కిలి తెజస్సు కలదానివి . నీ తెజస్సు మాకు కనబడుతున్నది,తలుపు తెరువు నీ తెజస్సు చుచి మేము అనందించునట్లు చెయి. అని లేపారు.
ఇంతవరకు మేల్కొలినన పిల్లలిద్దరును తమతో చేర్చుకొని వారు ముందు నడచుచుండగా నిద్రపోతున్న మరో గోపికను లేపుటకు బయలుదేరారు.
ఆండాళ్ తల్లి మనిషి లక్ష్యం ఏమిటి ? వాటిని చేరుటకు ఏమిచేయ్యలని వారికి వేదాలలోని సారాన్ని తిరుప్పావై రూపములో వివరించింది. ఆ వివరణలోమైత్రేయి సహిత కాత్యాయిని యాజ్నవల్క్య మహర్షి గురించి వివరించింది. ఆమె మెట్ట వేదాంతమ్ వివరించలేదు. ఆమె మార్గమద్యలో ఏదిమమ్చిదొ ఏది చెడ్డదో అనుభవద్యులయిన పెద్ద వాళ్ల సలహాతీసుకొని ముందుకు సాగాలని వారికి ఏ ఋషి గురించి చెప్పింది. శ్రీ కృష్ణుని పొందుటకు తొందరగా లేచిరమ్మని మరో గోపికను లేపుతున్నారు.
పాశురం :
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము: తూర్పు తెల్లవారుతున్నది . చిన్న బీడులోనికి మేయుతకు విదువబడిన గేదెలు విచ్చలచీడిగా పోవుచున్నవి. మిగిన్లిన పిల్లందరును గుడా వ్రతస్తలమునకు పోవుటకు బయలుదేరి, అట్లు పోటమే తమకు ప్రయోజన మనునట్లు పోవుచున్నారు. ఆ పోయేవారిని మేము ఆపి మేము నిన్ను పిలుచుటకు నీవాకిట వచ్చి నిలచినాము . కుతూహలము కలదానా!.ఓ పడతీ! లేచి రా! కృష్ణుని గుణములు కీర్థించి వ్రతమున కుపకృమించి ప్రతసాధనమగు పరను పొంది, కేసి యను రాక్షసుని చీల్చి చంపినవానిని , మల్లురను మట్టుపట్టిన వానిని, దేవతలకు ఆది దేవుడైన వానిని మనము పోయి సేవించినచో అయ్యో ! అయ్యో! మీరే వచ్చితిరే.! అని భాదపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును.
అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి, భగవంతుని అనుగ్రహం మనపై పడేట్టు చేస్తుంది.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ