భగవదారణ పూర్వము లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవుటచేత తానోక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న యొక్క స్నేహితురాలిని గోదాదేవితో వచ్చినవారు మేల్కొల్పుతున్నారు. ఎట్లానగా ఆహారము సంపాదించుకోనుటకు పక్షులు గూళ్ళనుండి లేచి ధ్వని చేయుచు పోవుచ్చున్నవి. ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రండి రండి అని ఆహ్వానించుచున్నది. ఆ ధ్వని నీకు వినబడటంలేదా. ఓ పిల్లా! లే ! మేము ఎలా లేచామో తెలుసునా? పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురునికాలుతాపు తో కాలునివద్దకు పంపినవాడను. సముద్రజలముపై హంసతూలికా తల్పముకంటే సుఖకరమైన శేషశయ్య పై లోక రక్షణమునే ఆలోచించు యోగానిద్రననుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదములందు బంధించి మెల్లగా నిద్రమేల్కోను మునివర్యులు హరి హరి అని చేయు భగవన్నామ ధ్వని మా హృదయములో ప్రవేసించి మమ్ము నిద్రలేపినది. నీవు కూడా లేచి రమ్ము. అని నిద్రపోతున్న గోపికను గోదాదేవి చెలికత్తెలు లేపుతున్నారు.
హిందువుల పండుగలలో వైకుంఠ పదంతో రెండు ఉన్నాయి. ఒకటి వైకుంఠ చతుర్దశి, రెండు వైకుంఠ ఏకాదశి. అయితే ఈ రెండు పర్వాలు ఆంధ్ర ప్రాంతంలో వేరుపేర్లతో పిలుస్తారు.
వైకుంఠ ఏకాదశిని ఎక్కువగా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. కాలపరిగణనంలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌర మాన ప్రకారం జరిపే పండుగ. కర్కాటక సంక్రమణం, మకరసంక్రమ ణం మున్నగు పర్వాలవలె ఇది కూడ సౌరమానాన్ననుసరించి తెలుగు వారు జరిపే పండుగలలో ఒకటి. ధనుస్సు నెల పట్టిన తరువాత శుద్ధంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇది మార్గశిరంలో కాని, పుష్యంలో గాని వస్తుంది. ఇది వైష్ణవులకు, రామానుజ, మాధ్వమతస్థులకు చాలా ముఖ్య మైనది. అయినప్పటికీ దీనిని అందరూ ఈ ముక్కోటి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తారు. పంచాగ కర్తలు ఈనాటి వివరణలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, శ్రీరంగద్వారస్థ భగవదాలోకన మహోత్సవం అని వ్రాస్తారు.
ఒకటి స్వర్గ ద్వారం, రెండు ముక్కోటి, మూడు వైకుంఠం. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ, దక్షిణాయనంలో నిర్యాణమైనవారు స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణంచేత ఈ పండుగకు దక్షిణా దిని కొన్ని ప్రాంతాలలో స్వర్గ ద్వారం అనే నామం కూడా ఉంది. ఏడాదికి 24ఏకాదశులువస్తాయి.సూర్యుడుఉత్తరాయణానికిమారే ముందు వచ్చేపుష్య శుద్ధ ఏకాదశినేవైకుంఠ ఏకాదశిలేదాముక్కోటి ఏకాదశిఅంటారు. ఈ రోజునవైకుంఠవాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారంవద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజుమహావిష్ణువుగరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్లఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
ఈ రోజుకు ఇంకోప్రత్యేకత వుంది అదేంటి అంటే ఈ రోజునే గీతజయంతి.
మహాభారతంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశమే గీత. గీతలో మొదటి శ్లోకం
ధృతరాష్ట్ర ఉవాచ:
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులూ మరియు పాండురాజు తనయులు యుద్దము చేయగొరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
అనే విషయంతో మొదలవుతుంది భగవద్గీత.
హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు. ఈ రోజు కౌరవ రాజు దృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు. భగవత్ గీత భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామ భూమి లో ఉపదేశిస్తాడు.అన్ని సంధి ప్రయత్నాలూ విఫలమైన తర్వాత, యుద్ధం ప్రకటిస్తారు పాండవులు. సంగ్రామ భూమిమీద అడుగు పెట్టిన తర్వాత ఆ మహా సైన్యం చూసి, వారిలో తన తాత అయిన భీష్ముడు వంటి వారిని చూసి నేను యుద్ధం చేయలేను అని అస్త్త్రాలు విడిచి పెట్టాడు. అప్పుడు శ్రీ కృష్ణులు వారు గీతోపదేశం చేసారు. దాని సారం శాంతి. కృష్ణుడు అర్జునుడుతో ఇలా ఇన్నారు.
ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తెలేదుకదా. వట్టి చేతులతో వచ్చావు ! పోయేటప్పుడు లగేజిలతో పొవాలనుకుంటున్నావు! అందుకే నీకంత యాతన. నువ్వేమి తెచ్చావని -నువ్వు పోగొట్టుకున్తున్నావు. నీవేమి సృస్తిమ్చావని నీకు నష్టం వచ్చింది? నువ్వు ఏదైతే పోదావో అది ఇక్కడనుండే పోదావు. ఏదైతే ఇచ్చావో అదీ ఇక్కడనుండే ఇచ్చావు.
ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం , రేపు ఇంకొకరి సొంతం కాగలదు. కావున జరిగేది జరుగక మానదు . అనవసరంగా ఆందోళన చెందకు . ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపంలేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా భగవంతుని ప్రసాదంగా స్వీకరించు అన్నారు.
సుమారు 6,000 సంవత్సరాల పుర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గం లో నడిపిస్తుంది. అనటంలో ఎటువంటి సందేహం లేదు.
మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే అదే అదృష్టంగా బావిస్తాము. అన్నిటిలోనూ మనం అనుకున్నది జరగక పొతే అప్పుడు మనం అనుకుంటాం మనకు ఆ గీత రాసి లేదు అనుకుంటాము. మన గీత లోనే వుంది భగవద్గీత. అడితెలిసినవాడు ఎటువంటి భాధకు లోనుకాడు. గీతను శ్రీ క్రిష్ణులవారు ద్వాపరయుగం చివర లో అనగా కలియుగానికి ప్రారంబం లో జరిగింది. జగత్గురు శ్రీ కృష్ణులు కార్తీక బహుళ అమావాస్యనాడు చెప్పారు. ఉపనిషిత్తులు ను అవులుగాను, అర్జునుని దూడగా చేసి శ్రీ కృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. గీతను అర్జునునికి శ్రీ కృష్ణుడు చెప్పిన గీత జ్ఞానం అంతా 18 అద్యాయాలుగా పరమపదసోపాన మార్గంగా విరాజిల్లుతోంది. ఎవరు సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సుఖంగా, సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు. మోక్షస్థానాన్ని ల క్ష్యంగా చేసుకున్న వారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతాడు. వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగాడు. అందువల్ల భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు గీతను లోకానికి అందించాడు. గీత అనే పదంలో గీ అంటే త్యాగం, త అంటే తత్వజ్ఞానం. అంటే త్యాగాన్ని, తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. గీతను మొదట ఎవరు విన్నారంటే... శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథంపై ఎగిరే ధ్వజరూపంలో ఉన్న ఆంజనేయుడు. గీతామహాత్మ్యాన్ని శివుడు పార్వతికి, విష్ణువు లక్ష్మీదేవికి, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే ఒకరి సతులతో ఒకరు గీతామహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి. అదికూడా సాధ్యం కానివారు కనీసం పూజగదిలో ఉంచి పూజించాలి. గీతాగ్రంథాన్ని పఠించిన వారికే కాదు, పూజించిన వారికీ ప్రయోజనకరమే. యజ్ఞం చెసిన ఫలం. సమస్త భూమండలాన్నీ దానం చెసినంత ఫలం. గీతాగ్రందాన్ని పూజించిన దానం చెసినా ఎన్నొ ఎంత పుణ్యం లభిస్తుందో, గీతాగ్రంథాన్ని పూజించినా, దానం చేసినా అంతే పుణ్యం లభిస్తుంది. సకల పుణ్యతీర్థాలలో అన్ని వ్రతాలూ ఆచరించిన పుణ్యంతో సరిసమానమైన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, గీతాగ్రంథం ఉన్న వారి ఇంట భూతప్రేత రోగబాధలతో సహా దైవిక-దేహిక పీడలు తొలగిపోతాయి. ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కాని జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి వంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం ఎలాగో వివరించిన గ్రంథం ఇదొకటే! కాబట్టి దీనిని మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసమూ మరొకటి లేదని చెప్పవచ్చు. భగవద్గీత మానవ సుఖ జీవన మంత్రంగా ఉపయోగించుకోవచ్చు. ఇది నిజం.
తాత్పర్యము: మనము సక్రమముగా పూర్తిచేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములాటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు. ఎందుచేతనంటే శ్రీ కృష్ణుడే మన ఈ వ్రతానికి కారకుడు మరియు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి. అతని పనులు కూడా అట్టివే. ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు. నిర్మలమైన జలముగల యమునానది ఒడ్డున నివసించుచు మనకొరకు యదుకులమందున అవతరించిన మహానుభావుడు. తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు. అంతటి మహాత్ముడి ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్య మూర్తి. కనుక మనము సందేహములను వీడి పరిసుద్దములై అతనిని సమీపించి పరిసుద్దమైన వికసించిన హృదయకుసుమమును సమర్పించి నోరార పాడాలి. నిర్మలమైన మనస్సుతో ద్యానిమ్చాలి. అంతటనే వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాపముల సమూహము మంటలో పడిన దూది వలె భస్మము అయిపోతాయి. మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.