తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది. తెల్లవారినది మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించుచున్నవి. మనతోటి పిల్లలు వ్రతస్తలమునకు వెళ్ళుటకు కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు. అట్లు వెళ్ళుచున్నవారిని నిలిపివేసి మేము నిమ్ము పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి యున్నాము. కుతూహముగల ఓ లలనా ! లేచి రమ్ము. శ్రీ కృష్ణుని దివ్యమంగళ "పర" అను సాధనము గ్రహించి కేశియను రాక్షసుని చీల్చి సంహరించినట్టియు మల్లుర ప్రాణములను కొల్లకోట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించినట్లు అయితే అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావలెననుకొనుచుండగా మీరే వచ్చితిరే అని మానను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేల్కొల్పుతున్నారు.
భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్నివైపులా మాట్లాడుకుంటున్నాయి. ఆ ధ్వని నీవు వినలేదా?
ఓ పిచ్చిదానా! పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచేత సువాసనలు వేదజల్లుచున్న జుట్టుముడులతో ఉన్నగోప వనితలు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు పెరుగు కుండల నుండి వెలువడు మృదంగ గంభీరధ్వని ఆ కాంతల చేతుల గాజుల సవ్వడి మరియు మేడలో ఆభరణముల ధ్వని కలిసి ఆకాశమునకు తగులుచున్నవి. నీ చెవికి సోకటం లేదా ?
ఓ నాయకురాలా! అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉన్న పరమాత్మ మనకు కనబడవలెను అని శరీరము ధరించి కృష్ణుడు అవతరించినాడు. లోకకంటకులైనవారిని నశింపజేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేల్కొనవేలా? నీ తేజస్సును మేము దర్శించి అనుభవించునట్లుగా తలుపులు తెరువవలేనని మేల్కొల్పుతున్నారు.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ డిసెంబర్ 22, 1887 న జన్మించారు. ఈ రోజు ను జాతీయ గణితశాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు, ఆ రాష్ట్ర వాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22 ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది.
భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రం తో అనుభందం ఏర్పడింది. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. రామానుజన్ చాలా సున్నితమైన భావాలు, మంచి పద్దతులు కలిగిన బిడియస్తుడిగా ఉండే వాడు.ఆయన కేంబ్రిడ్జిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపాడు. ఆయన జీవిత చరిత్రను రాసిన మొట్టమొదటి రచయిత ఆయన్ను శుద్ధ సాంప్రదాయవాదిగా పేర్కొనడం జరిగింది. తనకు సంక్రమించిన సామర్థ్యం అంతా తమ ఇలవేల్పు దేవత అయిననామగిరిప్రసాదించినదేనని రామానుజన్ బలంగా విశ్వసించేవాడు. తనకు ఏ కష్టం కలిగినా ఆమె సహాయం కోసం ఎదురు చూసేవాడు.ఆమె కలలో కన్పించి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపించగలదని భావించేవాడు.భగవంతునిచే ప్రాతినిధ్యం వహించబడని ఏ ఆలోచనా సూత్రం కానేరదుఅని అప్పుడప్పుడూ అంటుండేవాడు .
తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నపుడు కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు. ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగాన్ని, అంకిత భావానికి నిదర్శనం. రామానుజన్ అన్ని మతాలు ఒకటిగా నమ్మేవాడని హార్డీ ఒకసారి పేర్కొన్నాడు.ఆయన ఆధ్యాత్మికతను భారతీయ రచయితలు అతిగా అర్థం చేసుకున్నారని వివరించాడు. అంతేకాదు, రామానుజన్ యొక్క శుద్ధ శాఖాహారపు అలవాట్లను గురించి కూడా ప్రస్తావించాడు. రామానుజన్ అనారోగ్యం తో ఆయన 1920, ఏప్రిల్ 26న పరమపదించాడు. శుద్ధ గణితంలో నంబర్ థియరీలోని ఇతని పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగ పడుతూ ఉన్నాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్-తీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు కొన్ని ఇప్పటికీ అపరిష్కృతం గానే ఉండటం విశేషం.
భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
భగవదారణ పూర్వము లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవుటచేత తానోక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న యొక్క స్నేహితురాలిని గోదాదేవితో వచ్చినవారు మేల్కొల్పుతున్నారు. ఎట్లానగా ఆహారము సంపాదించుకోనుటకు పక్షులు గూళ్ళనుండి లేచి ధ్వని చేయుచు పోవుచ్చున్నవి. ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రండి రండి అని ఆహ్వానించుచున్నది. ఆ ధ్వని నీకు వినబడటంలేదా. ఓ పిల్లా! లే ! మేము ఎలా లేచామో తెలుసునా? పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురునికాలుతాపు తో కాలునివద్దకు పంపినవాడను. సముద్రజలముపై హంసతూలికా తల్పముకంటే సుఖకరమైన శేషశయ్య పై లోక రక్షణమునే ఆలోచించు యోగానిద్రననుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదములందు బంధించి మెల్లగా నిద్రమేల్కోను మునివర్యులు హరి హరి అని చేయు భగవన్నామ ధ్వని మా హృదయములో ప్రవేసించి మమ్ము నిద్రలేపినది. నీవు కూడా లేచి రమ్ము. అని నిద్రపోతున్న గోపికను గోదాదేవి చెలికత్తెలు లేపుతున్నారు.