Blogger Widgets

శనివారం, డిసెంబర్ 26, 2015

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు 11

శనివారం, డిసెంబర్ 26, 2015


కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:
లేగ దూడలు గలవియు, దూడల వలె నున్నవియు నగు ఆవులు మందల నెన్నింటినో పాలు పితుక కలవారును,
శత్రువులను ఎదిరించి బలముతో యుద్దము చేయగలవారును , ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారు తీగ ! పుట్టలోని పాము పడగవలె నున్న నితంబ ప్రదేశము గలదానా! అడవిలోని నెమలివలె అందమైన కేసపాసముతో ఒప్పుచున్నదానా! రమ్ము. చుట్టములును, చెలికత్త్లును మొదలుగా అందరును వచ్చిరి. నీ ముంగిట చేరిరి , నీలమేఘవర్ణుడగు శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచుండిరి. కీర్తిమ్చుచున్నా ఉలకవేమి. ఓ సంపన్నురాలా లే మేలుకో అని గోపికలు మేలుకోల్పుతున్నారు 

శుక్రవారం, డిసెంబర్ 25, 2015

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్ 10

శుక్రవారం, డిసెంబర్ 25, 2015

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము:
మేము రాక ముందు నోమునోచి , దాని ఫముగా సుఖనుభావమును పోందినతల్లి ! తలుపుతెరవకపోయినా పోదువుగాక, మాటనైనను పలుకవా! పరిమళముతో నిండిన తులసిమాలలు అలమ్కరిచుకోనిన కిరీటము గల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడినను `పర ' అను పురుశార్ధమును ఓసంగేడి పుణ్యముర్తి , ఒకనాడు కుంభకర్ణుని మృత్యువునోటిలో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తనసోత్తగు ఈ గాదా నిద్ర ను నీకు ఒసగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ ! మాకందరకు శిరోభుషనమైనదానా! నిద్రనుండి లేచి, మైకము వదలించు కొని, తేరుకొని వచ్చి తలుపు తెరువు , నీ నోరు తెరచి మాటలాడు ఆవరనములోకి వచ్చినీ దర్శనము మాకు కలిగించు.
భగవదనుభావము గలవారు లోకులు నిమ్దిచని తీరున లోకములోకి వచ్చి ఆర్తి గలవారిని ఉద్దరింతురు.
వారి వాక్కు,వారి రూప దర్శనము కూడా భాగాత్ర్పాప్తికి సాధనములే!
ఈ పాశురములో ఏకేంద్రియావస్తలో నుండి ఇంద్రియము లేవియు పనిచేయక మససు భగవదదీనమై సిద్దోపాయనిస్టలో ఉన్న గోపిక మేల్కొల్పబడినది.

వీడివో యిదే వింతదొంగ

|| వీడివో యిదె వింతదొంగ |
వేడిపాలు వెన్న వెరజినదొంగ ||
||వెలయ నీట జోప్పువేసేటి దొంగ |
తలగాననీక దాగుదొంగ |
తలకక నేలదవ్వేటిదొంగ |
తెలిసి సందెకాడ దిరిగేటి దొంగ ||
|| అడుగుకింద లోకమడచేటి దొంగ |
అడరి తల్లికినైన నలుగుదొంగ |
అడవిలో నెలవైయున్న దొంగ |
తొడరి నీలికాసెతో నుండుదొంగ ||
|| మోస మింతుల జేయుమునిముచ్చుదొంగ |
రాసికెక్కినగుఱ్ఱంపుదొంగ |
వేసాల కిటు వచ్చి వెంకటగిరిమీద |
మూసినముత్యమై ముదమందుదొంగ ||

గురువారం, డిసెంబర్ 24, 2015

తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్ 9

గురువారం, డిసెంబర్ 24, 2015

తూమణి మాడత్తు చ్చుత్తుం పాశురము: 

తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్

తాత్పర్యము: 
ఉజ్జ్వలములైన నవరత్నములతో నిర్మించిన మేడలో మెత్తని పాన్పుపై చుట్టును దీపములు ప్రకాశించుచుందగా అగురుధూపముల పరిమళము నాసికను వశమొనర్చుకోను చుండ నిద్రపోవు ఓ అత్తా కూతురా! మణికవాటము యొక్క గడియను తీయుము.  ఓ అత్తా! నీవైనా ఆమెను లేపుము.  నీ కుమార్తె మూగదా? లేక చెవిటిదా? లేక మందకొడి మనిషా?  ఎవరైనా నీవు కదలినచో  మేము సమ్మతింపమని కాపలా ఉన్నారా? లేక మొద్దు నిద్దుర ఆవేశించునట్లు ఎవరైనా మంత్రము వేసినారా.  మహామాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని అనేకములైన భగవంనామములను కీర్తించి ఆమెను మేల్కొనునట్లు చేయుము అని భావము.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)