Blogger Widgets

ఆదివారం, డిసెంబర్ 27, 2015

కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి 12

ఆదివారం, డిసెంబర్ 27, 2015

కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము :

లేగ దూడలు గల గేదెలు పాలుపితుకువారు లేక లేగ దూడలును తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి మొదుగులో మూతి పెట్టునట్లు తోచి పొదుగునుండి కారిపోవుటచే ఇల్లంతయూ బురధగుచున్న ఒకానొక మహైశ్వర సంపన్నుని చెల్లెలా! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలచియుంటిమి. కోపముతో దక్షిన దిక్కున నున్న లంకకు అధిపతియైన రావణుని చంపిన మనోభి రాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా? ఇంక మమ్మేలు కొనవా? ఏమి యీ గాఢ నిద్ర? ఊరివారందరుకూ నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము అని కృష్ణుని విడువక సర్వ కాలముల నుండుటచే స్వధర్మమును కూడ చేయలేని దశయందున్న ఐశ్వర్యసంపన్నుడగు ఒక గోపాలుని చేల్లెలిని మేల్కొల్పినారు.

ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల


ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటిక్రిష్ణుడీతడే కాడుగదా

కందువ దేవకి బిడ్డగనెనట నడురేయి
అంది యశోదకుకొడుకైనాడట
సందడించి పూతకిచంటిపాలు తాగెనట
మందల ఆవులగాచి మలసెనట

మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట –
ఇంచుకంతవేల కొండయెత్తినాడట
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట –
మించుల పిల్లగోవివట్టి మెరసెనటా

కాళింగుని మెట్టెనట కంసు( బొరిగొనెనట –
పాలించి సురల చేపట్టెనట
యీలీల శ్రీవేంకటాద్రి నిరవైనదేవుడట –
యేలెనట పదారువేల ఇంతుల నిందరిని

శనివారం, డిసెంబర్ 26, 2015

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు 11

శనివారం, డిసెంబర్ 26, 2015


కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:
లేగ దూడలు గలవియు, దూడల వలె నున్నవియు నగు ఆవులు మందల నెన్నింటినో పాలు పితుక కలవారును,
శత్రువులను ఎదిరించి బలముతో యుద్దము చేయగలవారును , ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారు తీగ ! పుట్టలోని పాము పడగవలె నున్న నితంబ ప్రదేశము గలదానా! అడవిలోని నెమలివలె అందమైన కేసపాసముతో ఒప్పుచున్నదానా! రమ్ము. చుట్టములును, చెలికత్త్లును మొదలుగా అందరును వచ్చిరి. నీ ముంగిట చేరిరి , నీలమేఘవర్ణుడగు శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచుండిరి. కీర్తిమ్చుచున్నా ఉలకవేమి. ఓ సంపన్నురాలా లే మేలుకో అని గోపికలు మేలుకోల్పుతున్నారు 

శుక్రవారం, డిసెంబర్ 25, 2015

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్ 10

శుక్రవారం, డిసెంబర్ 25, 2015

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము:
మేము రాక ముందు నోమునోచి , దాని ఫముగా సుఖనుభావమును పోందినతల్లి ! తలుపుతెరవకపోయినా పోదువుగాక, మాటనైనను పలుకవా! పరిమళముతో నిండిన తులసిమాలలు అలమ్కరిచుకోనిన కిరీటము గల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడినను `పర ' అను పురుశార్ధమును ఓసంగేడి పుణ్యముర్తి , ఒకనాడు కుంభకర్ణుని మృత్యువునోటిలో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తనసోత్తగు ఈ గాదా నిద్ర ను నీకు ఒసగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ ! మాకందరకు శిరోభుషనమైనదానా! నిద్రనుండి లేచి, మైకము వదలించు కొని, తేరుకొని వచ్చి తలుపు తెరువు , నీ నోరు తెరచి మాటలాడు ఆవరనములోకి వచ్చినీ దర్శనము మాకు కలిగించు.
భగవదనుభావము గలవారు లోకులు నిమ్దిచని తీరున లోకములోకి వచ్చి ఆర్తి గలవారిని ఉద్దరింతురు.
వారి వాక్కు,వారి రూప దర్శనము కూడా భాగాత్ర్పాప్తికి సాధనములే!
ఈ పాశురములో ఏకేంద్రియావస్తలో నుండి ఇంద్రియము లేవియు పనిచేయక మససు భగవదదీనమై సిద్దోపాయనిస్టలో ఉన్న గోపిక మేల్కొల్పబడినది.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)