ముప్పది మూడుకోట్ల అమరులకు వారికింకను ఆపద రాక ముందే పోయి , యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన భయమును తొలగించే బలసాలీ ! మేల్కొనుము అర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము గలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శ త్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకో ! బంగారు కలశములను పోలిన స్థానములను, దొండపండువలెఎర్రని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము. వీచుటకు ఆలవట్టమును (hand fan) కంచుతద్దమును మా కోసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానము చేయునట్లు చేయుము.
మూడు ఆపిల్స్ ప్రపంచ గమనాన్నే మార్చేశాయి. ఒకటో ఆపిల్...ఆడమ్ - ఈవ్ రుచి చూసిన నిషిద్ధ ఫలం. రెండో ఆపిల్...న్యూటన్ విశ్రాంతి తీసుకుంటున్న చెట్టు మీంచి రాలిన పండు. మూడో ఆపిల్...స్టీవ్‌జాబ్స్ స్థాపించిన సంస్థ. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా 'ఆపిల్ కంప్యూటర్స్' రికార్డు సృష్టించింది.
ఈ రోజు సర్ ఐజాక్ న్యూటన్జయంతి. ఐజాక్ న్యూటన్ జనవరి 4, 1643లోలింకన్ షైర్ కౌంటీకి చెందిన ఒక చిన్న కుగ్రామమైన Woolsthorpe Manor అనే గ్రామంలో జన్మించాడు. న్యూటన్ తండ్రి చనిపోయిన మూడు మాసాలకు జన్మించాడు. నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా చిన్నగా ఉండేవాడు. న్యూటన్ తల్లి Hannah Ayscough ఆ పసికందు ఒక లీటర్ పాత్రలో పట్టగలడని చెప్పినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.ఈయన ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలొ అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సు గా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది. చిన్నతనంలో ఒకరోజు ఆపిల్ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న చిన్ని న్యూటన్ మీద చెట్టుమీదనుండి ఆపిల్ పండు పడింది. అప్పుడు చిన్న ప్రశ్న మనస్సులో మెదిలింది. పండు కిందకె ఎందుకు పడింది. పైకి ఎందుకు పడలేదు అన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాదానం అన్వేషించే క్రమంలోనే గురత్వాకర్షణ సిద్దాంతాని ప్రతిపాదించాడు. 1661 వ సంవత్సరలో గొప్ప చదువుల కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రంలో ఇష్టాన్ని పెంచుకున్నాడు. అక్కడే ప్రొఫెసర్ గా చేరాడు న్యూటన్. 1667 లో పరావర్తన దూరదర్శిని ని కనిపెట్టి అప్పట్లో సంచలనం సృస్టించాడు. 1687లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథంen:Philosophiæ Naturalis Principia Mathematica, సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలోగురుత్వాకర్షణ శక్తిగురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్థావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందినయాంత్రిక శాస్త్రానికితరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగాకెప్లర్ నియమాలకూమరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతోసూర్య కేంద్రక సిద్ధాంతంపైపూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.
"ఎడ్మండ్ హాలే ఆర్థిక సహాయంతో జూలై 1687 లో Principia ప్రచురించబడింది. ఈ పనిలో,న్యూటన్ మూడు సార్వత్రిక చట్టాలు(universal law of gravitation)ని పేర్కొన్నాడు. ఇది ఒక విప్లవాత్క్మక అవిష్కరణ.." Principia తో, న్యూటన్ అంతర్జాతీయంగా గుర్తించబడిన్నాడు. న్యూటన్ పరిశోధనలకు 1705 లో బ్రిటన్ ప్రభుత్వం గుర్తించి "సర్" అనే బిరుదును గౌరవంగా అందించింది. అప్పటినుండి సర్ ఐజాక్ న్యూటన్ గా పిలవబడుతున్నారు. ఆధునిక యుగంలో వైజ్ఞానిక విప్లవానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్తగా సర్ ఐజాక్ న్యూటన్ చరిత్రలో నిలిచాడు. గురుత్వాకర్షణ శక్తిని, సౌర కుటుంబ చలనానికి మూల సూత్రాన్ని ఆవిష్కరించి, చీకట్లను పారదోలిన మహానీయుడు న్యూటన్. అవని నుంచి అంతరిక్షం వరకు పలు రంగాలను అర్ధం చేసు కోవడానికి ఆయన సూత్రాలు కొత్తమార్గాన్ని చూపాయి. 1727 మార్చి 20న న్యూటన్ మరణించారు . వైజ్ఞానిక ప్రపంచంలో తన పరిశోధనలతో విప్లవం సృష్టించిన సర్ ఐజాక్ న్యూటన్ ఇలా అన్నారు .''వైజ్ఞానిక, సాంకేతిక ప్రగతి ఏ ఒక్కరివల్లో ఉన్నట్టుండి ఊడిపడేది కాదు. ఎందరో శాస్త్రవేత్తలు తరాల తరబడి చేసే కృషి ఫలితమే ప్రగతి అంటు'' విశ్వరహస్యాల గుట్టు విప్పిన మహానుభావుడు.
ఒక గుత్తి దీపములు చుట్టును వేలుగుచుండగా , ఏనుగు దంతము లతో చేయబడిన కోళ్ళు గల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము,ఎత్తు , వెడల్పు కలిగిన పాన్పులపై ఎక్కి , గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకోనిన కేశ పాశము గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీ కృష్ణా నోరు తెరచి మాట్లాడు . కాటుక పెట్టికోనిన విశాలమైన కన్నులు కల ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు?ఇంత మాత్రపు ఎడబాటుకుడా ఓర్వ లేకుండుట నీ స్వరుపమునకు, నీ స్వభావమునకు తగదు.