రెండవ పాశురములో మనము వ్రత నీయమాలు నిర్ణయించుకున్నాము కదా. మరి వ్రతము ఒక ఫలాపేక్ష తో చేస్తున్నాము కదా మరి ఆ వ్రత ఫలము ఎలావుండాలి మరి. ఆ ఫలము ఎలావుండాలో మూడవ పాశురము లో తెలుపుతారు మన అమ్మ. అయితే ఈ పాశురము విశేషము కలది అయితే చక్కేరపోంగాలి నివేదించాలి స్వామికి. మరి ఆ పాశురము ఇదిగో.....
తాత్పర్యము: పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము అడిగెను. బలిచక్రవర్తి అలాగే అని దానము చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు. అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచూ వ్రతనిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకానందము కలుగచేయాలి. చేనులోని నీటిలో చేపలు యెగిరి పడుచు మనస్సును ఆకర్షించవలెను. అన్ని పైరులును బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను. పాలు పితుకువారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చోండి పోదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను. స్థిరమైన సంపదదేశమంతటను విస్తరింపవలేనని ఈ పాసురములోని గోదామాత కోరుచున్నది.
పాశురం:
*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము: పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము అడిగెను. బలిచక్రవర్తి అలాగే అని దానము చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు. అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచూ వ్రతనిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకానందము కలుగచేయాలి. చేనులోని నీటిలో చేపలు యెగిరి పడుచు మనస్సును ఆకర్షించవలెను. అన్ని పైరులును బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను. పాలు పితుకువారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చోండి పోదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను. స్థిరమైన సంపదదేశమంతటను విస్తరింపవలేనని ఈ పాసురములోని గోదామాత కోరుచున్నది.
విశేషార్ధము:
1 ) ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి:
పెరిగి లోకములు కొలిచిన ఉత్తముని పేరు పాడి మేము ఈ వ్రతమునకు స్నానమాచరించుతుము. పుట్టుట-ఉండుట-పెరుగుట-మారుట-తరగుట-లేకుండుట అనునవి ఆరు ప్రకృతి వికారాలు అలాంటి వికారాలు లేని స్వామీ మనకోసం వచ్చి పెరిగాడని గోపికలు సంతోషించారు.
2 )నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్:
మేము మావ్రతమునకు అని, మిష పెట్టి స్నానము చేసినచో లోకమంతయు సుఖముగా వుండును. మేము-మావ్రతము గొప్పవని చెప్పుకుంటున్నారు.
3 ) తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు:
ఎటువంటి బాదలు లేకుండా దేశమంతా నెలకు మూడు వానలు పాడుటను. ఈవ్రతం వల్లన లోకములో పాడి పంట సమృద్దిగా వుండును.
4 ) ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ:
పెరిగిన పెద్దపెద్ద వరిచేనులో చేపలు త్రుళ్ళిపడును. చేను పెద్దగా పెరుగుట, అడుగున నీరు సమృద్దిగా ఉండుట, పంటకు విశిష్టత. అట్టివిశిష్టత ఈ వ్రతము వాళ్ళ కలుగును అని భావం.
5 )పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప:
పూచినా కలువ పువ్వులలో లేదా సుందరమైన కలువపూలలో అందమయిన తుమ్మెదలు ఒకదానితో ఒకటి కలహించుకోనుచూ నిద్రిస్తున్నవి. వారి చేనులో నీరు అధికముగా వుండుట వాళ్ళ కాలువలు ఎక్కువున్నాయి. వాటిలోని మకరందము కోసం తుమ్మెదలు వస్తున్నాయి. అంటే వారి ఊరిలో పాడియోక్క వైబోగం చెప్తున్నారు.
6 )తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ:
ఎటువంటి జంకూలేకుండా కోట్టములోకి వెళ్లి కుర్చోనిన బాగా బలసిన చనుకట్లు పట్టి పాలు పిండగా అక్కడ ఆవులు కుండలు కుండలు పాలు ఇస్తున్నాయి. ఆ రేపల్లేలో గోవులు సమృద్దిగా వున్నవి అని.
7 )క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందే:
కుండలు నిండునట్లు పాలను ఇస్తున్న ఉదారములగు పశువులు, తరగని సంపద, నిండియుండును.