సోమవారం, డిసెంబర్ 18, 2017
గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటల తో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముంకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు. ఈ వ్రతము నకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు . వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు. మరి ఈ పాసురము లో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాము.
పాశురము
ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము: గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా! నీవు వర్షజలముననుగ్రహించు దాత్రుత్వములో ఏ మాత్రము సంకోచము చూపించకు. గంభీరమైన సముద్రము మద్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాసమునంతను వ్యాపింపచేయును. సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆభగవంతుని సుందర విశాల దీర్గబాహువుల జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెరయుచు ఎడమచేతి యందలి శంఖము వలె మధురగంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనుస్సు నుండి వెడలివచ్చు బాణములవలె వర్షదారాలు లోకమునంతను సుఖింపజేయునట్లును. మేము సంతోషముతో మార్ఘశీర్ష స్నానము చేయునట్లు వర్షించు. అని అండాళ్ళమ్మ ఈ పాశురములో ప్రార్దించుచున్నది.
విశేషార్ధము:
ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్:
ఈ గోపికలు వర్షాధిదేవుడగు పర్జన్యుని సంభోదించుచున్నారు. ఆళి=సముద్రము వలె గంభీర్య వైశాల్యములు కలవాడు పర్జనుడు అని భావము.
ఆళి ఉళ్ పుక్కు:
సముద్రము మద్యలోనికి ప్రవేసించి, సముద్రములో నీరు త్రాగుటకు పైపై ఒడ్డున తాగరాదు. చిన్నచిన్న గుంటలు, పడియలలో, చెరువులలో, నదులలో నీరు త్రాగరాదు. సముద్రములో మధ్యకు పోయి అగాధముగా నుండు చోట లోనికి చొచ్చి నీటిని త్రాగవలె.
ముగందు కొడు:
పూర్తిగా సముద్రజలమును త్రాగీ- గోపికలు మేఘముతో సముద్రపు నడిబొడ్డున చొచ్చి జలమునంతా ఇసుకతగిలే వరకు నీటిని త్రాగామంటున్నారు.
ఆర్తు ఏఱి:
గర్జించి మిన్నంది. ఓ మేఘమా ! నీవు సముద్రజలమును తృప్తిగా తాగిన తరువాత ఒక్కసారిగా గర్జించాలి. మనము బోజనము చేసినతరువాత త్రేనుపు వస్తుంది అటువంటి శబ్ధము.
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు:
కాలమునకు కారణమైన బ్రహ్మతత్వముయొక్క రూపమువలె నీ శరీరమును నల్లగా చేయవలె.
"బ్రహ్మవేద బ్రహ్మైవభవతి" బ్రహ్మ నెరిగినవాడు బ్రహ్మ స్వరూపమునే పాడుతాడు అని ఉపనిషత్తు చెప్పుతుంది.
జలము త్రాగిన మేఘము నీలముగా మారును అది చల్లగా వుండును.
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని:
విశాలమగు సుందరమగు బాహువులుగల పద్మనాభుని చేతిలోని చక్రమువలె మెరిసి, వర్షించవలె. ఆకాశమున అధిరోహించిన మేఘము నల్లగా వుంది వర్షించుటకు ముందు మెరయును. ఆ మెరుపు పద్మనాబుని చేతిలోని చేక్రపు మెరపువలె ఉండాలి. పరమాత్మ బాహువులు విశాలములు సుందరములు అనిచేప్తున్నారు.
వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు:
దక్షణావర్త శంఖము వలె నిలిచి గర్జించి. మేఘము మేరయుట ఘర్జించుట సహజమే. కానీ మన గోపికలు శ్రీ మన్నారాయుణుని చేతిలోని చక్రంవలె మెరవాలిట. శంఖమువలె గర్జించవలెను అని వారి కోరిక.
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ :
శారంగమను విల్లు బాణములను వర్షించునట్టు వర్షము వర్షించాలి అని భావము.
నాంగళుమ్ మార్గళి నీరాడ మగిళుందేలోర్ :
ఆ వర్షానికి మేము ఆనందముగా మార్గశిర స్నానము చేయాలి అని అనుకుంటున్నారు.
ఆదివారం, డిసెంబర్ 17, 2017
రెండవ పాశురములో మనము వ్రత నీయమాలు నిర్ణయించుకున్నాము కదా. మరి వ్రతము ఒక ఫలాపేక్ష తో చేస్తున్నాము కదా మరి ఆ వ్రత ఫలము ఎలావుండాలి మరి. ఆ ఫలము ఎలావుండాలో మూడవ పాశురము లో తెలుపుతారు మన అమ్మ. అయితే ఈ పాశురము విశేషము కలది అయితే చక్కేరపోంగాలి నివేదించాలి స్వామికి. మరి ఆ పాశురము ఇదిగో.....
పాశురం:
*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము: పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము అడిగెను. బలిచక్రవర్తి అలాగే అని దానము చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు. అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచూ వ్రతనిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకానందము కలుగచేయాలి. చేనులోని నీటిలో చేపలు యెగిరి పడుచు మనస్సును ఆకర్షించవలెను. అన్ని పైరులును బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను. పాలు పితుకువారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చోండి పోదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను. స్థిరమైన సంపదదేశమంతటను విస్తరింపవలేనని ఈ పాసురములోని గోదామాత కోరుచున్నది.
విశేషార్ధము:
1 ) ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి:
పెరిగి లోకములు కొలిచిన ఉత్తముని పేరు పాడి మేము ఈ వ్రతమునకు స్నానమాచరించుతుము. పుట్టుట-ఉండుట-పెరుగుట-మారుట-తరగుట-లేకుండుట అనునవి ఆరు ప్రకృతి వికారాలు అలాంటి వికారాలు లేని స్వామీ మనకోసం వచ్చి పెరిగాడని గోపికలు సంతోషించారు.
2 )నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్:
మేము మావ్రతమునకు అని, మిష పెట్టి స్నానము చేసినచో లోకమంతయు సుఖముగా వుండును. మేము-మావ్రతము గొప్పవని చెప్పుకుంటున్నారు.
3 ) తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు:
ఎటువంటి బాదలు లేకుండా దేశమంతా నెలకు మూడు వానలు పాడుటను. ఈవ్రతం వల్లన లోకములో పాడి పంట సమృద్దిగా వుండును.
4 ) ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ:
పెరిగిన పెద్దపెద్ద వరిచేనులో చేపలు త్రుళ్ళిపడును. చేను పెద్దగా పెరుగుట, అడుగున నీరు సమృద్దిగా ఉండుట, పంటకు విశిష్టత. అట్టివిశిష్టత ఈ వ్రతము వాళ్ళ కలుగును అని భావం.
5 )పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప:
పూచినా కలువ పువ్వులలో లేదా సుందరమైన కలువపూలలో అందమయిన తుమ్మెదలు ఒకదానితో ఒకటి కలహించుకోనుచూ నిద్రిస్తున్నవి. వారి చేనులో నీరు అధికముగా వుండుట వాళ్ళ కాలువలు ఎక్కువున్నాయి. వాటిలోని మకరందము కోసం తుమ్మెదలు వస్తున్నాయి. అంటే వారి ఊరిలో పాడియోక్క వైబోగం చెప్తున్నారు.
6 )తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ:
ఎటువంటి జంకూలేకుండా కోట్టములోకి వెళ్లి కుర్చోనిన బాగా బలసిన చనుకట్లు పట్టి పాలు పిండగా అక్కడ ఆవులు కుండలు కుండలు పాలు ఇస్తున్నాయి. ఆ రేపల్లేలో గోవులు సమృద్దిగా వున్నవి అని.
7 )క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందే:
కుండలు నిండునట్లు పాలను ఇస్తున్న ఉదారములగు పశువులు, తరగని సంపద, నిండియుండును.
శనివారం, డిసెంబర్ 16, 2017
ధనుర్మాసవ్రతము ముప్పై రోజుల వ్రతము కదా అయితే గోపికలు మొదటిపాసురములో వారికి ఏమికావాలో ఎలాచేయాలో అల్లోచించారు. వారు భగవత్ప్రాప్తి కావాలని వ్రతము ప్రారంభించారు అని తెలుస్తోంది. మరి రెండవ పాసురములో వారు ఏమిచేస్తున్నారో తెలుసుకుందామా.
పాశురము
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము: భగవంతుని దర్శించుటకు వెళ్ళేవారు భాగాత్ప్రాప్తి కోసం కొన్ని నియమాలు పాటించాలని. శ్రీ కృష్ణుడు అవతరించిన ఈ లోకములో పుట్టి దు:ఖమైన ఈ లోకములో కూడా భగవదనుగ్రహముచే ఆనందము అనుభవించుచుతున్న వారలారా! మేము మా వ్రతమునకు ఏర్పరచుకోనిన నియామాలు వినండి. పాలసముద్రములో పడుకొని నిద్రించుతున్న పరమాత్మ యొక్క పాదపద్మాలకు మంగళము పాడతాము. మేము ఈవ్రతము చేసినంతన కాలమున నీటిని కానీ పాలను కాని అనుభవించము. తెల్లవారుజాముననే నిదురలేచి చల్లనినీటినే స్నానము చేసెదము. కళ్ళకు కాటుకను అలంకరించము. తలకు పరిమలబరితమగు పూలదండలను ధరించము. మా పెద్దలు విడిచిపెట్టిన చేడుపనులు మేము ఆచరించము. ఇతరులకు బాధ కలిగే మాటలు కానీ, అసత్యాలను కాని ఎప్పుడూమాటాడము. ఇతరులకు హాని uకలిగించము. ఇతరులకు హానిలాగే ఆలోచనలు చేయము. ఙ్ఞానసంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులచే ఎక్కువ సత్కారిచుదుము. బ్రహ్మచారులకు బిక్షుకలుకు బిక్షపెట్టేదము. భగవంతుని కళ్యాణ గుణాలను కీర్తించేదము. గురువు ను పరబ్రహ్మగా భావించాలని మన పెద్దలు చెప్పారు కదా అందుకే గురువులను పూజించి ఆచార్య కృపపోందేదము. వ్రతనీయమాలు ఏ రీతిగా చెప్పబడినవో ఆవిధంగా పాటిద్దాం అనుకున్నారు. శ్రీ కృష్ణుని పొందుదాము.
విశేషార్ధము :1 . వైయత్తు వాళ్ వీర్గాళ్! :-ఈ లోకములో ఆనందము అనుభవించువారలారా! అని సంబోధించుచున్నారు.2 . నాముం నం పావైక్కు చ్చెయ్యుఙ్గిరిశైగళ్ కేళీరో! :-మేము మా వ్రాతములో చేయు క్రియలను వినుడు.3 . పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి :-పాలసముద్రములో మెల్లగా పాడుకొనిన పరమపురుషుని పాదములకు మంగళము పాడి.4 . నెయ్యుణ్ణోం పాలుణ్ణోం :-నేతులారగించము- పాలు తాగము.5 . నాట్కాలే నీరాడి :-తెల్లవారుజ్హాముననే స్నానము చేయవలెను.6 . మైయిట్టెళుదోం :-కాటుకను మాకళ్ళకు అలంకరించము.7 . మలరిట్టు నాం ముడియోమ్ :-మేము మాకోప్పులలో పూలు ధరించము.8 . శెయ్యాదన శెయ్యోం :-"మా పెద్దలు చేయని పనులను మేమూ చేయము"9 . తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్ :-ఇతరులకు అనర్ధమును కల్గించు తప్పు మాటలను పలుకము.10 . ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి :-దానమును, భిక్షమును చాలు అన్నంతవరకు ఇచ్చి అయ్యో! ఏమియు చేయలేకపోతిమే అని విచారింతుము.11 . ఉయ్యుమాఱెణ్ణి యుగందు :-పైన విధంగా ఉజ్జీవించు విధములను పరిశీలించి సంతోషించి ఈ వ్రత నీయమాలను వినండి.
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః
మార్గళి త్తింగళ్ పాశురము :
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .
ఓహో ! మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశొద యొక్క బాలసిమ్హమును, నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునత్లు మీరందరు వచ్చి ఈ వ్రతములొ చేరుడు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ