Blogger Widgets

ఆదివారం, జనవరి 28, 2018

రామచరిత మానస 5 గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తున్నాను...

ఆదివారం, జనవరి 28, 2018


గురు ప్రస్తుతి
బందఉC  గురు పద కంజ , కృపా సింధు నరరూప హరి | 
మహామోహ  తమ పుంజ , జాసు బచన రబి కార నికర || 5 || 

నేను నా గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తున్నాను.  ఆయన కృపాసముద్రుడు ,  మనుష్యరూపమును దాల్చిన శ్రీహరి .  సూర్యకిరణములు అంధకారమునువలె .  విజ్ఞాననిధి ఐన ఆయన వచనములు అజ్ఞానమును పటాపంచలు  గావించును .  || 5 || 

చౌ - బందఉC  గురు పద పదుమ పరాగా  |  సురుచి  సుబాస సరస అనురాగా || 
        అమిఅ మూరిమయ  చూరన  చారూ |  సమన సకల భావరుజ పరివారు    || 1 || 
        సుకృతి  సంభు తన బిమల బిభూతీ |  మంజుల మంగల మోద ప్రసూతీ  ||  
        జన మన మంజుల ముకుర మల హరినీ | కిఏC తిలక గున గన బస కరనీ || 2 || 
        శ్రీగుర పద నఖ మని గన జోతీ  | సుమిరత  దిబ్య  దృష్ఠి  హియC  హోతీ  || 
        దలన మోహ తమ సో సప్రకాసూ |  బడే భాగ ఉర ఆవఇ  జాసూ || 3 || 
        ఉఘరహిC  బిమల బిలోచన  హీ కే  |  మిటహిC  దోష దుఖ భవ రజనీ కే  || 
         సూఝహిC  రామ చరిత మని మానిక  |  గుపుత ప్రగట జహఁ జో జెహి ఖానిక || 4 || 

నా గురుదేవునిపవిత్రపాదపద్మదూళి సుందరమైనది, సురుచిరమమైనది , సువాససనలువెదజల్లునది. అనురాగ మధురిమలను వెదజల్లునది.  అది జన్మమృత్యురూప సాంసారిక బాధలను నశింపజేయు దివ్యౌషధము.  అమృత రూపావనస్పతి యొక్క దివ్య చూర్ణము .  అట్టి గురుపాదపద్మములకు నా వందనము.  ఈ దూళి శంకరుని శరీరముపైన వున్న విభూతివలె  నిర్మలమైనది,  శుభకరమైనది ,  ఆనంద ప్రదమైనది .  ఇది భక్తుని మనోదర్పణం పై గల మాలిన్యమును తొలగించును.  తిలకముగా ధరించినచో పెక్కు సుగుణములను సమకూర్చును.  శ్రీగురుదేవుని నఖద్యుతులు మణులవలె ప్రకాశించుచు స్మరణమాత్రమునే అవి అజ్ఞాన అంధకారమును రూపుబాపి ఆత్మానందమును గూర్చును.  గురుదేవుల పాదపద్మములను హృదయములో నిలుపుకున్నవాడు భాగ్యాశాలి. గురుదేవుల కృపచే వాని మనోనేత్రములు విచ్చుకొనును, పాపములను,  సాంసారికబాధలను దూరమగును.  శ్రీరామకధలు అనెడి మణిమాణిక్యములు ఏగని యందు గుప్తములుగా వున్నాను, ప్రకటితములైనను  ఆ హృదయమున ప్రకాశమానములగును .  ( చౌపాయీ || 1-4) 
|| స్వస్తి || 

శనివారం, జనవరి 27, 2018

రామచరిత మానస || 4 ||

శనివారం, జనవరి 27, 2018

రామచరిత మానస పారాయణ లోని ఈరోజు నాల్గవ రోజు రెండు శ్లోకాలు తెలుసుకుందాము.

శ్లోకం :
నీల సరోరుహ  స్యామ, తరున అరన బారిజ నయన | 
కరఉ సో మమ ఉర ధామ, సదా ఛీరసాగర సయన || 3|| 

నల్లగల్వలవలె నీలమైన శరీర కాంతి  కలవాడు, విచ్చిన ఎర్రని మందారమువంటి విశాలనేత్రములు కలవాడు,  క్షీరసాగర శయనుడైన  శ్రీమన్నారాయణుడు సర్వదా నా హృదయమున నివశించు గాక.  

శ్లోకం :
కుంద ఇందు సమ దేహ, ఉమా రమన కరునా అయన | 
జాహి దీన పర నేహ, కారఉ  కృపా  మర్దన మయిన  || 4 ||

పార్వతి పతి అయిన పరమేశ్వరుడు  మల్లె పువ్వువలె ,  చంద్రునివలె తెల్లని దేహ కాంతి కలవాడు, కరుణామూర్తి , దీనజనరక్షకుడు , మన్మథమర్దుడు అయిన ఆ పరమేశ్వరుడు నన్ను బ్రోచు గాక.     

శుక్రవారం, జనవరి 26, 2018

రామచరిత మానస _ ప్రార్ధన:

శుక్రవారం, జనవరి 26, 2018


ప్రార్ధన:
సో-జో సుమిరత సిధి హోఇ,   గన నాయక కరిబర బదన |
కరఉ అనుగ్రహ సోఇ ,   బుద్ది రాసి సుభ గుస సదన                 || 1  ||

పరమశివునిప్రథమగణములకు అధిపతియగు గజాననుడు తననుస్మరించువారికి కార్యసిద్దిని కలిగించును. అతను విజ్ఞానఖని (భక్తులకు బుద్ది ప్రదాత ), సుగుణాల రాశి , అట్టి శ్రీ వినాయకుడు నన్ను అనుగ్రహించు గాక .   (సోరఠ|| 1)

మూక హోఇ  బాచాల, పంగు చఢఇ గిరిబర గహన | 
జాసు కృపఁ  సొ దయాల,  ద్రవఉ సకల కలిమల దహన || 2|| 

దయాళువైన భగవంతుని అనుగ్రహముచే మూగవాడు వక్త అగును.  కుంటివాడు దుర్గమములైన పర్వతములైనను ఎక్కగలడు,  కలి కల్మషములను రూపుమాపు ఆ భగవంతుడు నాపై కృపచూపు గాక.  || 2 ||     
స్వస్తి 

గురువారం, జనవరి 25, 2018

రామచరిత మానస ||2||

గురువారం, జనవరి 25, 2018

ఈరోజు  తులసీదాసు రచించిన రామచరిత మానస నుండి శ్లోకాలు 
sreerama feet కోసం చిత్ర ఫలితం
శ్లోకం :  
యన్మాయావశవర్తి విశ్వమఖిలం బ్రహ్మాదిదేవాసురా
             యత్సత్త్వాదమృషైవ భాతి సకలం రజ్జౌ యథాహేర్భ్రమః |
 యత్పాదప్లవమేకమేవ హి భవాంభోధేస్తితీర్షావతాం
             వందే2హం తమశేషకారణపరం రామాఖ్యమీశం హరిమ్  ||

శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు  యొక్క అవతారము .  ఆయన మాయకు ఈ సమస్త విశ్వము, బ్రహ్మాది దేవతలు, అసురగణాములు వసవర్తులు.  ఆయిన అస్తిత్వ ప్రభావముచే మిథ్యా జగత్తు అంతయును రజ్జు సర్పబ్రాంతిచే సత్యముగా తోచును .  ఆయన పాదములే భవసాగరమును దాటగోరువారికి నౌకలు .  అతడు అశేషకారకములకు అతీతుడు. శ్రేష్టుడు .  అనగా మూలకారణమైనవాడు. అట్టి శ్రీరామచంద్ర ప్రభువునకు ప్రణామములు. 

శ్లోకం :  
నానాపురాణనిగమాగమసమ్మతం యద్ 
రామాయణే నిగదితం క్వచిదన్యతో2పి | 
    స్వాంతఃసుఖాయ తులసీ రఘునాథగాథా
భాషానిభంధమతిమంజులమాతనోతి || 

రఘుకులతిలకుడైన శ్రీరామచంద్రునిగాథ వేదపురాణశాస్త్రసమ్మతము.  ఆకథనే శ్రీమద్రామాయణము మహాకావ్యముగా వాల్మీకిమహర్షి మనోజ్ఞముగా వర్ణించెను.  ఇతరకవులు ఆ కథను వివిద రీతుల రచించిరి.  అట్లే ఈ తులసీదాసు తన ఆత్మానందము కొరకు ఈ రామాయణ గాథనే సరళమైన మధురమైన భాషలో వ్రాయుచున్నాడు.

|| స్వస్తి || _/\_

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)