Blogger Widgets

బుధవారం, డిసెంబర్ 15, 2021

సిరినోము చేసే సమయం వచ్చింది (మార్గళి త్తింగళ్ పాశురము)

బుధవారం, డిసెంబర్ 15, 2021

  ధనుర్మాసం మొదలు  అయ్యింది కదండి. ఈ నెలరోజులు పాశురాలు పాడతాము కదా.  అయితే మరి మొదటి పాశురం గురించి తెలుసుకుందాం.

గోపికలును గోదాదేవి ఈ వ్రతం గురించి ముందుగా వారు మార్గశిరమాసం గురించి ఆ వ్రతం చేయుటకు అనుకూలంగా వుందని కాలాన్ని వారు పొగిడారు.  తరువాత ఈ వ్రతం ఎవరు చేస్తారో దాని వల్లన కలుగు ఫలితం గురించి తెలుసుకున్నారు.  ఆవిషయాన్ని మొదటి పాశురంలో చెప్పదలచారు.  
                                    మొదటి పాశురం లో మనకు  నారాయణ తత్వము కనిపిస్తుంది. 

మార్గళి త్తింగళ్ పాశురము :
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .
పాశురం తాత్పర్యము:  
ఒహ్హో మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజులు  . ఓ! అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ! బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్న సంకల్పమున్నచో రండు. ముందునడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపదరాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహము నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించని మనకే , మనమాపేక్షెంచు వ్రతసాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చేయుటను చూచి లోకులందరు సంతోషించునట్లు మీరు అందరూ కూడా చేరి ఈ వ్రతము చేయండి అని భావము.

సిరినోము  చేసే సమయం వచ్చింది 

సిరినోము 

రారమ్మా ఓ అమ్మలారా! రారే మమ్మ!
నీరాడ మనసున్నవారు, మీరూ  మీరూ !
శ్రీరమ్యమైన మన వ్రేపల్లెలోన
చేరి, కన్నియలార! కూరిమి చెలులార !   !!రారమ్మ !!  

ఇది మార్గశిరము , వెన్నెలవేళ , భాసురము !
ఇది పరవాద్య వ్రతారంభ వాసరము !
మదిలోన జగమెల్ల ముదమంది పొగడ ,
కదిసే కంకణ కటక కింకిణులు కదల  !! రారమ్మ !!

మరీమరీ కనికనీ మెరిసేటి కనులతో 
మురిసే యశోదమ్మ ముద్దు సింగపుకొదమ,
కరిమొయిలు మెయిహోయలు  గల అందగాడు,
వరదుడౌ మనరేడు వ్రతమేలువాడు !! రారమ్మా !!

కరమందు కరకువాల్ కాపుగా దాలిచి 
వారాలేటి మేటినందుని నందనుండు 
అరుణశశిబింబనిభ శుభవదనుడు 
సరసిజాక్షుడే నోము కరుణింపగా !! రారమ్మ !!

ధనుర్మాసం మొదలు కాబోతుంది.

 ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాసం వచ్చింది దనుర్మాసం కూడా మొదలు కాబోతుంది. ఎంతో విశేషమైన రోజులు.  ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి పాడిన ౩౦ పాశురాలును పాడతారు  ఇది చాలా విశేషమైననెల. 

అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజులు రోజుకు ఒక పాశురమ్  చదువుతారు . ఇలా 30 రోజులు పాశురములు నివేదిస్తారు.
శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .

మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే  ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి.  తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి  కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది.  మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం.  ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను.
.
గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.  

శుక్రవారం, నవంబర్ 12, 2021

శీతాకాలంలో తీసుకోవలసిన చర్మరక్షణ ....మధుమేహులకు ప్రత్యేక శ్రద్ధ ఎలా?(win...

శుక్రవారం, నవంబర్ 12, 2021

                        

శీతాకాలం లో తీసుకోవలసిన చర్మ రక్షణ
మధుమేహులకు ప్రత్యేక శ్రద్ధ ఎలా?
ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తో మీముందుకు శీతాకాలం చర్మరక్షణ అన్న విషయంతో మీ ముందుకు వచ్చాను.  మధుమేహులు తీసుకోవలసిన ప్రత్యేక రక్షణ ఎలా తీసుకోవాలి మొదలగు విషయాలు చెప్పాను ఈ వీడియో పూర్తిగా చూసి  మీ సలహాలు సూచనలు తెలపండి ధన్యవాధములు. 

బుధవారం, నవంబర్ 10, 2021

షుగర్ డౌన్ అంటే ఏమిటి?అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

బుధవారం, నవంబర్ 10, 2021

ఉన్నట్టుండి ఒక్కసారిగా షుగర్ డౌన్ అయితే వెంటనే మనం ఏమి చెయ్యాలి.  
అసలు షుగర్ డౌన్ అంటే ఏమిటి?
అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)