శనివారం, జనవరి 01, 2022
గోపికలు కృష్ణుని పొంది యనుభవించాలని ఆవేసముచే కృష్ణపరమాత్మ కనిపించగానే తామూ అనుభవించ వచ్చునని తొందరగా మేలుకొన్నారు. కాని శ్రీ కృష్ణుడు మేలుకోలేదు. తరువాత బలరాముని మేలుకోల్పారు . అప్పుడు కుడా కృష్ణుడు మేలుకోలేదు . తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా మేలుకోల్పవచ్చని ఆమెని మేలుకోల్పుతున్నారు ఈ పాశురములో .
ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్ పాశురము:
ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము :
ఏనుగులతో పోరాడగలిగినవాడును, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలముకలవాడును, మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును, యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లు కేశ పాశము గల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము . కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి . మదవీలతప్రాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చొని కోకిలలు కూస్తున్నాయి. కావున తెల్లవారినది , చూడు. బంతిని చేతిలో పట్టుకోన్నదానా! మీ బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి . నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి. ఎర్ర తామర పూలు ను పోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము. అని నీలాదేవిని కీర్తిస్తున్నారు . ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.
నందగోపుని కోడలా
నందగోపుని కోడలా! ఓ నీల!
ఎందుకమ్మా తలుపు తీయవు?
విందువా కోళ్ళు కూసేను, ఆ వంక గురి
వింద పోలందు పలికేను గోరింక! || నందగోపుని||
కందుకము వ్రేళ్ళ సందిటను కలదాన!
అందమగు కురుల నెత్తాని కల లలన!
కుందనపు కంకణాల్ చిందులాడీ పాడ
కెందమ్మి పోలేటి నీ సోగ కేల ||నందగోపుని||
సుందరుడు నీ స్వామి శుభనామములను మన
మందరమునూ కూడ పాడుకుందాము!
క్రందుకొను గంధసింధురబలముతో, వైరి
బృందముల క్రిందపడజేయగలిగే వాని ||నందగోపుని||
గోపికలు , పదిమంది గోపికలను మేల్కొలిపికొని నందగోపభావనమును చేరినారు. భావనపాలకుని ద్వారపాలకుని. ప్రార్ధించి వారి యనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరచి వాడలేను. గోపికలందరూ ను నందగోపభావనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై సయనించినారు. వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చెయునో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో జాగరుడై ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక లభించిన కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మద్యలొ యశొద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఇందులొ మెలుకొల్పుతున్నారు. మరి ఎలాలేపుచున్నారో చూడండి.
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం పాశురము
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము , ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగలదీపము వంటిదానా! మా స్వామినీ ! యశోదా! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను.
అని గోపికలు ప్రార్ధించిరి.
మేలుకో! మేలుకో!
చాలించి నీ నిదుర-మేలుకో!
మేలుకో! మేలుకో!
చాలించి నీ నిదుర-మేలుకో!
ఏ లేవడి రానీక, ఎల వేళ లరసే మా
ఏలికా! నందగోపాలకా! మేలుకో చాలించి నీ నిదుర
తల్లీ! వ్రజవల్లీ నవ పల్లవాభిరామా!
అల్లన లేవమ్మ! యశోదమ్మ! నందదృహదీపను! ||మేలుకో! మేలుకో!||
భువిని దివిని మీరి భువన భునవముల నిండే
త్రివిక్రమా! పురుషొత్తమ! దేవదేవ! శ్రీకృష్ణా! ||మేలుకో! మేలుకో!||
ఆలించి మనవి మా మేలెంచి ఏలుకో!
కనకవీర మంజీరము ఘనపదముల తొడవుగా
తనరే బలదేవా! నీ తమ్మునితో మేలుకో!
ఆలించి మనవి మా మేలెంచి ఏలుకో!
గురువారం, డిసెంబర్ 30, 2021
గోపికలు నిద్ర పోతున్న పదిమంది గోపికలను మేల్కొల్పి న తరువాత నంద గోప భవనమునకు చేరినారు. పదిమంది గోపికలును మాత్రమే కాదు . ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కల గోపికలను అందరను మేలు కొలిపి నంద గోప భావనమునకు వచ్చిరి. నందగోపుని ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోనికి ప్రవేశింతురు .
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ పాశురము:
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
అందరకు నాయకునాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భావనపాలకా లోనికివిడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచేఅందముగా వున్నా గడియలను తెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయినమణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేనుమాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము. శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము . స్వామీ ముందుగానే నీవు కాదనకు. దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచిమమ్ములను లోనకు పోనిమ్ము . అని భావనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.
నందగోపస్వామీ మందిర రక్షకా!
నందగోపస్వామీ మందిర రక్షకా!
సుందరద్వజ తోరణ ద్వారపాలకా!
వల్ల కాదనకు! వలదనకు మునుమున్నె
అల్లన రతనాలతలుపు గొళ్లెము తీయ ||నందగోపస్వామీ||
కల్లకపటములేని గొల్ల కన్నెల మన్న!
నల్లని తిరుమేని వానికై వచ్చాము ||నందగోపస్వామీ||
మ్రోయు పరవాద్య మిడెదనని నిన్ననే
మాయలాడు తానే మాట యిచ్చేనని
ఈయెడ తానమాడి ఏతెంచినా మన్న!
తీయుమా తలుపు! పాడేము మేల్కొలుపు! ||నందగోపస్వామీ ||
బుధవారం, డిసెంబర్ 29, 2021
ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పదవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు. దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహేనవ పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచే ఈ వ్రతము నాకు పుర్వరంగామును తెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈనాడు మేల్కొల్ప బడుచున్నది. ఈమెను ఏవిదంగా లేపుచున్నారో కదా! ఈ పాశురము న లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో పాశురము:
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా.
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము. లెమ్ము మాతో వచ్చి చేరుము అని లోపలి గోపికను లేపినారు.
"ఓ చిరుత రాచిలుక!
"ఓ చిరుత రాచిలుక! లేచి రావేమే! వేచియున్నామే!"
"వేచేవారి నిదుర దోచుకున్నానో!
ఓ చెలులు! నా నిదుర దాచుకున్నానో లేచి వచ్చేనే!"
"భళిభళీ! సఖి! ఎంత నుడికారితనమే!
తెలుసులే నీ నంగనాచితనము మాకు!"
"మీరు గడుసరులు కారేమో పాపము!
నేనే కాబో లంత నేరవని దాన!
వచ్చిరో అందరును నెచ్చెలులు?
"ఆ వచ్చి నీవే లెక్కపెట్టుకోవే
విచ్చేయవే, అమ్మ చెచ్చర! లేకున్న
మచ్చిక పని యున్నదేమో ఏదయిన
!" ||"ఓ చిరుత ||
"ఉరు మత్తగజకుంభ మురయ మొత్తినవాని,
అరుల దర్పమ్ము నరవర చేయువాని
అరిది గుణములవాని, హరిని కీర్తింప
అరుగగా వలయు బిరబిర రమ్మ ! ఓ అమ్మ " ||"ఓ చిరుత ||
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ