ప్రస్తుతము గోపికలు మంచి దశకు చేరి ప్రేమ దసలోనున్న వారగుటచే తమకు కలిగిన అమంగళములను అతనిని దర్శించి పోగొట్టుకోవాలని , తమకు లేని మంగళములను సంపాదించుట మాని ప్రేమైక హృదయులై శ్రీ కృష్ణునకు మంగళము పాడుచున్నారు.ఇట్లే గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వలన తమ కార్యము నెరవేరునని , తమ ప్రభువు నడచి వచ్చి ఆసనము పై కుర్చొనగానే ఆ పాదాలు ఎర్రదనము చూచి తామూ చేసిన యపచారమునకు భాధపడి మంగళము పాడిరి. ఈ పాశురము చాలా విశేషమైనది. స్వామివారికి హారతి చాలా ఇష్టం కదా ఈ పాసురములో స్వామికి హారతి ఎక్కువగా ఇస్తారు. విశేషమైన నివేదనగా దద్యోజనం ఆరగింపుగా ఇవ్వాలి.
అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
ఆనాడు బలి చక్రవర్తి తనదికాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడించగా ఈ లోకమునంతను వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదములకు మంగళము .రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావనుడుండు లంకకే వెళ్లి సుందరమగు భవనములు కోటయుగల దక్షినదిసనున్న లంకలో ఉన్నా రాక్షసులను చెండాడిన మీ భాహు పరాక్రమములకు మంగళము . శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేసించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము .వత్సము పై ఆవేసించిన అసురునితో వెలగ చుట్టుపై నాఎసించిన యసురుని చంపుటకై ఓడిసేలరాయి విసరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసరనపుడు ముందువేనుకకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినని కోపముతో రాళ్ళ వాన కురియగా గోపాలురకు గోవులకు భాధ కలుగకుండా గోవర్ధన పర్వతమును గోడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శ త్రువులను సములముగా పెకలిచి విజయము నార్జించి ఇచ్చేది మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము.
ఈ విధముగా నీ వీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము నందగ మేమీనాడు వచ్చాము అనుగ్రహించుము.
అని ఈ పాశురములో మంగళము పాడుతూ భగవానుని అనుగ్రహించమని కోరుచున్నారు.
ఈ విధముగా నీ వీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము నందగ మేమీనాడు వచ్చాము అనుగ్రహించుము.
అని ఈ పాశురములో మంగళము పాడుతూ భగవానుని అనుగ్రహించమని కోరుచున్నారు.
మంగళమని పాడ వస్తిమి,
మంగళమని పాడ వస్తిమి,
మరిమరి నీ మగటిమికి - మంగళమని!
ముంగిట నిలబడిన మా కొ
సంగుదవని పరవాద్యము || మంగళమని||
అల్లనాడు లోకమ్ముల
అలవోకగ కొలిచిన నీ
పల్లవారుణ శ్రీపద
పద్మములకు మంగళమని ,
పెల్లుగ నీ వెత్తి వెడలి
సుందర లంకాద్వీపము
తల్లడబడ మాసిన నీ
దర్పమునకు మంగళం ||మంగళం||
కాలదన్ని ఒక తృటిలో
కరక శకట ధైత్యుని
నేల రాలు నటు చేసిన
నీ కీర్తికి మంగళమని,
కూళను వత్సాసురు నవ
లీలగ చిరుకోలవోలె
తూలవిసురు దుడుకు అడుగు
దోయికినీ మంగళం! ||మంగళం||
దండిగ గోకులమునకై
దలదాలిచి గొడుగువోలె
కొండ నెత్తివేసిన నీ
గుణమునకును మంగళమని
భండనమున నొక వ్రేటున
పగతుర పీచ మ్మడంచి
చెండాడిన నీ చేతి ప్ర
చండాసికి మంగళం! || మంగళం||