గోపికలు ఈ విధముగా మంగళము పాడుతుఉంటే శ్రీ కృష్ణ పరమాత్మ వారి ప్రేమకు , వాగ్వైభవనమునకు చాలా సంతోష్మ్చి " ఓ గోపికలారా! మీకు జన్మసిద్దాముగా మా యందుగల ప్రీతిచే మంగళము నాకాక్షించుచున్నారు . చాలా సంతోషమే , కానీ ఈ రాత్రివేళ మంచులో నడచి శ్రమ పడి వచ్చారు . చాలా శ్రమ అయ్యింది. కేవలము మంగళ శాసనము కాంక్షతోనే యున్నట్లు చెప్పుతున్నారు . కానీ దానికంటే వేరొక ప్రయోజనము లేదా? ఉన్నచో చెప్పండి. తప్పక నేరవేర్చుతాను. అనెను . నీగుణ కీర్తనము చేయుచూ వచ్చుటచే మంచు , రాత్రి , మొదలగున్నవి మాకు ఇబ్బందిని కలిగించవు. మాకు ప్రధాన ప్రయోజనము నీకు మంగళము పాడుతయే. లోకులకై వ్రతమోనర్చుటకుపర నొసంగిన ఒసగుము. మేము మీ స్వరూపమును మా స్వరూపమును తెలిసిన వారమే. కావునామంగళా శాసనమే ప్రధాన ప్రయోజనము అని తెలియచేయుచు శ్రీ కృష్ణ అవతార రహస్యమును తామెరుగుదుము అని దానిని ఈ పాశురములో వివరించినా మన గోపికలు. గోపికలు ఈ పాశురములో శ్రీ కృష్ణుని జన్మ రహస్యమును కీర్తించుచు దానివలన శ్రమ తీరి ఆనందించుచున్నారు. అని చెప్పుచున్నారు.
గోపికలు ఈ పాశురములో శ్రీ కృష్ణుని జన్మ రహస్యమును కీర్తించుచు దానివలన శ్రమ తీరి ఆనందించుచున్నారు. అని చెప్పుచున్నారు.
ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్ పాశురము:
ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర
తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిరపిత్తు కంజన్ వైత్తిల్
నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి
వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి , శంఖచక్రగధాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవి కుమారుడవై జన్మించి , శ్రీ కృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి, కట్టను కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభావముగల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్ట భావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యతముచేసి వానికడుపులో చ్చిచ్చువై నిన్ను చంపవలెనని తలచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా! నిన్నే కోరి వచ్చినాము . పర అను వాద్యము నిచ్చిన ఇమ్ము . సాక్షాత్తు లక్ష్మీ దేవే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును , నీ వీర చరిత్రమును , కీర్తించి శ్రమను విడిచి పెట్టి సంతోషించు. భగవానుని పాడుటకు సాధనానుస్టానము చేయుచున్నప్పుడు చాలా శ్రమలు కలుగును. ఆ శ్రమలు శ్రమగా కాక ఆనందముగా ఉండాలి. దానికి నామసంకీర్తనమే సాధనము అని గోపికలు ఇందులో వివరించారు.
అర్ధులము,అనుగులము,
అర్ధులము,అనుగులము,
అంజలింప వచ్చినాము!
అడిగిన వర మిడుదు వని,
అనురాగపు గని వని!
ఒక అను కొమరుడవై, వే
రొక అను ఒడిలో దాగి,
ఒదిగిన నిను హింసింపగ
ఊహించిన కంసునకు
అసురునకు కడుపుమంటవు!
అర్ధులకు అమృతాల పంటవు! ||అర్ధులము||
సిరికూడా వలచే నీ
దొరతనమూ, దౌర్వీర్యము
పరవసమున పాడి పాడి
విరహ మెల్ల మరతుము!
పరవాద్యము కరుణింపుము
పరమానంద మొసంగుము! ||అర్ధులము||