కధ చెబుతాను ఉ కొడతారా.
అనగనగా ...................................
ఉద్దాలక మహర్షి కుమారుడు శ్వేతకేతు .
ఒక రోజు కుమారుడుని ఇలా ప్రశ్నించాడు తండ్రి.
కుమారా! నీవిన్ని రోజులు పరతత్వము బ్రహ్మము . అను విషయములను గురించి అధ్యయనం చేసావు కదా.
ఈ భగవంతుడు అసలు ఎక్కడున్నాడు ? అని అడిగాడు.
వారిద్దరూ ఇలా సంభాషించు కుంటున్నారు.
శ్వేతకేతు: భగవంతుడు సర్వాంతర్యామి అని మా గురువుగారు చెప్పారు.
ఉద్దాలకుడు: కుమారా !సర్వవ్యాపకము అంటే ఏమిటి ?
శ్వేతకేతు: తెలియదు నాన్నగారు.
ఉద్దాలకుడు: కుమారా! నీవు లోపలికి వెళ్లి ఒక పాత్రలో నీరు. కొంచెం ఉప్పు తీసుకుని రా.
(శ్వేతకేతు తండ్రి చెప్పినట్లే చేసాడు)
ఉద్దాలకుడు: కుమారా! ఉప్పును ఆ నీటిలో బాగా కలుపు నోట్లో వేసుకొని చూడు.
(శ్వేతకేతు అలానే చేసాడు)
శ్వేతకేతు: ఉప్పగా వుంది నాన్నగారు.
ఉద్దాలకుడు: పాత్రలో చెయ్యి పెట్టి ఉప్పు ను బయటికి తీయ్యి.
(శ్వేతకేతు నీటిలో చెయ్యి పెట్టి చూసాడు)
శ్వేతకేతు: నీటి లో ఉప్పు కరిగి పోయింది .ఉప్పుగా చిక్కదు .
ఉద్దాలకుడు: నీ కేలా తెలిసింది?
శ్వేతకేతు : పాత్రలోని నీరు ఉప్పగా ఉంది కదా.
ఉద్దాలకుడు: మంచిది. నీవు అనుభవపూర్వకంగా ఉప్పు నీటిలో కలసి పోయిమ్దని తెలుసుకున్నావు. అదేవిధముగా భగవంతుడు ఈ సృష్టిలో లీనమైనాడు.
ఆ సత్యాన్ని అనుభవ పూర్వకంగానే తెలుసుకోవాలి .
ఇదండి కధ. దీనిని మా స్కూల్ ఫంక్షన్ లో డ్రామా కింద వేస్తున్నాము. ఎలావుంది.
గురువారం, ఫిబ్రవరి 26, 2009
బుధవారం, ఫిబ్రవరి 25, 2009
NATURE'S BEAUTY
శనివారం, ఫిబ్రవరి 21, 2009
सीखो
గురువారం, ఫిబ్రవరి 19, 2009
లక్ష్య నిర్దేశనం :
లక్ష్యనిర్దేశనం :
సుర్యోదయాన్నే పక్షులు రెక్కలు విచ్చుకొని ఆహార సంపాదనకు ఎగిరిపోతాయి. అది వాటి లక్ష్యము . ప్రపంచము ఏమైనా వాటికి అనవసరము. సూర్యుడు సాయంత్రానికి పడమటి దిక్కుకు వాలినా మర్నాటికి పొద్దున్నే తూర్పునకు ఉదయిస్తాడు . లోకానికి వెలుగును ప్రసాదిస్తాడు. అది ఆయన లక్ష్యం. కారు మబ్బులు కమ్మినా, తుపానులే వచ్చినా తన మార్గమునుంచి పక్కకు తప్పుకోడు. మనమూ అలాగనే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. గడిచిన కాలం ఎలా ఉన్నా ముందు ముందున్న అత్యన్నత స్తాయికి చేరాలన్న లక్ష్యాన్ని నిర్దేసించుకోవాలి. లక్ష్యం లేని జీవితం గాలిలో పెట్టిన దీపంలాంటిది. అత్యున్నత స్తాయికి చేరాలన్న కోరిక వున్నంత మాత్రానా కోరిక నెరవేరదు. దానికి తగ్గ కృషి పట్టుదల ఉండాలి. దానికి తగ్గ లక్ష్య్ నిర్దేశం వుండాలి. లక్ష్య నిర్దేశం లేక పొతే జీవితములో ఏమి సాదించలేము.
ఇదంతా మా అమ్మమ్మ నాకు చెప్పింది. నేను డాక్టర్ కావాలన్న లక్ష్యం ఏర్పరచుకున్నాను . ఆ లక్ష్యానికి నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అవ్వాలని అనుకుంటున్నాను. నేను ఆ దిశ గానే ప్రయత్నిస్తాను.
thanks to అమ్మమ్మ.