ఈ రోజు జూన్ 21 వ తేదిన ప్రపంచ సంగీత దినోత్సవంగా జరుపుకుంటారు. అందుకు గాను నేను నాకు నచ్చిన అన్నమయ పాటతో మీ అందరికీ ప్రపంచ సంగీత దినోత్సశుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
ప. లెండో లెండో మాటాలించరో మీరు
కొండల రాయనినే పేర్కొన్న దిదె జాలి లెండో
చ. మితి మీరెఁజీకట్లు మేటి తలవరులాల
జతనము జతనము జాలోజాలి
యితవరులాల వాయించే వాద్యాల కంటే
నతిఘోషముల తోడ ననరో జాలి లెండో
చ. గాములు వారెడి పొద్దు కావలికాండ్లాల
జాముబాము దిరుగరో జాలోజాలి
దీమనపు పారివార దీవెపంజులు చేఁబట్టి
యేమరక మీలో మీరు యియ్యరో జాలి లెండో
చ. కారుకమ్మె నడురేయి గడచెఁ గట్టికవార
సారెసారెఁ బలుకరో జాలోజాలి
యీరీతి శ్రీ వేంకటేశుఁడిట్టె మేలుకొన్నాడు
గారవాన నిక మానఁ గదరో జాలి లెండో