నవ్వితినే గొల్లెతా నాయ మవుర గొల్లడా
యెవ్వరేమనిరే నిన్ను నియ్యకుంటిఁ బదరా
కానీలే గొల్లెతా కద్దులేరా గొల్లడా
ఔనా మఱవకువే అట్టే కానీరా
నే నేమంటిని నిన్ను నీకే తెలుసురా
మానితినే ఆమాట మంచిదాయఁ బదరా
అదియేమే గొల్లెతా అందుకేరా గొల్లడా
కదినెఁ గడుపనులు కల్లగాదురా
ఇది నిక్కమటవే ఇంతకంటె నటరా
పదరకువే నీవు పలుమారు నేలరా
మెచ్చితినే గొల్లెతా మేలు లేరా గొల్లడా
కుచ్చితిఁ గాగిట నిన్నేఁ గూడుకొంటిరా
యిచ్చకుఁద శ్రీవేంకటేశుడను నేనేయెచ్చరించవలెనా, యెఱుగుదుఁ బదరా