ఈరోజు మా ప్రియమైన అమ్మమ్మ పుట్టినరోజు. నాకు పూర్తిగా బ్లోగ్ పొస్ట్లు పెట్టడానికి సహకరించే మా అమ్మమ్మని మీరు చూడాలి అని నన్ను చాలాసార్లు అడిగారు కదా. ఈరోజు మా అమ్మమ్మ పుట్టినరోజు సంధర్బముగా విషెస్ చెప్పేద్దామా. సరే
అమ్మమ్మ పుట్టిన రోజు శుభాకాంక్షలు
అమ్మకు అమ్మయి ప్రాణము
నిమ్మన్నా యిచ్చినట్టి ఈ అమ్మమ్మే
ముమ్మాటికి నా దేవత.
అమ్మమ్మకు మించువార లవని గలరా.
ఆకలి కనుగొని పెట్టును.
లోకోక్తులు చెప్పుచుండు, లోపము బాపున్
లోకంబున అమ్మమ్మే
నాకును మా అమ్మకనగ నారాయణిగా!
అమ్మమ్మ మాట తీయన
అమ్మమ్మయె చేయు వంట అమృతము మాకున్
అమ్మమ్మ చేయు సేవలు
అమ్మమ్మా! చెప్ప వశమె? అగణితమిలలో.
అమ్మమ్మ స్ఫూర్తి గొల్పును.
అమ్మమ్మయె మార్గదర్శి. అనితరమగు ఆ
కమ్మని మనసును కలిగిన
అమ్మమ్మయె నాకు దైవమందును భువిపై