Blogger Widgets

ఆదివారం, మార్చి 16, 2014

పూర్ణిమ విశేష శక్తితో కూడిన హోలీ

ఆదివారం, మార్చి 16, 2014

ఫాల్గుణ శుధ్ధ పూర్ణిమ విశేష శక్తితో కూడినది. ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి.

శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు.


నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦!
ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!!

ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦.
హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాసిస్తాయి, అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషము.  
 హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు; ముఖ్యంగా జానపద పాటలు అనగా "హోరి" పాటలను పాడేవారు. కొన్ని సంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి.
సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.
వసంత కాలంలో వాతవరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం: సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.

తడి రంగుల కొరకు, మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది.  రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. వీటి వల్ల అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి.  అలాంటి వ్యాధులు రాకుండా వుండాలి అంటే రసాయన రంగులను ఉపయోగించకుండా వుంటే మంచిది.
ఇది వసంతోత్సవ పండుగ.  హోలీ పండుగ కృష్ణుడు కూడా జరుపుకున్నాడు అంటారు.  ఈ పండుగ గురించి నేను కొంచెమే తెలుసుకున్నాను అని నాకు అనిపిస్తోంది. 


హోలీ పండుగను అందరు సంతోషము గా జరుపుకోవాలని అనుకుంటున్నాను.  
అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు.

శుక్రవారం, మార్చి 07, 2014

Women's Day

శుక్రవారం, మార్చి 07, 2014

Happy International Women's Day.

గురువారం, ఫిబ్రవరి 06, 2014

ఆదిదేవ నమస్తుభ్యం

గురువారం, ఫిబ్రవరి 06, 2014


 నమస్కారిస్తే ఆయురారోగ్యాలుఅర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడుసూర్యడు.
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కర
దివార నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ll

ఓ ఆది దేవా ! నీకు నమస్కారము. భాస్కరా! నన్ను కరిణిమ్చు. ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.
మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు. ఇది సూర్యునికి సంబందించిన రోజు . ఇది ముఖ్యముగా సూర్యభగవానుని ఆరాధించు పండుగ. ఈ రోజు సూర్యడు తన రధమును ఉత్తరం దిక్కునకు మళ్ళించే రోజు.

ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని
"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి అర్గ్యమిస్తే అస్తిస్వర్యములిస్తాడు.
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏ డురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు,శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
శుద్ధ సప్తమికి ’రథసప్తమి’ అని పేరు. ఈరోజు ఒక పరిపూర్ణ పర్వం. దీక్షానిర్వహణకి, వ్రతాచరణకి, సాధనాలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడుగునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది.
సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్రపువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు ప్రత్యేకతలు.ఆవుపాల పాయసం నివేదించడం, అది కూడా ఆరుబయట సూర్యకిరణాలు పడే తావున ఆవుపేడ పిడకలను మండించి, దానిపై పాయసాన్ని పొంగించడం ఒక చక్కని ప్రక్రియ. వైద్యవిధానం, దేవతా మహిమ కలబోసిన పద్ధతి ఇది.
’రథ’శబ్దం గమనంలోని మార్పుని సూచిస్తుంది. సూర్యకిరణ ప్రసారం భూమికి లభించే తీరులో ఈ రోజునుండి ఒక మలుపు. ఈ మలుపులోని దేవతా ప్రభావాన్ని పొందేందుకు మన సంస్కృతిలో ఈ ఆనవాయితీని ప్రవేశపెట్టారు.
రామాయణంలో రావణవధి సమయంలో శ్రీరాముడు ’ఆదిత్యహృదయం’తో సూర్యోపాసన చేసి విజయం సాధించాడు. భారతంలో ధర్మరాజు ధౌమ్యుని ద్వారా సూర్యాష్టోత్తర శతనామ మంత్రమాలను ఉపదేశంపొమ్ది, ఆదిత్యానుగ్రహంతో అన్న సమృద్ధిని, అక్షయపాత్రని సంపాదించాడు.
శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసన ద్వారా కుష్టువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. చారిత్రకంగా మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.
ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు రవికృపా వైభవాన్ని చాటి చెబుతున్నాయి.
ప్రత్యక్షదైవమైన కర్మసాక్షిలోనే బ్రహ్మవిష్ణు రుద్రాదులు, జగదంబామూర్తు ఉన్నారని మన పురాణాలు చాటి చెబుతున్నాయి.
"ఏష బ్రహ్మా విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః...సర్వదేవాత్మకోహ్యేషః" - మనం ఆరాధించే అనేక దేవతలు, ఒకేదేవుడైన ఆదిత్యమూర్తి యొక్క వివిధ శక్తి రూపాలు. అందువల్లనే. "ఏకం సత్ విప్రా బహుధావదన్తి" అని వేదోక్తి, భానుమూర్తిని కీర్తించింది.

రధ సప్తమి శుభాకాంక్షలు. ప్రత్యక్ష భగవానుడు అందరికి ఆయురారోగ్యాలుఅర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 

బుధవారం, జనవరి 08, 2014

అపర మార్కండేయుడు స్టీఫెన్ హాకింగ్

బుధవారం, జనవరి 08, 2014

తనంతట తాను కనీసం కదలలేని ఎలాంటి సహకారం లేని శరీరము, మాట్లాడాలి అంటే కంప్యుటర్ సహాయంతో చక్రాల కుర్చికి అతుక్కుపోయిన మనిషి అతి అరుదైన మోటార్ న్యురాన్ వ్యాధి కలిగి తన శరీరాన్ని మొత్తం పనిచేయకుండా వుంన్నా కూడా విచిత్రంగా అతని మెదడు మాత్రమె పూర్తిగా పనిచేస్తుంది .    ఇది కేవలము అరుదైన విషయం వైద్య శాస్త్రానీకె పెద్ద సవాలుగా చెప్పుకోవచ్చు.  ఇదంతా కేవలము ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ యొక్క సంకల్ప బలం మాత్రమె.  అతనికి వచ్చిన వ్యాధి చాలా అరుదైన ప్రమాదకరమైనది. ఆవ్యాధిని కూడా లెక్కచేయకుండా అపరమార్కండేయుడుగా వున్నవాడు స్టీఫెన్ హాకింగ్.  కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం.
స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందించారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే.
అప్పటికి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో మరణించి దాదాపు 300 సంవత్సరాలు అవుతోంది.  గెలిలియో మరణించి న రోజు జనవరి 8వ తేది నాడే 1942 వసంవత్సరం జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు.  లండన్ లోని హైగేట్స్ లో స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని ప్రారంభించాడు. మిల్ హిల్ ప్రాంతములో తండ్రి స్టీఫెన్ ని అక్కడి సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేర్చాడు. తన గణిత ఉపాధ్యాయుని ప్రేరణతో గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్నాడు స్టీఫెన్. కాని దానికి వ్యతిరేకంగా తండ్రి రసాయనశాస్త్రంలో చేర్పించాడు. తరువాత 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్ పరీక్ష రాశాడు. అందులో సఫలీకృతుడు కాగలిగినా భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. 1962లో కేవలం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలిగాడు. కాస్మాలజి, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కి వెళ్ళాడు. అప్పటి నుంచి స్టీఫెన్ పరిస్థితి పూర్తిగా మారింది. అన్నం తినాలన్నా, కనీసం బూట్ల లేసు కట్టుకుందామన్నా, స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు. క్రిస్‌మస్ సెలవులకు ఇంటికి వెళ్ళిన స్టీఫెన్ పరిస్థితి ఆయన తల్లిదండ్రులను కలవర పెట్టింది. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది. తల్లిని మధనపెట్టింది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు. నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూస పై ఇది ప్రభావం చూపుతుంది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా. కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మళ్లీ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన హాకింగ్ తన పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి మిత్రులు సహకరించాలని చూసినా స్టీఫెన్ సున్నితంగా తిరస్కరించే వాడు. 
ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పని చేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయాడు. క్వాంటం థియరి, జనరల్ రిలెటివిటీ లను ఉపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడియేషన్ ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ పుస్తకరచన ప్రారంభించాడు. ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల xbvbdng ఉండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూకాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. 
"శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువు కు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి అవిఅన్నీ పూర్తిచేస్తాను" అంటారు హాకింగ్.   
అతనికి వచ్చిన ముఖ్యమైన అవార్డులు Prince of Asturias Award 1989 లోను Copley Medal 2006 లోను వచ్చాయి.  
అపర మార్కండేయుడు సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, కాలబిలాలు,Theoretical cosmology,Quantum gravity అవిష్కారవేత్త స్టీఫెన్ విలియం హాకింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)