Blogger Widgets

Sunday, June 13, 2010

దిబ్బలు వెట్టుచు

Sunday, June 13, 2010


దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో | ఉబ్బు నీటిపై నొక హంస ||

అనువున గమల విహారమె నెలవై | ఒనరియున్న దిదె ఒక హంస |
మనియెడి జీవుల మానస సరసుల | వునికి నున్న దిదె ఒక హంస ||

పాలు నీరు నేర్పరచి పాలలో | నోలలాడె నిదె యొక హంస |
పాలుపడిన యీ పరమహంసముల | ఓలి నున్న దిదె యొక హంస ||

తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల | నుడుగక పొదిగీ నొక హంస |
కడు వేడుక వేంకటగిరి మీదట | నొడలు పెంచెనిదె యొక హంస ||

2 comments:

  1. మీ బ్లాగ్ చాలా బాగుంది. ఇంత చక్కని బ్లాగుని ఇంత కాలం మిస్ అయినందుకు బాధ పడుతున్నాను. మీకు నా ఆశీస్సులు

    ReplyDelete
  2. ధన్యవాధములు తాతగారు.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers