Blogger Widgets

Thursday, September 02, 2010

శ్రీ కృష్ణ లీలలు

Thursday, September 02, 2010

శ్రీ కృష్ణాష్టమి సందర్బంగా అందరికీ నా శుభాకాంక్షలు.కృష్ణలాలీ నందుని కృష్ణలాలీ యశోదమ్మ
నోముల పంట కృష్ణలాలీ || కృ ||
పాలు పెరుగు వెన్నతిని గోల చేసేవు
రవ్వలేల నీతో కృష్ణ వేగలేనురా || కృ ||
గోపకాంతలంతవచ్చి చాడీ చెప్పేరు
నీకు కరువ ఇంట పెరుగు పాల కెపుడైన || కృ ||
మన్ను తిన్నావని అన్న నాతో చెప్పగా
నోట భువనములన్ని జూపి మాయచేసేవు || కృ ||
కన్ను మూయగ కన్నతండ్రి కలలోనైనను
అల్లరి పనులను మానివుండు చిన్ని కృష్ణయ్య || కృ || 

అలర చెంచలమైన...


alara cencalamaina...

ప : అలర చెంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల

చ : ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

చ : పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె నుయ్యాల

చ : మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె నుయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె నుయ్యాల

చ : పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు నుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగునో యని భీతి నొయ్య నొయ్యన వూచిరుయ్యాల

చ : కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందందు చూపె నీ వుయ్యాల

చ : కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె నుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల

1 comment:

  1. కృష్ణాష్టమి బొమ్మలు బలే బాగున్నాయి వైష్ణవీ

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers