Blogger Widgets

Friday, May 01, 2015

'మే డే' వెలుగులు

Friday, May 01, 2015

మే డే  అంటే మనందరికీ శలవు దినంగా తెలుసు.  కానీ అది ఎందుకు ఎలా ఏర్పడిందో తెలుసుకుందము. . విప్లవం వెల్లివిరిసిన ప్రతిచోటా నేడు శ్రమజీవుల విజయోత్సవదినంగా 'మే డే' వెలుగులు విరజిమ్ముతోంది. ఎర్రజెండా ధగధగలు మిన్నంటుతూ శ్రమజీవుల్లో ఆనందం పంచుతూ సాగుతోంది. ఆకలి మంటల ఆర్తనాదాలు, అన్యాయాన్ని ఎదిరించే గళాలు పల్లవించే రోజుగానూ మే డే విలసిల్లుతోంది.
మే దినోత్సవం లేదా మే డే  ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ఈరోజు  పబ్లిక్ శెలవు దినం.  చాలా దేశాలలో మే డే , అంతర్జాతీయ కార్మిక దినోత్సవం గా జరుపుకుంటారు. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తుచేస్తుంది.
ఈ రోజులను కార్మికులు  పండుగ రోజుగా జరుపుకుంటారు . మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు.
ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకుంటున్న దానిక వర్గానికి  ఆ సమయంలో తాముకూడా  మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం చేసి, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనంగా నిలబడ్డారు .  24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి , ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్‌ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. యంత్రాలు  రాకముందు మనిషి చాలా గంటలకొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకులా వుండేది . మనిషి వైజ్ఞానిక పరిజ్ఞాన్ని ఉపయోగించి యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పని గంటల పోరాటం వచ్చింది. కానీ మనలాంటి దేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్‌ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్‌ చేశారు. కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.
1923లో మొదటిసారి మన దేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్‌, లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు. మొత్తానికి ఎందరో మహనీయులు పోరాటం ఫలితంగా మే డే  ఏర్పడింది.  

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers