Blogger Widgets

శుక్రవారం, మార్చి 27, 2009

మీలో ఎవరైనా చెప్పండి!

శుక్రవారం, మార్చి 27, 2009

1) How can you get 10 horses in to 9 stables, bearing in mind that each horse must have its own stable?tension

2)In which sport do winners move backwards and losers move forwards?tension

)What word is the same backwards and upside down?tension
rindu

గురువారం, మార్చి 26, 2009

వచ్చింది వచ్చింది నవ యుగాది వచ్చింది!

గురువారం, మార్చి 26, 2009


యుగయుగాలు గడుపుతూ  యుగాది మళ్ళీ వచ్చింది
కొత్త రోజుకి కొత్తరోజు కొత్త కొత్తది తెచ్చింది. .
చేయీ చేయీ కలపండి స్నేహ హస్తమీయండి
మనసు లోన ఉన్న చెడునంతా మట్టి లోన కలపండి
మనసున భేదభావమును మానండి
బ్లాగుద్వారా తెలుగున వున్న అంద చందాలను లోకానికి చాటండి.
దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీ కృష్ణదేవరాయలు మాటలను రుజువు చేద్దాం
విధంగా సర్వధారి సంవత్సరానికి వీడ్కోలు తెలిపి
విరోధి నామ సంవత్సరానికి స్వాగతమిద్దాం !
నవ యుగాదికి నవ్వుతు స్వాగతించుదాం .
అందరికి విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు .
ఉగాది పండుగను సంతోషంగా జరుపుకుందాం. ros

మంగళవారం, మార్చి 24, 2009

అమ్మో కోతి !

మంగళవారం, మార్చి 24, 2009

రోజు నేను నిద్ర లేచి బ్రెష్ చేసుకుంటే నేను నిలబడి న చోట పైకి చుస్తే కోతి నన్ను చూస్తోంది . నేను ఎప్పుడూ ఇంటి దగ్గర కోతులు వస్తాయని నాకు తెలియదు చాలా బయమేసింది. ఇదే మొదటి సారి రావటం . నేను పరిగెత్తుకొని లోపలికి వచ్చేసాను . ఈ ఫోటో తీశాను . ఎంత స్టైల్ గా కుర్చుందో. మా జామ చెట్టు మొత్తం పావుడు చేసేసింది. కాయలు కోసేసి పారేసింది. అడవులులో వుండవలసింది . ఊరులోకి ఎందుకు వస్తున్నాయంటే? అడవులులో చెట్లు కొట్టేస్తే అవి వుండటానికి ప్లేస్ లేక ఇలా వచ్చేస్తున్నాయిట. ఇంకా చాలా అల్లరి చేస్తున్నాయి మా పక్కన ఒక షాప్ ఉంది అందులో vegetables పాడు చేసాయి . కొబ్బరి కాయలు విసిరేశాయి. మాయింటి చుట్టూ వున్నా పిల్లలు గుమ్మి గుడి దానిని రాలతో కొడితే అది అది బయపడకుండా. తిరిగి దాని చేతిలో వున్నా వాటి తో విసిరి భయపెడుతోంది. అమ్మో నాకు అయితే భయం వేసింది . అమ్మో కోతి ఎలావుందో .

ఆదివారం, మార్చి 22, 2009

"నిను వినా " రఘువరా !

ఆదివారం, మార్చి 22, 2009

రామ లక్ష్మణులు - సీత గురించి అడవులన్నీ వెదుకుతున్నారు . వారికి దారిలో విపరీతముగా దాహము వేసింది. ఒకచోట వారికి మంచినీటి కొలను కనిపించింది. రామలక్ష్మణులు వారి ధనస్సులను గట్టుమీద వుంచి, చేతులు లో వున్న బాణాలను నీటితో తడిపిన నేలమీద గుచ్చివుంచారు. నీటిలోనికి దిగి దాహము తీర్చుకొని తరువాత ధనస్సులను వారు భుజములకు తగిలించుకున్నారు. నేల మీద గుచ్చిన బాణాలను పైకి లాగారు. రాముని బాణానికి చివర రక్తపు మరకలున్నాయి. అది రాముడు చూసాడు. ఆ రక్తపు మరక ఎక్కడిదని పరిసీలించాడు. ఆ స్థలాన్ని పరిసీలించాడు రాముడు. అక్కడ బాణము గుచ్చిన ప్రదేశములో గాయపడి రక్తముతో తడిసిన ఒక కప్ప కనబడింది. రామచంద్రుడు ఆ కప్పతో " అయ్యో పాపం! నా బాణము గృచ్చుకుంది. అయితే అది నీ వీపుకు తగిలనప్పుడు ఎందుకు నన్ను ఆపలేదు, అని అడిగాడు రామచంద్రుడు . దానికి ఆ కప్ప. "రామా ! నాకేదైనా కష్టము వస్తే "రామా రక్షించు" అని మొర పెట్టుకుంటాను. కానీ ఆ రాముడే నన్ను భాధపెట్టినప్పుడు నేను ఇంకెవరితో చెప్పగలను? ఎవరిని రక్షించమని అడగను? ఆ భాధకూడా నా శ్రీ రాముని ప్రసాధముగానే భావించి ఊరుకున్నాను "అని అంది ఆ కప్ప.
చూసారా! కప్పయొక్క శరణాగత తత్వము. మనము కూడా అట్టి శరణాగత తత్వాన్ని అలవరచుకోవాలి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)