Blogger Widgets

సోమవారం, మార్చి 02, 2009

మా అమ్మమ్మా తాతయ్యల పెళ్ళి రోజు

సోమవారం, మార్చి 02, 2009



pokpokpokpok మా అమ్మమ్మ గారు అయిన శ్రీమతి చింతా .విజయ లక్ష్మి - మా తాతయ్య శ్రీ చింతా. రామ కృష్ణా రావు గారు , ఈ రోజు తేదీన ౩వ నేలన ౩౩ సంవత్సరపు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బముగా నా తరుపున మా బ్లాగ్ మిత్రుల తరుపున వీరికి ౩౩ పెళ్లి రోజు శుభాకాంక్షలు. rosrosros

14 కామెంట్‌లు:

  1. హార్దిక శుభాకాంక్షలు. ఇలాగే మరో 73 పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ...

    రిప్లయితొలగించండి
  2. మీ అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.

    వైష్ణవి నువ్వు రామకృష్ణారావు గారి మనవరాలివా!భేష్ తాతకు తగ్గ మనవరాలివన్నమాట.

    రిప్లయితొలగించండి
  3. పెద్దలు
    సుకవులు రామకృష్ణారావుగారికి వారి సతీమణి గారికి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ చింతా. రామ కృష్ణా రావు దంపతులకు ౩౩ వ పెళ్లి రోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. హాయ్ శ్రీ వైష్ణవి! మీ అమ్మమ్మగారికీ , మీ తాతగారికి ౩౩ వ పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. hello dear vaishu nana . How are you ? PLEASE CONVEY MY REGARDS TO YOR TATAYA AND AMUMA ON THEIR MARRIAGE DAY.
    Ramu.

    రిప్లయితొలగించండి
  7. వైష్ణవి!మీ అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి 33 వ పెళ్ళిరోజు శుభాకాంక్షలు.3,3,33...3+3+3+3=3.very nice!

    రిప్లయితొలగించండి
  8. మీ అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.

    రామకృష్ణగారు,
    మరి విజయగారికి పట్టుచీరో,పసిడి తునకో ఇచ్చారా లేక ఓ పద్యం ఇచ్చి సర్దుకో అన్నారా.

    రిప్లయితొలగించండి
  9. vaishu thalli gadu....

    mee ammagariki,tata gariki pelli roju subhakanshalu cheppu..

    రిప్లయితొలగించండి
  10. లహరి బ్లాగ్ ద్వారా శుభా కాంక్షలందించిన సాహితీ బంధువులు శ్రీ కొత్త పాళీ గారికి, శ్రీ జల్లిపల్లి కృష్ణా రావు గారికి, శ్రీ సిరిసిరి మువ్వకు, పూజ్యశ్రీ దుర్గేశ్వర రావు గారికి, శ్రీ జీడిపప్పు లాంటి కమ్మనైన హృదయులైన మిత్రులకు, చిరంజీవి రేవంత్ గారికి, చిరంజీవి రామ్ గారికి, నిరుపమనమైన శ్రీపరిమళం గారికి, సహోదరీ మణి జ్యోతి గారికీ
    నాతరపున, నా అర్థాంగి విజయలక్ష్మి తరపున కృతజ్ఞతలు తెలియఁ జేస్తున్నాను.
    ఇట్లు
    భవదీయ
    విజయలక్ష్మీ రమకృష్ణలు.
    తేదీ:-౦౩ -౦౩ -౨౦౦౯.

    రిప్లయితొలగించండి
  11. నా అర్థాంగి శ్రీమతి విజయను నాకు తోడుగా ఆ పరమాత్మ సంధాన పరచిన శుభదినం సందర్భంగా లహరి బ్లాగులో శ్రీ వైష్ణవితో పాటు ఆ బ్లాగు ద్వారా శుభాకాంక్షలందఁ జేసిన స హృదయు లందరికీ మా ఉభయుల హృదయ పూర్వక ధన్యవదములు తెలియఁ జేసుకొంటున్నాము.
    ప్రియ సాహితీ బంధువులారా! మీ హృదయంలో మాపై గల ప్రేమకు ఏ విధంగా మేము కృతజ్ఞత చెప్పుకున్నా అది తక్కువే ఔతుంది. ఐనా నా మనసులోని కృతజ్ఞతా భావన ఒక సీస మాలిక ద్వార మీకు తెలియఁ జేసుకొంటున్నాను. దయతో గ్రహించవలసినదిగా మనవి.

    సీ:-
    విజయ లక్ష్మియె నన్ను విధి నెంచి వరియించె.
    ముప్పది మూడేండ్లు ముందు గడిచె.

    కొత్త పాళియె మాకు కోరిక లీడేర
    అభినందనలు ప్రేమ నందఁ జేసె.

    జల్లిపల్లి ఘనుడు సహృదయంబున శుభా
    కాంక్షలందగఁ జేసె కరుణ తోడ.

    సిరిసిరిమువ్వయు చిఱుసవ్వడుల శుభా
    కాంక్షలందగఁ జేసె ఘనతఁ జూపి.

    దుర్గేశ్వరులు మాకు భర్గుని కైవడి
    శుభము లాకాంక్షించి శోభఁ గొలిపె.

    జీడిపప్పురుచిని చూడంగఁ జేసి తా
    శుభము లాకాంక్షించె నభవునివలె.

    రేవంతుమహనీయ శ్రీమంతమగునట్లు
    కాంక్షించి మాపైన కరుణఁ జూపె.

    రాము తనకు తాను ప్రేమతో శుభముల
    నాకాంక్షఁ జేసెను ప్రాకటమవ.

    పరిమళంబులు గొల్పె పరిమళమే మాకు
    గణనమందున మాదు ఘనత పెంచె.

    జ్యోతిసోదరి లసద్యోగంబు కోఱుచు
    పట్టు చీర, పసిడి పెట్టఁ జేసె.

    శోభగారును మమ్ము శోభిల్ల జేయగా
    నాకాంక్షలను తెల్పె ప్రాకటముగ.

    పెండ్లి రోజని మమ్ము కండ్లలో నిడుకొని
    అభినందనలు తెల్పి రసదృశముగ.

    గీ:-
    లహరి బ్లాగున వైష్ణవి సహృదయమున
    పెండ్లిరోజును వివరించి వెలయఁ జేయ
    శుభము కాంక్షించె నెందరో శోభ గొలిపె.
    ధన్య వాదంబు లార్య సన్మాన్యులార!
    జైహింద్.

    రిప్లయితొలగించండి
  12. అమ్మా వైష్ణవి, నువ్వు మాస్టారు మనవరాలివా? శభాష్ తల్లీ!

    మీ అమ్మమ్మకు, తాతయ్యకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)