ఈరోజు నాగుల చవితి కదా నేను పుట్టలో పాలు పోసారు. అమ్మమ్మ చలిమిడి, చిమిలి చేసింది .నేను పుట్టలో పాలు చలిమిడి, చిమిలి వేసి పూజ చేసాము.
అమ్మమ్మ మాచేత
నమస్తే దేవదేవేశ
నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర
ఆదిశేష నమో స్తుతే
అన్న శ్లోకం చెప్పించింది.
తరువాత మతాబులు , కాకరపువ్వొత్తులు , టపాసులు పేల్చాము.
పాముకు పాలు పోసేటప్పుడు అమ్మ నాచేత ఇలా చేప్పించింది.
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పించింది.
ఇది ఏమి టి అని అమ్మమ్మను అడిగితే ప్రకృతి ని పూజిచటం మన సంస్కృతి మనది.
మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము.
పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము.
చిట్టి తల్లీ నీకు మంచి అమ్మమ్మ దొరికారు. చక్కగా అమ్మమ్మ చెప్పినట్టుగా మంచి బాటలో నడిచి వృద్ధిలోకి రా కన్నా. నీకు మా అందరి ఆశీర్వాదాలూ ఉంటాయి.
రిప్లయితొలగించండిలహరి ,
రిప్లయితొలగించండిమీ అమ్మమ్మ బాగా చెప్పటమే కాదు నువ్వు విని ఆచరించటము గొప్ప .మంచి మనవరాలివి .
బంగారూ !నీ పుణ్యమా అని ఆ శ్లోకాన్ని మేం కూడా చెప్పుకున్నాం !
రిప్లయితొలగించండి