నమస్కారం
రేపు బోగిపండుగ కదా అందరికి పండగ శుభాకాంక్షలు. నాలాంటి వారందరు ఉదయాన్నేలేచి ముగ్గులు పెట్టి వాటికి రంగులు వేసి గొబ్బిళ్ళు పెడతారు కదా. చిన్ని కృష్ణుని కీర్తిస్తు పాటలు పాడతారు అందరు. వారికోసమే ఈ పాట.
ఈ పాటను అన్నమాచార్యులవారు రచించారు. ఎంతబాగుందో కదా.
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో
దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో
దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.