Blogger Widgets

సోమవారం, జులై 26, 2010

భారత జాతీయపతాకం

సోమవారం, జులై 26, 2010


జూలై 22 వ తేదిన మన జాతీయ జండాకు భారతరాజ్యాంగ సభలో ఆమోదం లభించింది.   మనదేశంలో త్రివర్ణపతాకము జాతీయజండాగా రూపొందింది.  మనత్రివర్ణపతాకములో కాషాయంరంగు, తెలుపు రంగు, ఆకుపచ్చరంగు సమానమైనంగా వుంటాయి. జెండా మద్యలో తెలుపురంగుకు మద్యలో 24 రెక్కలు కలిగిన నీలంరంగు ధర్మచక్రంవుంటుంది. జెండా పొడవు వెడల్పులు 2:3 గా వుంటుంది. మనజాతీయ జండా  రూపకర్త పింగళి వెంకయ్య గారుఖాదీ బట్టతో తయారు చేసారు.
మనజేండాలో మూడు రంగులుకు మూడు ప్రత్యేక అర్దాలున్నాయి.

మొదటిది కాషాయరంగు-త్యాగానికి గుర్తు.
రెండవదు తెలుపు రంగు-సత్యానికి గుర్తు.
మూడవది ఆకుపచ్చరంగు-పాడి పంటలకు గుర్తు.

అశోకచక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం,  ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి. పైగా చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవమున్న ప్రతిచోటా చైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారతదేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి. చక్రం శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం.  చక్రంలో 24 రేకలు వుంటాయి.వాటికి కూడా ఒక్కొక్కదానికి ఒక్కక్కొ భావం వుంది.
1. ప్రేమ
2. దయ
3. జాలి
4. కరుణ
5. సహనం
6. దైర్యం
7. శాంతి
8. మంచి
9. నమ్మకం
10. సున్నితస్వభావం
11.సంయమనం
12. త్యాగనిరతి
13.ఆత్మార్పణ 
14. నిజాయితీ
15. సచ్ఛీలత
16. న్యాయం
17. హుందాతనం
18. వినమ్రత
19. దివ్యజ్ఞానం
20. ఈశ్వర జ్ఞానం 
21.దైవనీతి
22. దైవభక్తి
23. దైవంపై ఆశ
24.విశ్వాసం
ఈ 24 రేకలు మనభారతదేశ ప్రగతి కారకాలు.  ఇన్ని ఉద్దేశాలతో ఏర్పడిన మనజాతీయ జెండాకు ఆమోదం కలిగినరోజు గుర్తు చేసుకుంటున్నందుకు నేను చాలాసంతోషిస్తున్నాను.

ఆదివారం, జులై 25, 2010

మిన్నక వేసాలుమాని

ఆదివారం, జులై 25, 2010



మిన్నక వేసాలుమాని మేలుకోవయ్యా

సన్నల నీయోగనిద్ర చాలు మేలుకోవయ్యా ll

ఆవులు పేయలకుగా నరచీ బిదుకవలె
 గోవిందుడ యింక మేలుకోవయ్యా 
ఆవలీవలపడుచు లాటలు మరిగివచ్చి
త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా ll


 వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడ 
 గూడియున్నారిదే మేలుకోవయ్యా 
తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము 
యీడకు దెచ్చి పెట్టె నిక మేలుకోవయ్యా  ll


పిలిచీ నందగోపుడు పేరుకొని యదె కన్ను
 గొలుకులు విచ్చి మేలుకోవయ్యా 
 గొలుకులు విచ్చి మేలుకోవయ్యా 
యిల మామాటలు వింటివిక మేలుకోవయ్యా  ll

గురుపూర్ణిమ



ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః||
గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను.

రోజు గురుపూర్ణిమ.   వ్యాసుని పుట్టిన దినమును మనము గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము.  ఈరోజు  గురువులను (Teachers) , పెద్దవారిని పూజించేరోజు.  గురుపూర్ణిమను వ్యాసుని పుట్టిన దినము రోజు జరుపుకుంటున్నాముకావున దీనిని వ్యాస పూర్ణమ అని కూడా అంటారు.  హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు.  శ్రీ మహావిష్ణువుని అవతారంగా వ్యసుని గురించి చెప్తారు.  ఈయన పేరు  కృష్ణద్వైపాయనుడు  వేదాలను   నాలుగు బాగాలుగా చేసాడుకావునా ఈయనికి వేదవ్యాసుడని పేరు వచ్చింది.
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధ్యే వాసిష్ఠాయ నమోనమ:||
నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే
పుల్లార విన్దాయత పత్రనేత్ర|
యేన త్వయా భారత తైలపూర్ణ:
ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీప:||
విశాల బుద్ధిగల వ్యాస మహర్షీ! వికసించిన పద్మ దళముల వంటి నేత్రములుగల వాడా! మహాభారతమనే తైలముచే నింపబడిన జ్ఞానదీపము నీచే వెలిగించబడింది. అట్టి నీకు నా నమస్కారములు.
మనకు  మంచి చెప్పే ప్రతీవారు గురువులే.  ఈరోజు పెద్దవారి ఆశిర్వాధములు మనము తీసుకోవాలి.   ఈరోజు షిరిడి సాయిబాబాగారికి, దత్త్తాత్రయుని వారికి ప్రత్యేక దినముగా పూజిస్తారు.

ఆదివారం, జులై 18, 2010

Learning 1-12 tables with music

ఆదివారం, జులై 18, 2010

THE GREEDY FISHERMAN

ఆదివారం, జులై 11, 2010

Pencil Parable

ఆదివారం, జులై 11, 2010

Pencil Parable   

    The beginning, the Pencil Maker spoke to the pencil saying,

"There are five things you need to know before I send you out into the world. Always remember them and you will become the best pencil you can be."

You will be able to do many great things, but only
if you allow yourself to be held in someone's hand.

You will experience a painful sharpening from time to time, but this is required if you are to become a better pencil.


You have the ability to correct any mistakes you might make.

The most important part of you will always be what's inside

 No matter what the condition, you must continue to write. You must always leave a clear, legible mark no matter how difficult the situation.

The pencil understood, promising to remember, and went into the box fully understanding its maker's purpose.

Now replacing the place of the pencil with you; always remember them and never forget, and you will become the best person you can be.
You will be able to do many great things, but only if you allow yourself to be held in God's hand. And allow other human beings to access you for the many gifts you possess.

You will experience a painful sharpening from time to time, by going through various problems, but you'll need it to become a stronger person.
 You will be able to correct mistakes you might make or grow through them.

The most important part of you will always be what's on the inside.

 On every surface you walk, you must leave your mark. No matter what the situation, you must continue to serve God in everything.

Everyone is like a pencil...
created by the Maker for a unique and special purpose.
 By understanding and remembering, let us proceed with our life on this earth having a meaningful purpose in our heart and a relationship with God daily.

సిరుత నవ్వుల వాడు


సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా


పొలసు మేనివాడు బోరవీపు వాడు సెలసు మోరవాడు సిన్నెక్కా
కొలుసుల వంకల కోరలతోబూమి వెలసినాడు సూడవే సిన్నెక్కా

మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి సీటకాలవాడు సిన్నెక్కా
ఆటదానిబాసి ఆడవిలో రాకాశి వేటలాడీ జూడవే సిన్నెక్కా

బింకపు మోతల పిల్లగోవి వాడు సింక సూపులవాడు సిన్నెక్కా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను వేంకటేశుడు సూడవే సిన్నెక్కా


శనివారం, జులై 10, 2010

Match game

శనివారం, జులై 10, 2010

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)