ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః||
గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను.
ఈరోజు గురుపూర్ణిమ. వ్యాసుని పుట్టిన దినమును మనము గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము. ఈరోజు గురువులను (Teachers) , పెద్దవారిని పూజించేరోజు. గురుపూర్ణిమను వ్యాసుని పుట్టిన దినము రోజు జరుపుకుంటున్నాముకావున దీనిని వ్యాస పూర్ణమ అని కూడా అంటారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువుని అవతారంగా వ్యసుని గురించి చెప్తారు. ఈయన పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలను నాలుగు బాగాలుగా చేసాడుకావునా ఈయనికి వేదవ్యాసుడని పేరు వచ్చింది.
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధ్యే వాసిష్ఠాయ నమోనమ:||
నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే
పుల్లార విన్దాయత పత్రనేత్ర|
యేన త్వయా భారత తైలపూర్ణ:
ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీప:||
విశాల బుద్ధిగల వ్యాస మహర్షీ! వికసించిన పద్మ దళముల వంటి నేత్రములుగల వాడా! మహాభారతమనే తైలముచే నింపబడిన జ్ఞానదీపము నీచే వెలిగించబడింది. అట్టి నీకు నా నమస్కారములు.
మనకు మంచి చెప్పే ప్రతీవారు గురువులే. ఈరోజు పెద్దవారి ఆశిర్వాధములు మనము తీసుకోవాలి. ఈరోజు షిరిడి సాయిబాబాగారికి, దత్త్తాత్రయుని వారికి ప్రత్యేక దినముగా పూజిస్తారు.
చిట్టి తల్లి! ఎంత చక్కగా వ్రాశావు! అభినందనలు.
రిప్లయితొలగించండిఓ చిన్న ముద్రారాక్షసం. కృష్ణద్వైపాయనుడు అని ఉండాలి.
అంకుల్ తప్పును సరిచేసానండి. మీకు నా ధన్యవాధములు.
రిప్లయితొలగించండి