గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు. ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .
అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన పాసురము:
అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్
அம் கண் மா ஞாலத்து பாடல் வரிகள்:
அம் கண் மா ஞாலத்து அரசர் அபிமான
பங்கமாய் வந்து நின் பள்ளி(க்) கட்டிற் கீழே
சங்கம் இருப்பார் போல் வந்து தலைப்பெய்தோம்
கிங்கிணி வாய்(ச்) செய்த தாமரை(ப்) பூ(ப்) போலே
செங்கண் சிறு(ச்) சிறிதே எம்மேல் விழியாவோ
திங்களும் ஆதித்தனும் எழுந்தாற் போல்
அம் கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல்
எங்கள் மேல் சாபம் இழிந்தேலோர் எம்பாவாய்
Lyrics of Anganma Gnalathu :
am kaN maa NYaalaththu arasar abimaana
pangamaay vandhu nin paLLi(k) kattiR keezhE
sangam iruppaar pOl vandhu thalaippeydhOm
kingiNi vaay(ch) cheydha thaamarai(p) poo(p) pOlE
sengaN chiRu(ch) chiRidhE emmEl vizhiyaavO
thingaLum aadhiththanum ezhundhaaR pOl
am kaN irandum kondu engaL mEl nOkkudhiyEl
engaL mEl saabam izhindhElOr empaavaai
తాత్పర్యము:
సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.
మీరు ప్రతిరోజూ అందిస్తున్న తిరుప్పావై పాశురాలు, వాటి తెలుగు తాత్పర్యాలు చాలా బాగున్నాయి. Transliteration గురించి ఒక చిన్న సలహా. తమిళంలో ற (ఱ) ద్విత్వాక్షరంగా వచ్చినప్పుడు (ற்ற), దానిని "ట్ర" లాగ పలుకుతారు. తెలుగులో వచ్చిన చాల తిరుప్పావై పుస్తకాలలో దీనిని తప్పుగా "త్త" గా ప్రచురించారు. దీనిని తెలుగులో "ట్ర" అని రాస్తేనే కరెక్టు. గమనించగలరు. అలాగే మరే భాషలోనూ లేని ழ""" అక్షరాన్ని (ఇంగ్లీషులో zha అని రాస్తారు) తెలుగులో యదాతధంగా అలాగే రాస్తే బాగుంటుంది - ఉదా.కి తమిழము, కోழி.
రిప్లయితొలగించండి