Blogger Widgets

శుక్రవారం, ఏప్రిల్ 05, 2013

హింసతో సాధించలేనిది ఆహింసతో సాధించవచ్చు.

శుక్రవారం, ఏప్రిల్ 05, 2013


మహాత్మా గాంధీగారు  బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఉప్పు పన్నువిధించినందుకు సవాలు చేస్తూ61సంవత్సరాల వయస్సులో  మహాత్మా గాంధీగారుతో పాటు 78 అనుచరులు తో కలసి 23 రోజుల్లో 240 మైళ్ళ దూరం దండి మార్చ్ చేసారు.  ఈ దండి యాత్ర ముఖ్య ఉద్దేశము మనము ఎంతైనా తెలుసుకోవాలి. ఈ ఉప్పు సత్యాగ్రహము మొదట గాంధి గారిచే ప్రారంభించబడిన అహింసా ప్రచార ఉద్యమంగా మన చెప్పుకోవచ్చు.  ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా జరిగింది.  ఉప్పుపై పన్ను కట్టుటకు నిరసనగా మార్చ్ 12 ,1930  న  మొదలు పెట్టారు ఈ దండి యాత్ర .  ఈ దండి యాత్రనే ఉప్పు సత్యాగ్రహముగా చెప్తారు. ఈ ఉద్యమము వెనకాల ప్రధానమైన  ఉద్దేశము వుంది బ్రిటిష్ వారిని మనదేశము నుండి తరిమి కొట్టి మనదేశానికి సంపూర్ణ స్వాతంత్రము సాధించుట  అనేది ముఖ్యమైన ఉద్దేశము.  ఈ  దండి యాత్ర సబర్మతి ఆశ్రమము నుండి ప్రారంభించి దండి వరకు కొనసాగించారు.  ఈ యాత్రలో కొన్ని వేలమంది భారతీయులు పాల్గొన్నారు.  ఈ దండి యాత్ర  పూర్తిగా విజయవంతము అయినట్టుగా చెప్పచ్చు.  ఈ దండి యాత్ర  5 వ ఏప్రిల్ 1930 న దండి ప్రదేశానికి  చేరుకుంది.  241 మైళ్ళ దండి సత్యాగ్రహాన్ని పూర్తిచేసారు.లక్షలకొద్దీ భారతీయులు స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.కోట్ల భారతీయులపై బ్రిటిష్ వారు  వేసేన  ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా మౌనముగానే  (సత్యాగ్రముతో) ప్రారంభించి చిట్టచివరికి ఆ మౌనముతోనే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రము సాధించారు . ఇది చాలా గర్వించదగ్గ సంగతిగా చెప్పచ్చు.  హింసతో సాధించలేనిది ఆహింసతో సాధించవచ్చు అని గాంధిగారు నిరూపించారు.

3 కామెంట్‌లు:

  1. మీ వాదన తప్పు అని నా అభిప్రాయము. అహింస అనేది మోసపూరిత సిదాంతం,అది ఆచరణా సాధ్యమైతే మన ప్రభుత్వాలు ఎప్పుడో ఆచరించేవి
    వుదాహరణకు దేవుళ్ళేచూడండి హింస లేకుండా ఒక్కడన్నా కనపడతాడ.ఏదో ఒక ఆయుధంతో కనపడుతారు,శతృవును తుదముట్టిస్తారు .లేకుంటే దండిస్త్తారు

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పింది నిజం కాని మహాత్మగాందీ లా అహింస సిద్దాంతాన్ని పాటించిన వారు బహుషా ఈ ప్రపంచంలో ఎవరు ఉండక పోవచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హింసతో సాధించలేనిది ఆహింసతో సాధించవచ్చు అని గాంధిగారు నిరూపించారు. అందుకే గాంధిగారు మహాత్ముడు అయ్యారు. మనకు ఆధర్శవంతుడు అయ్యాడు.

      తొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)