పల్లవి:
పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి యారగించే పొద్దాయ నిపుడు
చరణం:
వెన్నలారగించ బోయి వీధులలో దిరిగీనో
యెన్నరాని యమునలో యీదులాడేనో
సన్నల సాందీపనితో చదువగ బోయినాడో
చిన్నవాడాకలి గొనె చెలులాల యిపుడు
చరణం:
మగువల కాగిళ్ళ మరచి నిద్దిరించీనో
సొగిసి యావుల గాచే చోట నున్నాడో
యెగువ నుట్లకెక్కి యింతులకు జిక్కినాడో
సగము వేడికూరలు చల్లనాయ నిపుడు
చరణం:
చెంది నెమలి చుంగుల సింగారించుకొనీనో
ఇందునే దేవరవలె ఇంటనున్నాడో
అందపు శ్రీవేంకటేశు డాడివచ్చె నిదె వీడె
విందుల మాపొత్తుకు రా వేళాయ నిపుడు
sung by smt Anasuya Murthy , Tuned by sri TP Chakrapani in brindavani raga
రిప్లయితొలగించండి