ఆదివారం, జూన్ 30, 2013
ఏ దేశమేగినా ఎందుకాలిడినాఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినపొగడరా నీ తల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవము
ఈ కవితను వినగానే అందరికి గుర్తువచ్చే మహానుభావుడు రచయిత శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు . ఈయన నవ కవితా పితామహుడు అని అంటారు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. ఈరోజు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి వర్ధంతి . అందువల్ల ఈ బ్లాగ్ ద్వారా వారికి నివాళి అర్పిద్దాం. శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన ఒక మంచి గేయము మా తెలుగు పుస్తకంలో వుంది అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ గేయం సారాంశం ఏమిటి అంటే. పాచీన కాలం నుండి భారతదేశం అనేక సంస్కృతీ సామ్ప్రదాయంలకు నిలయం. సిరిసంపదలకు, పాడిపంటలకు ప్రసిద్ది పొందింది. ఎందరో మహానీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వంని సాధించిన సమైక్య దేశం మన భారతదేశం. మన దేశగౌరవంను దశదిశలా చాటడం మన కర్తవ్యం . మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన భాద్యత. ఈ భావాలను ప్రజలలో ఎలా ప్రేరేపించిందో ఈ గేయం చదివి తెలుసుకుందాం.
శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై
వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !
వేద శాఖలు వెలసెనిచ్చట ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||
విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా ||
సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా ||
మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా||
దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా ||
పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా||
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.