శుక్రవారం, జనవరి 23, 2015
|
చేతిరాత |
చదువుకు ఎంత ప్రాముఖ్యత వుందో చేతి రాతకు కూడా అంతే ప్రాముఖ్యత వుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ఈమధ్య నాకు స్కూల్ లో చేతి రాత పరీక్షా జరిగింది. అంతే కాదు ఈరోజు చేతి రాత దినోత్సవం కదా అందుకే. మనం విధి రాతను మార్చలేం కాని మన చేతిరాతను ప్రాక్టిస్ తో అందంగా ముత్యాలు పరచినట్టు అందంగా రాయచ్చు. మంచి రైటింగ్ విద్యార్థులకు ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే నేటి సమాజంలో విద్యార్థులు చక్కటి చేతిరాత లేకపోవడం వల్ల పోటీ పరీక్షల్లో మంచి మార్కులను కోల్పోతున్నారు. అందువల్ల చేతిరాత చక్కగా ఉండాలంటే కొన్ని నియమాలను తప్పక పాటించవల్సి ఉంటుంది. అందులో కొన్ని మంచి మార్కులును తెచ్చి పెడుతుంది కూడా. అదే విధంగా చదివి అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఒక్కసారి రాయడం, వంద సార్లు చదివిన దానితో సమానం అని టీచర్లు కూడా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. చేతిరాత బాగా రాయలేకపోతే వచ్చే నష్టాలూ తక్కువే కాదు. మన చేతిరాత అర్థం కాకపోతే చదివేవాళ్లకు విసుగు వస్తుంది. పరీక్ష పేపర్లు దిద్దేవాళ్లకు అర్థం కాకపోతే మార్కులు తక్కువ వేస్తారు. ఇక్కడ చెప్పకునేది ఏమిటంటే ఏది రాసినా ఎదుటివారికి అర్థమయ్యేలా రాయడం ముఖ్యం. అందుకని చిన్నప్పటినుండే పిల్లలకు రాయడం ప్రాక్టీసు చేయించాలి. ఏ పరీక్షలో విజయం సాధించాలన్నా ఎక్కువగా రాతతోటే పని. వాటిల్లో బాగా రాయగలిగితేనే మంచి మార్కులు సాధించగలుగుతారు. అందుకని చిన్నపిల్లలకు పలకా, బలం ఇచ్చి అక్షరాలను గుండ్రంగా రాయించడం నేర్పించడం అవసరం. కొంతమంది పిల్లలు చదివింది చెప్పగలరు కానీ రాయబోయేసరికి అది సరిగా రాయలేరు. కొంతమంది రాయగలరు కానీ చెప్పలేరు. ఇలా రకరకాలుగా వుంటారు. చదువుకునేవారు చదివింది రాయడం తప్పనిసరి. చదువుకునేవారు ఎంత ఎక్కువగా రాస్తే అంత బాగా చదివింది వస్తుంది. పరీక్షల సమయంలో అవి వెంటనే ఈజీగా రాయగలరు. చిన్న వయసునుండి మొదలుకొని పెద్దవారయ్యేవరకు వయసుతో సంబంధం లేకుండా ఏ హోదాలో వున్నవారైనా ఏవో పోటీ పరీక్షలు రాస్తూనే ఉండవచ్చు. అందుకు తోడ్పడేది ఈ రాయడం అనేది. ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా ఒక్కటని కాదు ఎన్నో రంగాలకు మరెన్నింటికో రాయవలసిన అవసరం ఉంటుంది. అందుకని చేతిరాత సరిగా రాని వారు రోజూ కొంచెంసేపు రాస్తూ వుంటే చేతి రాత మెరుగవుతుంది. నేషనల్ చేతివ్రాత డే కూడా జాన్ హాన్కాక్ యొక్క పుట్టినరోజు. చేతిరాత ప్రాముఖ్యత చాలా ఉంది.
నేషనల్ చేతివ్రాత డే రాయడం ఇన్స్ట్రుమెంట్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (WIMA) వెబ్సైట్ ద్వారా కనుగొన్నారు, ప్రతి సంవత్సరం జనవరి 23 న జరుపుకుంటారు. చాలా మంది ఈ రోజుల్లో ఒక కంప్యూటర్లు వాడటం మరియు టైపింగ్ ద్వారా చేతి రాత రాయకుండా పని చేస్తున్నారు. నేను కూడా ఈ వ్యాసం టైపింగ్ ద్వారానే చేస్తున్నా ) .
చేతిరాత అనేది ఒక కళ. ఎ ఒక్క మనిషి చేతిరాత కాని చేతివ్రాత వేలిముద్రలు కాని ఒకేరకంగా వుండవు. చేతివ్రాత విశ్లేషించు టను గ్రాఫాలజి అంటారు. చేతితో రాయడానికి వివిధ ఫాంట్లు వున్నాయి.మీ లక్ష్యాలను, కలలు, మరియు ఆశలు రాసుకుంటే రోజు చూసుకుని మన లక్ష్యాలు, కలలు, మరియు ఆశలు చేతిరాతద్వారా మరింత వ్యక్తిగత స్వభావం వాటిని సాధించడానికి 33% ఎక్కువగా ప్రేరణగా వుంటుంది అని విశ్లేషకులు చెప్తారు.
పూర్వ కాలం నుండి చేతిరాతను రాయటానికి అనేకమైన విధానాలు వాడేవారు. తాటిఆకులమీద ఘంటం తో రాసేవారు. నెమలి ఈక ను సిరాలో ముంచి రాసేవారు. అప్పట్లో కాగితం కలం లేక వారు అలా రాసేవారు. ఇప్పుడు అయితే కాగితములు , పెన్సిల్స్, పెన్స్ చాలా రకాలు వున్నాయి. అవి ఉపయోగించుకొని చేతిరాతను రాయండి. చేతిరాత దినోత్సవ శుభాకాంక్షలు
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.