తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజలవాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలోవ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త,హేతువాది. శిష్టజనవ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్లఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైనసాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గాజరుపుకుంటున్నాము. గిడుగు రామమూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని తెలుగు భాషా దినోత్సవముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముమరియు ప్రజలు పాటిస్తున్నారు.
విశ్వనాథ సత్యనారాయణ గారు రామమూర్తి పంతులు గారిగురించి ఇలా అన్నారు. "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోముల పంట". అని ఇంకా "రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు".
ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషాచైతన్య సమితి లాంటి స్వచ్ఛంధ సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి ఎంతగానో కృషిచేస్తున్నారు. ప్రపంచంలో తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగివుంది. ప్రపంచీకరణ వలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములోచదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగుమాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ఇది ఎంతో గొప్ప మార్పుగాచెప్పుకోవచ్చు. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు .
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.