ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపుతానని చెప్పినది ఆ గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకూ నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .
తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతర విషయాలనే మరచిఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .
పాశురము:
ఉంగళ్ పుళ్ళైక్కడై తోట్టత్తు వావియుళ్
శెంగళ్లునీర్ వాయ్ నెగిళ్ న్దు ఆమ్బల్ వాయ్ కుమ్బినగాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్
శెంగళ్లునీర్ వాయ్ నెగిళ్ న్దు ఆమ్బల్ వాయ్ కుమ్బినగాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
స్నానము చేయుటకు గోపికల నేల్లరను మేల్కొల్పుతాను అని చెప్పి నిద్రపోవుచున్న ఒక గోపికను ఈ పాసురములో లేపుచున్నారు. ఈ బాలికకు ఊరివారినందరాను ఒకతాటిపై నడుపగల శక్తి కలది. ఓ పరిపూర్ణురాలా! నీ పెరటిలో నున్న గుండుబావిలో ఎరుపుతామర పూలు వికసించినవి. తెల్లకాలువలు ముడుచుకుంటున్నాయి. అంటే తెల్లవారుచున్నాడని భావము. లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు దరించి తెల్లని పలువరుసలు గలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమతమ నివాసములలో ఆరాధనము చేయుటకు వేల్లుచున్నారు లెమ్ము. నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా? ఓ లజ్జలేనిదానా! లెమ్ము. ఓ మాట నేర్పు గలదానా! శంఖమును చక్రమును ధరించినట్టి ఆజాను బాహుడగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము. అని ఈనాటి గోపికను మేల్కొల్పినారు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.