Blogger Widgets

శనివారం, ఫిబ్రవరి 10, 2018

రామచరిత మానస, 18, సరస్వతీదేవి రాక.

శనివారం, ఫిబ్రవరి 10, 2018

చౌ - మని మానిక ముకుతా ఛబి జైసీ | అహి గిరి గజ సిర సోహ న తైసీ ||
         నృప కిరీట తరునీ తను పాఈ  | లహహిC సకల సోభా అధికాఈ || 1 ||
         తైసెహిC సుకబి కబిత బుధ కహహీC | ఉపజహిC అనత అనత ఛబి లహహీC ||
         భగతి హేతు బిధి భవన బిహాఈ | సుమిరత సారత ఆవతి ధాఈ || 2 || 
         రామ చరిత సర బిను అన్హవాఏC | సో శ్రమ జాఇ  న కోటి ఉపాఏC || 
         కబి కోబిత  అస హృదయC బిచారీ | గావహిC హరి జస కలిమల హారీ || 3 ||
         కీన్హేC ప్రాకృత జన గున గానా | సిర ధుని గిరా లగత పఛితానా ||
         హృదయ సింధు మతి సీప సమానా | స్వాతి సారద కహహిC సుజానా || 4 ||
         జౌC బరసఇ బర బారి బిచారూ | హోహిC కబిత ముకుతామని చారూ || 5 ||
పాములపడగలపైగలమణులును పర్వతములపైగల మాణిక్యములును , గజములమస్తకముల యందుండు ముత్యములను అంతగాశోభింపవు .  అవియే రాజులకిరీటములయందును, తరుణీమణులతనువులపైనను చేరి , వింతకాంతులను వెదజల్లును .  " కవిః కరోతి కావ్యాని , రసం జానాతి పండితః " అని ప్రాజ్ఞులు పల్కుచుందురు .  కావ్య నిర్మాణమునకు పూనుకొనిన కవి స్మరించినంతమాత్రముననే శ్రీరామభక్తి పారవశ్యమున సరస్వతీదేవి బ్రహ్మలోకమునుండి భూమికి పరుగులుదీయుచు వచ్చును.  ఆమెచే కవి శ్రీరామచరితమనెడి సరోవరమునందు స్నానము చేయించినప్పుడే ఆమె యొక్క దూరప్రయాణపుబడలిక తొలగిపోవును.  ఇది తప్ప వేఱుగా కోటి ఉపాయములు చేసినను ఆ బడలిక తీరదు .  ఈ విషయమును గ్రహించియే కవులును, పండితులను, కలిపాపములనురూపుమాపు రామచరిత యశోగానమును చేయుదురు.  కవులు సామాన్యమానవుల చరిత్రమును పొగడినచో సరస్వతీదేవి తనరాకకు పశ్చాత్తాపబడును .  పండితులు కవిహృదయమును సముద్రముతోడను అతని బుద్దిని ముత్యపు తోడను సరస్వతీదేవిని స్వాతివానతోడను పోల్చెదరు. ఇందులో సుందరభావములనెడి వర్షపుచినుకులు పడినచో అందమైన కవితాముక్తాముణులరూపములలో అది భాసించును .        

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)