Blogger Widgets

సోమవారం, డిసెంబర్ 16, 2013

వైయత్తు వాళ్ వీర్గాళ్!

సోమవారం, డిసెంబర్ 16, 2013

మరి మొదటి పాటలో తామేమి పొందదలచి ఈ వ్రతం చేయడలచుకున్నారో , ఈ వ్రతమునకు సాయపడు వారు ఎవరో, ఆ వ్రతమును జేయుటకు తమకుగా అధికారమేమో వివరించినారు. ఈ దిన ఒక కార్యము చేయ దలచుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవలసినవి ఆ మూడే. ఏ ఫలము కాంక్షించి ఈ కార్యము చేయుచున్నామో తెలిసి ఫలము తప్పక పొమ్దదగినదె అని తెలిసిన కాని కార్యమునందేవరికిని ప్రవృత్తి కలగదు. ఆ ఫలము మంచిదే అని తిలిసినా తము చేయగలమా ,చేయలేమా , మద్యలో శక్తి లేక మాని నవ్వులపాలగుదురు. దానికి కావలసిన పరికరాలు సమకుర్చుకో గలమో లేమో నిర్నయిమ్చుకోవాలి . ఆ కార్యము చేయుటకు తనకు గల అధికారాన్ని తెలుసుకోవాలి .
ఇవన్నీ సమకుర్చగలది కేవలము కృష్ణుడే అని తెలిసిన నీకు అన్ని సమకురినట్లే.
దీనికి శ్రీ కృష్ణుడే ఉపాయం , శ్రీ కృష్ణుని పోడుతయే ఫలమని విశ్వసించి వానిని కైమ్కరమునదే రుచిగాగల నియామాలుందున ? అసలు నియమాలు పాటించాలా? వారు గొల్లపిల్లలు కదా ? వారికి నియమాలు ఎలాతెలియును?
వీటన్నిటికీ ఒకటే ఉపాయమున్నది. భగవంతునిపై భక్తి , పరిసుద్దమైన మనసు కలిగిన చాలు .
కాని భక్తులు భాగాత్స మ్రుద్దికి భగవద్భాక్తులు ఆనందముగా కొన్ని నియమాలు పాటిమ్చుదురు .
వానిని ఈ పాశురములో వివరించుదురు.

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు

శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్ 



తాత్పర్యము : 

శ్రీ కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభావిమ్చుచున్న వారలారా ! మేము మావ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు:-
పాలసముద్రములో ద్వానికాకుండా మెల్లగా పడుకోనివున్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము . ఈ వ్రతసమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము . తెల్లవారు జామున స్నానము లు చేసెదము . కంటికి కాటుక పెట్టుకోము . కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము . ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము. అసత్యాలాడము. ఎచ్చటా పలుకము.ఙానులకు అధిక ధన ధాన్యాధులు తో సత్కరించుదుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము. మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము. దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము.

విశెషార్ధము:- తమతో వ్రతమునకు రాబోవుచున్న గోపికలను ఉద్దెసించి తామీ వ్రతములొ చెయవలసినవి , చెయకుడనివి ఇందు వివరించుకున్నరు.

ఆదివారం, డిసెంబర్ 15, 2013

మార్గళి త్తింగళ్

ఆదివారం, డిసెంబర్ 15, 2013

ఈ రోజు నుండి ధనుర్మాసం ప్ర్రారంభమము అయ్యింది కదండి. మరి మొదటి పాశురం గురించి తెలుసుకుందాం.
గోపికలు ను గోదాదేవి ఈ వ్రతం చేయుటకు చేయుటకుముందుగా వారు మార్గశిరమాసం గురించి వ్రతం చేయుటకు అనుకూలంగా వుందని కాలాన్ని వారు పొగిడారు.  తరువాత ఈ వ్రతం ఎవరు చేసారో దాని వల్ల కలుగు ఫలితం గురించి తెలుసుకున్నారు.  ఆవిషయాన్ని మొదటి పాశురంలో చెప్పదలచారు.  మొదటి పాశురం

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
 .
మరి ఈ పాశురం తాత్పర్యము ఏమిటంటే  ఒహ్హో మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహము నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునట్లు మీరు అందరూ కూడా చేరి ఈ వ్రతము చేయండి అని భావము

శనివారం, డిసెంబర్ 14, 2013

ధనుర్మాసం వ్రతం వచ్చేసింది

శనివారం, డిసెంబర్ 14, 2013

రేపటి నుండి ధనుర్మాసం కదండి. సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం - "ధనుర్మాసం". వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు.ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దద్యోదనమును సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచవలెను. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు. సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది.
ధనుర్మాస వ్రతంప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరశి మొదలు పన్నెండురాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి.

 ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం్ చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి.  తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ,సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ 'చెక్కర పొంగలి' ని గానీ, భియ్యం, పెసరపప్పు కలిపి వండిన 'పులగం'ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ 'దద్యోదనం' నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూపదీప, దక్షిణతాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించడం చేయాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని

"మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రదతవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||"

అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానన్ని స్వీకరిస్తూ -"ఇందిరా ప్రతి గృహ్ణాతు" అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. 
ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాలపాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితాభిప్రయం.కాత్యాయనీవ్రతంఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహంకాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీగోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.వ్రత విధానంధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంటి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు , అష్టోత్తరాలతో పూజించి నైవేద్యంసమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి.

శుక్రవారం, డిసెంబర్ 13, 2013

హిందూ పవిత్ర గ్రంధం భగవ​ద్గీత పుట్టినరోజు.

శుక్రవారం, డిసెంబర్ 13, 2013


హిందూ పవిత్ర గ్రంధం భగవ​ద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా మార్గశిర ​శుద్ధ ఏకాదశి  రోజు జరుపుకొంటారు.  ప్రపంచం ఇప్పుడు ఆధునిక సైన్స్ భాగా అబివృద్ది చెందినది.  ఇలాంటి కాలంలో కుడా భగవద్గీతకు ఎనలేని విలువ నిలిచివున్నది.  అలాంటి భగవద్ గీత భాగావనుని నుండి మనకు అందచేసిన వారందరికీ మనం ఎంతో ఋణపడి వున్నాం కదా.  దీనిగురించి మనం తెలుసుకుందాం మరి. 
 ఈ రోజు కౌరవ రాజు దృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు.   భగవత్ గీత భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామ భూమి లో ఉపదేశిస్తాడు.అన్ని సంధి ప్రయత్నాలూ విఫలమైన తర్వాత, యుద్ధం ప్రకటిస్తారు పాండవులు. సంగ్రామ భూమిమీద అడుగు పెట్టిన తర్వాత ఆ మహా సైన్యం చూసి, వారిలో తన తాత అయిన భీష్ముడు వంటి వారిని చూసి నేను యుద్ధం చేయలేను అని అస్త్త్రాలు విడిచి పెట్టాడు.  అప్పుడు శ్రీ కృష్ణులు వారు గీతోపదేశం చేసారు. దాని సారం శాంతి. కృష్ణుడు అర్జునుడుతో ఇలా ఇన్నారు.
మిత్రమా !ఎందుకు భాధపడుతున్నావు !అయ్యిందేదో అయ్యింది . పొయిందేదో పోయింది .
ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తెలేదుకదా. వట్టి చేతులతో వచ్చావు ! పోయేటప్పుడు లగేజిలతో పొవాలనుకుంటున్నావు! అందుకే నీకంత యాతన. నువ్వేమి తెచ్చావని -నువ్వు పోగొట్టుకున్తున్నావు. నీవేమి సృస్తిమ్చావని నీకు నష్టం వచ్చింది? నువ్వు ఏదైతే పోదావో అది ఇక్కడనుండే పోదావు. ఏదైతే ఇచ్చావో అదీ ఇక్కడనుండే ఇచ్చావు.ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం , రేపు ఇంకొకరి సొంతం కాగలదు.
కావున జరిగేది జరుగక మానదు . అనవసరంగా ఆందోళన చెందకు . ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపంలేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా భగవంతుని ప్రసాదంగా స్వీకరించు అన్నారు.
సుమారు 6,000 సంవత్సరాల పుర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గం లో నడిపిస్తుంది.  అనటంలో ఎటువంటి సందేహం లేదు.
మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే అదే అదృష్టంగా బావిస్తాము.  అన్నిటిలోనూ మనం అనుకున్నది జరగక పొతే అప్పుడు మనం అనుకుంటాం మనకు ఆ గీత రాసి లేదు అనుకుంటాము.  మన గీత లోనే వుంది భగవద్గీత.  అడితెలిసినవాడు ఎటువంటి భాధకు లోనుకాడు. గీతను శ్రీ క్రిష్ణులవారు ద్వాపరయుగం చివర లో అనగా కలియుగానికి ప్రారంబం లో జరిగింది.  జగత్గురు శ్రీ కృష్ణులు కార్తీక బహుళ అమావాస్యనాడు చెప్పారు.  ఉపనిషిత్తులు ను అవులుగాను,  అర్జునుని దూడగా చేసి శ్రీ కృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత.  గీతను అర్జునునికి శ్రీ కృష్ణుడు చెప్పిన గీత జ్ఞానం అంతా 18 అద్యాయాలుగా పరమపదసోపాన మార్గంగా విరాజిల్లుతోంది.  ఎవరు సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సుఖంగా, సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు. మోక్షస్థానాన్ని ల క్ష్యంగా చేసుకున్న వారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతాడు.  

వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగాడు. అందువల్ల భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు గీతను లోకానికి అందించాడు. గీత అనే పదంలో గీ అంటే త్యాగం, త అంటే తత్వజ్ఞానం. అంటే త్యాగాన్ని, తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి.

గీతను మొదట  ఎవరు విన్నారంటే... శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథంపై ఎగిరే ధ్వజరూపంలో ఉన్న ఆంజనేయుడు.
గీతామహాత్మ్యాన్ని శివుడు పార్వతికి, విష్ణువు లక్ష్మీదేవికి, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే ఒకరి సతులతో ఒకరు గీతామహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి. అదికూడా సాధ్యం కానివారు కనీసం పూజగదిలో ఉంచి పూజించాలి.

గీతాగ్రంథాన్ని పఠించిన వారికే కాదు, పూజించిన వారికీ ప్రయోజనకరమే. యజ్ఞం చెసిన ఫలం.  సమస్త  భూమండలాన్నీ దానం చెసినంత ఫలం.  గీతాగ్రందాన్ని పూజించిన దానం చెసినా ఎన్నొ  ఎంత పుణ్యం లభిస్తుందో, గీతాగ్రంథాన్ని పూజించినా, దానం చేసినా అంతే పుణ్యం లభిస్తుంది. సకల పుణ్యతీర్థాలలో అన్ని వ్రతాలూ ఆచరించిన పుణ్యంతో సరిసమానమైన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, గీతాగ్రంథం ఉన్న వారి ఇంట భూతప్రేత రోగబాధలతో సహా దైవిక-దేహిక పీడలు తొలగిపోతాయి.

ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కాని జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి వంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం ఎలాగో వివరించిన గ్రంథం ఇదొకటే! కాబట్టి దీనిని మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసమూ మరొకటి లేదని చెప్పవచ్చు.

భగవద్గీత మానవ సుఖ జీవన మంత్రంగా ఉపయోగించుకోవచ్చు.  ఇది నిజం.

బ్లాగర్లందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)