Blogger Widgets

బుధవారం, మే 16, 2012

పొట్టేళ్ల పోట్లాట జవాబు తెలిస్తేనాకు చెప్పేయండి

బుధవారం, మే 16, 2012

పొట్టేల పోట్లాట  నట్టేట్లో పడిపోయాయి కదచేబుతాను వినండి ఆని మాఅమ్మ  తన  చిన్నప్పుడు తన  క్లాస్ పుస్తకంలో చదువుకుందిట.  ఆ  కధ  నాకు చెప్పింది.  ఆ క ధ  నాకు బలే నచ్చేసింది.  వింటే మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను.  
ఒక  ఊరిలో ఒకానొక  మేక ఆహారము కోసం ఒక  నిలువుగా వున్నా కొండ  ఎ క్కి అక్కడ  ఆహారం తిని తిరిగి వస్తూవుంటడేది .  కానీ  ఆకొండ  ఎక్కాలి అంటే  ఒక నీటి ప్రవాహం దాటాలి.  ఆ నీటి ప్రవాహం మీద  ఒక  బ్రిడ్జ్  వుంది.  కానీ ఆ బ్రిడ్జ్  చాలా ఇరుకుగా వుంటుంది.  దానిమీద  ఒక్కరు మాత్రమే వెళ్ళ గలరు.  అలా ఒకరోజు అలా బ్రిడ్జ్  మీద  దాటుతున్నప్పుడు అటునుండి ఇంకో పొట్టేలు వస్తోంది.  నేను ముందు వచ్చాను నువ్వు వెనక్కి వెళ్ళు నన్ను ముందువెళ్ళని అని ఆ పొట్టేలు అంది.  ఈ పొట్టేలు కూడా అలానే అంది నాను ముందుకు వెళ్ళనీ నువ్వు ముందు వెనక్కి వెళ్ళు అని అన్నాది.  వాటి మద్య  వాదన  పెరిగింది.  రెండు వాటి కొమ్ములతో కొట్టుకున్నాయి.  వాటి మద్య  యుద్ధ వాతావరణం నెలకొంది.  అలా కొమ్ములుతో కొట్టుకొని వాటి కొమ్ములు విరిగిపోయి అవి ఆ నీటి ప్రవాహంలో పడిపోయి కొట్టుకుపోయాయి.  మరలా కొన్ని రోజులు తరువాత  మరలా అదే పరిస్థితి వచ్చింది.  అవే పొట్టేళ్ళు అదే బ్రిడ్జ్ మీద  కలుసుకున్నాయి.  అయితే యిప్పుడు అవి వెనకకు వెళ్ళవు, కొట్టుకోవు నీటిలోకి పడిపోవు,  వాటిదారిలో అవి సమానంగా వెళ్ళిపోతాయి అది ఎలా? మీకు ఒక  hint  కూడా ఇస్తాను అవి ఒక  ఒప్పందానికి వస్తాయి.  అది ఎలాంటి ఒప్పందమో మీరు చెప్పాలి?   అవి ఎ విధంగా రెండు పొట్టేళ్ళు సురక్షితంగా వంతెన ద్వారా మార్పు చెందుతాయి.  మీకు జవాబు తెలిస్తే నాకు తొందరగా చెప్పేయండి మరి.

మంగళవారం, మే 15, 2012

Mickey Mouse - Plane Crazy (1928)

మంగళవారం, మే 15, 2012

First show of the Mickey Mouse on 15th May.

హనుమంతుడు

హనుమాన్  జయంతి శుభాకాంక్షలు.
  
అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు

బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు

దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు

కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు

కాటన్ దొరగారి పుట్టినరోజండి

ఈరోజు గోదావరి ప్రజలు ఎంతో అబిమానించే కాటన్  దొరగారి  పుట్టినరోజు.  ఈ దొరగారి అసలు పేరేమో జనరల్  సర్ ఆర్ధర్ కాటన్ .  ఈయన  బ్రిటిష్  సైనిక అధికారి మరియు నీటి పారుదల  ఇంజీనీయర్.  ఈయన తన జీవితం అంతా నీటి పారుదల  గురించే ఎక్కువ  కృషి చేసారండి.  ఈయన  May 15 న 1803 వ సంవత్సరం లో ఆక్సఫోర్డ్ లో  హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు.   దొరగారు  తన   15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు.    దొరగారు తెలుగు భాషమీద  కూడా ఎక్కువ  అభిమానం కలవారు.  గోదావరి ప్రజలు మీద ఈయన  అభిమానం ఎక్కువ  చూపేవారు.  ఈయన  ఎక్కువగా  కృషి చేసి విజయం సాధించిన   ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన  కాలువల నిర్మాణంగా చెప్పుకోవచ్చు . ఈ కాలువల విభజన వల్ల  మరియు అన్ని ప్రదేశాలను  కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయం లో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. 
దొరగారు ఈ  ఆనకట్ట  లే కాకుండా 1836 - 38 సంవత్సరాలలో  కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం నాకు వచ్చింది .  అన్నిటికంటే ముఖ్యంగా 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు.  గోదావరి డెల్టా ప్రదేశాలు సస్యశ్యామలమై కలకలలాడింది. ఈ  ఆనకట్టల వల్ల  ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది.  ఇంత  గొప్పకార్యానికి  ఆయన కేవలం అయిదేళ్ళలో కాలంలోనే పూర్తి చేశాడు. ఇది చాలా గోప్పవిషయంగా తోచుతోంది  కదండి.  దొరగారు అంతటితో తృప్తి చెందక  కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు కృషి చేసారు . మొత్తం భారత  భూమిని  సస్యశ్యామలం చేయటానికి నదులను మనం ఎలావుపయోగించాలా అన్న  ఆలోచనలు చేసారు .  దానికోసం ఎన్నో పరిసోదనలు చేసారు.   భారతీయులు అందరు దొరగారికి శాశ్వత రుణగ్రస్తులు అయిపోయారు.  దొరగారికి 1861లో సర్‌ బిరుదును పొందాడు .  ఈయన  బ్రిటిష్ వాడు అయినాసరే మనదేశబౌగోళిక  పరిస్తితులు తెలుసుకొని  మనదేశాభివ్రుద్దికి కృషిచేసారు.  కాటన్ దొరగారు భారత  జల సంపద  అనే పుస్తకంలో  “భారతీయ నదీ వ్యవస్థల విషయంలో సర్ ఆర్థర్ కాటన్ అనుపమానమైన అవగాహన కలిగినవాడు. అలాంటి పథకం గత శతాబ్దం (19 వ) లోనే అమలు జరిగి ఉంటే, ఇప్పుడు ఇండియాలో రవాణా ఒక సమస్య అయ్యుండేది కాదు.” కాదు అని రాసారుట. మన  దేశం గురించి ఆయన బాగా అర్ధం చేసుకున్నాడు కదండి.  నిజంగా కాటన్  దొరగారు గ్రేటండి  బాబు.  సారూ గారిని ఈరోజు ఇలా అయినా గుర్తుతెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుండండి .  మరి మీకో.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)