ఈరోజు గోదావరి ప్రజలు ఎంతో అబిమానించే కాటన్ దొరగారి పుట్టినరోజు. ఈ దొరగారి అసలు పేరేమో జనరల్ సర్ ఆర్ధర్ కాటన్ . ఈయన బ్రిటిష్ సైనిక అధికారి మరియు నీటి పారుదల ఇంజీనీయర్. ఈయన తన జీవితం అంతా నీటి పారుదల గురించే ఎక్కువ కృషి చేసారండి. ఈయన May 15 న 1803 వ సంవత్సరం లో ఆక్సఫోర్డ్ లో
హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. దొరగారు తన 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు. దొరగారు తెలుగు భాషమీద కూడా ఎక్కువ అభిమానం కలవారు. గోదావరి ప్రజలు మీద ఈయన అభిమానం ఎక్కువ చూపేవారు. ఈయన ఎక్కువగా కృషి చేసి విజయం సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణంగా చెప్పుకోవచ్చు . ఈ కాలువల విభజన వల్ల మరియు అన్ని ప్రదేశాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయం లో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి.
దొరగారు ఈ ఆనకట్ట లే కాకుండా 1836 - 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం నాకు వచ్చింది . అన్నిటికంటే ముఖ్యంగా 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. గోదావరి డెల్టా ప్రదేశాలు సస్యశ్యామలమై కలకలలాడింది. ఈ ఆనకట్టల వల్ల ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఇంత గొప్పకార్యానికి ఆయన కేవలం అయిదేళ్ళలో కాలంలోనే పూర్తి చేశాడు. ఇది చాలా గోప్పవిషయంగా తోచుతోంది కదండి. దొరగారు అంతటితో తృప్తి చెందక కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు కృషి చేసారు . మొత్తం భారత భూమిని సస్యశ్యామలం చేయటానికి నదులను మనం ఎలావుపయోగించాలా అన్న ఆలోచనలు చేసారు . దానికోసం ఎన్నో పరిసోదనలు చేసారు. భారతీయులు అందరు దొరగారికి శాశ్వత రుణగ్రస్తులు అయిపోయారు. దొరగారికి 1861లో సర్ బిరుదును పొందాడు . ఈయన బ్రిటిష్ వాడు అయినాసరే మనదేశబౌగోళిక పరిస్తితులు తెలుసుకొని మనదేశాభివ్రుద్దికి కృషిచేసారు. కాటన్ దొరగారు భారత జల సంపద అనే పుస్తకంలో “భారతీయ నదీ వ్యవస్థల విషయంలో సర్ ఆర్థర్ కాటన్ అనుపమానమైన అవగాహన కలిగినవాడు. అలాంటి పథకం గత శతాబ్దం (19 వ) లోనే అమలు జరిగి ఉంటే, ఇప్పుడు ఇండియాలో రవాణా ఒక సమస్య అయ్యుండేది కాదు.” కాదు అని రాసారుట. మన దేశం గురించి ఆయన బాగా అర్ధం చేసుకున్నాడు కదండి. నిజంగా కాటన్ దొరగారు గ్రేటండి బాబు. సారూ గారిని ఈరోజు ఇలా అయినా గుర్తుతెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుండండి . మరి మీకో.
Trinad wrote: "మా గోదావరి ప్రజలు సర్ ఆర్ధర్ కాటన్ గారిని దేవుడికన్నా ఎక్కువగా ఆరాదిస్తారు ... ఈ రోజు కాటన్ గారి పుట్టినరోజు ...
రిప్లయితొలగించండిఈ సారూ మా గోదావరి జిల్లాకి .... మరో ....దేవుడు .....
ఈ రోజు ఇలా గుర్తుతెచ్చుకున్నందుకు నాకుకూడా చాలా సంతోషం గా ఉంది ....!"
godavari jillalaku ayana nijamga devude. ayana perita pujalu kuda chesevarata. mahanubhavudu.
రిప్లయితొలగించండి