శుక్రవారం, జనవరి 23, 2009
బుధవారం, జనవరి 21, 2009
బుధవారం, జనవరి 14, 2009
పండుగ శుభాకాంక్షలు
అందరికి సంక్రాంతి పండుగ శుభాకాక్షలు . ఈ పండుగ అందరుకి సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ . శ్రీ వైష్ణవి .
మంగళవారం, జనవరి 13, 2009
తిరుప్పావై 30 వ పాశురము -ఫలశ్రుతి
ఆండాళ్ తిరువడి గలే శరణం :
గోదాదేవి గోపిక ఆ నాడు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రతఫలమును తానుకూడా పొందినది. శ్రీ కృష్ణ సమాగామంమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీ రంగానాధుని భర్తగా పొందినది . శ్రీ రంగమునుండి రంగనాధుడు వ్రత సమాప్తి సమయమునకు తమ అంతరంగా భక్తులను ఆండాలమ్మ యుండిన శ్రీ విల్లిపుత్తురునకు పంపి ఆమెను శ్రీ రంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను .అంత భట్తనాదులు వారి శి ష్యులు వల్లభారాయులుతో సహా శ్రీ రంగమునకు ఆండాల్లమ్మను తోట్కుని వెళ్ళెను .అచట శ్రీ రంగనాధ స్వామీ అందరి సమక్షములో శ్రీ గోదాదేవిని తనలోచేర్చుకున్నారు. అందుచే గోదారంగానాయకుల కళ్యాణ దినమునకు భోగి ఆని పేరు .
భోగము = పరమాత్మ అను భావము
అది పోందినరోజును భోగి పండుగగా సార్ధకమైనది.
ఇలాఆండాళు వ్రతముచేసి ఆనాడు గోపికలు పొందిన ఫలమును తాను పొందగలిగినది. ఆ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక.
గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చేయుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.
పాశురము:
వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్
అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.
తాత్పర్యము:
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసిన లక్ష్మీ దేవిని పొం మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కుడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్ష్నణాభరణములు దాలిచిన వారు అగు గోపికలు చేరి , మంగళము పాడి, పఱ అను వాద్యమును లోకులకొరకును, భగవద్దస్యమును తమకొరకు ను పొందిరి . ఆ ప్రకారము లొకమునంతకును లోకమునకు ఆభరణమైఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలొ ధరించిఉండు శ్రీ భట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాశురములలో మాలికగా కూర్చినది.
ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును.
అని ఫలశ్రుతి పాడిరి.
ఆండాళ్ తిరువడి గళే శరణం , జై శ్రీమన్నారాయణ్ ,
సర్వేజనా సుఖినో భవంతు .
ఓం శాంతి శాంతి శాంతీః