సోమవారం, జనవరి 12, 2009
బోగి పండుగ శుభాకాంక్షలు
పండుగ శుభాకాంక్షలు . మన ఆంద్రులుకు సంవత్సరములో అతిపెద్ద పండుగ మూడురోజులు వరుసగా జురుపుకొనే పండుగ ఇది అందుకే దీనిని పెద్ద పండుగ అనికూడా అంటారు. మొదటిది భోగి, రెండోది సంక్రాంతి, మూడోది కనుమ . ఈ పండుగలను మనదేశములో అన్ని రాష్ట్రాలలోని జరుపుకుంటారు. కాకపొతే వాటికి వారివారి పేరులు ఉన్నాయి.
అసలు ఈ పండుగ జరుపుకోనుతకు ప్రత్యేకమైన కారణం ఏమిటంటే సంవత్సరములో మొదటి పంట చేతికి అందుతుంది దానికి సంతోషముతో ఈ పండుగలను ఆనంద ఉత్సాహాలతో జరుపుకొంటారు.
ఈ మూడురోజులు పండుగ చాలా బాగాజరుపుకుంటారు. అసలైతే ఈ నెలరోజులు పండుగ వాతావరణమే వుంటుంది .
చలి ఎక్కువుగా ఉంటుంది. ఈ నెలరోజులు తెలుగువారి లోగిలి చాలా అందముగా ముస్తాబవుతుంది . ప్రతీ ఇంట రంగురంగుల ముగ్గులతో చక్కని వాతావరనముతో ముచ్చట గొల్పుతూ వుంటాయి. ఆ రంగుల ముగ్గు మద్యలో గొబ్బెమ్మలు ను అలంకరించుతారు. సాయంత్రము సమయాలలో పోలాల్లోనుమ్డి బళ్ళు ధాన్యపు బస్తాలతో నిండి వస్తాయి. చాలా ఆనందముగా సందడిగా ఉంటుంది . ఈ నెల రోజులు.ఆ నెల రోజులు, పగటి వేషగాళ్ళు, హరిదాసులు ,గంగిరేద్దులువాళ్ళు వస్తూవుంటారు .
భోగి పండుగ జనవరి 13 వ తారికున వస్తుంది . భోగి రోజు తెల్లవారుజాముననే లేచి నలుగు పెట్టుకొని స్నానాలుచేసి భోగి మంటను వెలిగిస్తారు . ఈ భోగి మంట లో పాత కర్ర సమానులు వంటివి పనికిరాని వన్ని వేసి చలిని పారగోలుపుతారు. ఈ పెద్ద పండగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి తప్పకుండా వస్తారు. బావా మరదళ్ల ఆటలు అల్లర్లుతో పండుగ చాలా సంతోషకరమైన శోభ తో ఉంటుంది. ఈ పండుగని రాయి తులు పండుగ అని కుడా అంటారు.
ఈ పండుగకి ముగ్గులులో గొబ్బెమ్మలు పెడతారు వాటి చుట్టూ పిల్లలు అన్నమాచార్య రచించిన గొబ్బెమ్మల పాట్లు పాడతారు.
కొలని దోపరికి గొబ్బిళ్ళో !
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికి గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున గంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో
దండివైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిబైడి యగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో
అనే పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతారు. సాయంత్రము సమయములో చిన్నపిల్లలకు బోగిపల్లును దిస్తితీసి వారి తలమీద పోస్తారు. దీనికి పెరంటాల్లను పిలిచి బోగిపళ్ళు పోస్తారు. ఈ బోగిపల్లలోకి శనగలు , పువ్వులు , అక్షింతలు, డబ్బులు, చెరుకుగడలు, రేగుపళ్ళు వేసి పిల్లలకు దిష్టితీసి తలమీదవేసి ఆసిర్వాదిస్తారు. బొమ్మల కొలువు పెట్టి పేరంటాలకి పసుపుకుంకుమలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు.
ఈ బోగి రోజు నెలరోజులు ధనుర్మాసము వ్రతము చేసిన గోదాదేవి రంగానాధునిని వివాహము చేసుకొని స్వామీ వారిలో ఐక్యము అయిపోతుంది. అందువలన అప్పటినుండి భోగిరోజు గోదా రంగానాయకులవివాహాలు ఆలయాలలోజరుపుతారు. ఈ వివాహము చూడటానికి రెండుకళ్ళు చాలని విధముగా చేస్తారు. ఇలా భోగి పండుగ ముగుస్తుంది.
తిరుప్పావై 29 వ పాశురం-ఎన్నెన్నో జన్మల బందం
ఆండాళ్ తిరువడి గలే శరణం :
మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.
కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్
కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు.
ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పుత్ర్తి చేస్తున్నారు. ముప్పైవ పాసురములో ఫలశ్రుతి.
మొదటి పాసురమున గోపికలు ఈ వ్రతమును ప్రారంభించారు.
అయితే గోపికలు ఈ పాసురములో తమ హృదయము నావిష్కరిమ్చి తమ వ్రతమును సమాప్తము చేసి మనము కూడా తరించవలెనని ఈ పాశురములో స్పష్టముగా వివరించినారు.
పాశురము :
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్
తాత్పర్యము:
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.
స్వామీ వివేకానందుడు - సూక్తులు పాటిద్దామా ..........?
వివేకానందుడు: ఈ రోజు వివేకానందుని పుట్టినరోజు . ఈ రోజు ఆయన సూక్తులు ఒకసారి మననం చేసుకుందామా......
ఎవరినీ తప్పు పట్టవద్దు , నిందించవద్దు
సహాయపడగలిగితే సాయంచేయ్యి
లేకపోతె ఆశీర్వధించి పంపివేయు
మనలను మన ఆలోచనలే తీర్చు దిద్దుతాయి
మాటలదేముంది ఆలోచనలే కలకాలం ఉంటాయి .
సుదూరము ప్రయాణము చేస్తాయి .
దేవుడు ఎక్కడో లేదు . నీలోనే ఉన్నాడు.
ప్రతీ జీవిలోను ఉన్నాడు.
ఇతరులకి మనము ఎంత మేలుచేస్తే
మన హృదయాలు అంత పవిత్రమవుతాయి.
అందులోనే దేవుడున్నాడు.
ఈ విధముగా ఆ మహనీయుడిని గుర్తు చేసుకోవటం చాలా సంతోషముగా వున్నది . ఆయన సూక్తులను పాతిదాం మరి.